Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Respiratory Rate

 Respiratory Rate : మీ శ్వాస తీసుకునే విధానాన్ని బట్టి వ్యాధులను గుర్తించొచ్చు .. అదెలాగో వివరణ.

Respiratory Rate

Respiratory Rate: భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. భారతదేశం ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొంది. ఈ సమయంలో మనమందరం దేశంలోని అత్యంత భయానక పరిస్థితులను చూశాం. లక్షలాది మందికి కరోనా సోకడంతో.. ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడింది. చికిత్సకు అవసరమైన మందులు కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం దేశంలో అలాంటి సమస్య లేదు. కానీ, ఇప్పటికీ దేశవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది కొత్త రోగులు బయటకు వస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది మరణిస్తున్నారు. మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, శ్వాసకోశ వ్యవస్థపై కరోనా దాడి చేస్తుందని మనందరికీ తెలుసు.

దీని కారణంగా వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉత్పన్నమై.. ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం వల్లే రోగి ప్రాణాలమీదకు వస్తోందని వైద్యులు చెబుతున్నారు. కాగా, వైరస్ వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో శ్వాస రేటు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

శ్వాసక్రియ రేటు అంటే ఏమిటి?
శ్వాస రేటును అంటే.. ఒక నిమిషం వ్యవధిలో మీరు ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటారో దానినే శ్వాస రేటు అంటారు. ఈ కీలక అంశం గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందు.. శ్వాసకోశ రేటు మానవ శరీరానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణం అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా అనేక రకాల వ్యాధులు గుర్తించబడతాయి. నిమిషానికి తీసుకునే శ్వాసను శ్వాస రేటు లేదా శ్వాస రేటు అంటారు. చిన్నపిల్లలు, వయోజనుల శ్వాస రేటులో చాలా తేడా ఉంటుంది. నవజాత శిశువు, వయోజనుల శ్వాస రేటు ఎలాంటి ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వయోజనుల సాధారణ శ్వాసక్రియ రేటు ఎలా ఉండాలి..
Healthline.com నివేదిక ప్రకారం.. పెద్దవారి సాధారణ శ్వాస రేటు 12 నుంచి 16 వరకు ఉంటుంది. అంటే, ఆరోగ్యవంతులైన వయోజనుడు నిమిషంలో 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటారు. మీ శ్వాస రేటు 12 కన్నా తక్కువ లేదా 16 కంటే ఎక్కువ ఉంటే, మీరు డాక్టర్‌ని సంప్రదించాలి. అయితే, కొన్ని సందర్భాల్లో మీ శ్వాస రేటులో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు. కానీ మీ శ్వాస రేటులో మీరు పెద్ద వ్యత్యాసాన్ని చూసినప్పుడు, ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయం. మీ నాడీ వ్యవస్థలో చోటు చేసుకునే మార్పుల కారణంగానే.. సాధారణ శ్వాస రేటు కంటే తక్కువ శ్వాస రేటు నమోదవుతుందన్నారు. అలాగే.. పెరుగుతున్న వయస్సుతో పాటు మన శ్వాస రేటు కూడా మారుతూ ఉంటుందట.

నవజాత శిశువులకు అత్యధిక శ్వాస క్రియ రేటు ఉంటుంది..
వయోజనుడితో పోలిస్తే చిన్నపిల్లల శ్వాస రేటులో చాలా తేడా ఉంది. పిల్లల శ్వాస రేటు వేగంగా మారుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడే పుట్టిన శిశువు నిమిషానికి 30 నుంచి 60 సార్లు శ్వాస తీసుకుంటుంది. ఈ శ్వాస రేటు పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వరకు ఉంటుంది. 1 నుండి 3 సంవత్సరాల పిల్లవాడు ఒక నిమిషంలో 24 నుండి 40 శ్వాసలను తీసుకుంటాడు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లవాడు నిమిషంలో 22 నుండి 34 సార్లు శ్వాస తీసుకుంటాడు. 6 నుండి 12 సంవత్సరాల పిల్లల శ్వాస రేటు 18 నుండి 30 మధ్య ఉంటుంది, అయితే 12 నుండి 18 సంవత్సరాల పిల్లల శ్వాస రేటు 12 నుండి 16 వరకు ఉంటుంది. వయోజనుల శ్వాస రేటుతో సమానంగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కూడా మారుతూ ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Respiratory Rate"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0