Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Complex Level Training Class

Complex Level Training Class

Complex Level Training Class

1 నుండి 5 వ తరగతి బొధించు ఉపాద్యాయులకు primary కాంప్లెక్స్ స్థాయి మరియు 

6,7 తరగతులకు బొధించు ఉపాధ్యాయులకు సబ్జెక్ట్ కాంప్లెక్స్ స్థాయి లో  కొత్త పాఠ్య పుస్తకాలపై 

 రెండవ స్పెల్  లో 

 ది. 28.08.2021 న జరగవలిసిన ఒక రోజు శిక్షణా కార్యక్రమమునకు సంబందించి మండల విద్యాశాఖాధికారులకు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ముఖ్య సూచనలు  

పాఠశాల విద్య డైరెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు ది. 21.08.2021 న ప్రతి కాంప్లెక్స్ నందు 1 నుండి 5 వ తరగతి బొధించు ఉపాద్యాయులలో 50 % మందికి, VI,VII తరగతులకు తెలుగు, హింది, ఇంగ్లీష్ బోధించు  సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు  మొదటి స్పెల్  One Day Orientation teachers on New Text Books at school complex level నిర్వహించబడినది. 

రెండవ స్పెల్ నందు ది 28.08.2021 వతేదీన 1 నుండి 5 వ తరగతి బొధించు ఉపాద్యాయులలో మిగిలిన 50 % మందికి Primary Complex నందు మరియు VI,VII తరగతులకు గణితం, సైన్సు, సోషల్ బోధించు  సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు సంబందిత సబ్జెక్ట్ కాంప్లెక్స్ నందు One Day Orientation teachers on New Text Books ను నిర్వహించవలెను. 

ఈ శిక్షణా కార్యక్రమంలో Resource Persons గా వ్యవహరించటానికి  ప్రతి ప్రైమరీ కాంప్లెక్స్ నలుగురు (Tel-1, Eng-1, Maths-1, EVS-1)  మరియు UP Level Subject కాంప్లెక్స్ నకు సబ్జెక్ట్ కు ఇద్దరు చొప్పున మండల విద్యాశాఖాదికారుల ద్వారా ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులకు ది. 19.08.2021 వ తేదీన రాష్త్ర వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా అవగాహన కల్పించబడింది. వారి సేవలు ఉపయోగించుకొనవలెను. 

మండల విద్యాశాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు & సంబంధిత కాంప్లెక్స్ సి.ఆర్.పి లు ది. 28.08.2021 వ తేదీ శిక్షణా కార్యక్రమమునకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయవలెను.

ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం మండల విద్యాశాఖాధికారులు,  సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్ లు శిక్షణా కార్యక్రమమును నిర్వహించి, ఉదయాన్నే 10.00 గం.ల లోపు ఉపాద్యాయుల  హాజరు వివరాలు, కార్యక్రమ ఫోటోలను Divisional Level Complex HMs Whats group నందు మరియు ఇతర సంబందిత గ్రూప్ నందు షేర్ చేయగలరు.

మొత్తం రెండు రోజుల కార్యక్రమ డాక్యుమెంటేషన్ ను 29.08.2021 వ తేదీ సాయంత్రం 5.00 గం. ల లోపు సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయమునకు   dpepkri@yahoo.co.in  మెయిల్  కు పంపవలెను. 

రాష్ట్ర కార్యాలయము నుండి 2  google online forms పంపబడతాయి.  వాటిలో ఒకటి School Complex Headmasters, మరొకటి Participant Teachers లు online నందు పూర్తి చేసి submit చేయవలెను. 

ఇది తప్పనిసరిగా చేయవలిసిన పని.  

సబ్జెక్ట్ కాంప్లెక్స్ లు :-  

6,7 వ తరగతులకు బొధించు ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులలో Maths,Sci,Soc సబ్జెక్ట్ Teachers   ది. 28.08.2021 వ తేదీన సబ్జెక్ట్ కాంప్లెక్స్ స్థాయి లో జరుగు శిక్షణా కార్యక్రమము నకు హాజరు కావలెను. 

సంబందిత మండల విద్యాశాఖాధికారులు వారి మండలం లో ఏ సబ్జెక్ట్ కాంప్లెక్స్ ఎక్కడ నిర్వహించబడుతున్నదీ, సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు / ప్రధానోపాధ్యాయులకు తెలియచేసి అందరూ హాజరగునట్లు చర్యలు తీసుకొనవలెను.

General Instructions: 

శిక్షణ కు హాజరగు ఉపాధ్యాయులందరికీ నూతన విద్యా విధానం – 2020, నూతన పాఠ్య పుస్తకాలు, పాఠ్యపుస్తకము నందలి QR Codes, DIKSHA మున్నగు వాటిపై అవగాహన కలిగేటట్లు చూడవలెను. 

హాజరయ్యే ఉపాధ్యాయులు అందరు తమతో పాటు న్యూ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ మరియు హ్యాండ్ బుక్ లతో హాజరుకావలెను.

శిక్షణా తరగతులు జరుగుచున్న రోజులలో ఏ ఒక్క పాఠశాల మూసివేయబడకూడదు. 

 సమగ్ర శిక్షా సెక్టొరల్ అధికారులు తమ పరిధిలోని శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షించవలెను.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Complex Level Training Class"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0