Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Consequences with the closure of schools

 స్కూళ్ల మూసివేతతో విపరిణామాలు

Consequences with the closure of schools

  •  అవి విస్మరించలేనంత తీవ్రమైనవి
  • పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం
  • సాధ్యమైనంత త్వరగా పాఠశాలలు పునఃప్రారంభించాలి.
  • పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక

కోవిడ్- 19 మహమ్మారి ప్రభావంతో గత ఏడాదిన్నర కాలంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. బడికి వెళ్లి విద్యాబద్ధులు నేర్చు కోవాల్సిన చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. తోటి విద్యార్థులతో ఆటపాఠలకు దూరమయ్యారు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లే నేస్తాల య్యాయి. ఆన్లైన్లోనే పాఠాలు వింటున్నారు. అయితే, ఇలాంటి పరిణామం ఎంతమాత్రం వాంఛ నీయం కాదని పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది. విద్యార్థులను నాలుగు గోడలకే పరిమితం చేయొద్దని, వీలైనంత త్వరగా పాఠశాలలు పునఃప్రారంభించాలని, వారిలో మేధోవికాసా బాటలు వేయాలని ప్రభుత్వానికి సూచించింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు వినయ్ పి.సహస్రబుద్ధ నేతృత్వంలో విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తన నివేదికను శుక్రవారం పార్ల మెంట్కు సమర్పించింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. స్కూళ్ల మూసివేత వల్ల తలెత్తే విపరిణామాలు విస్మరించలేనంత తీవ్రమైనవని తేల్చిచెప్పింది. కుటుంబాల సామాజిక జీవ సంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇంటి పనుల్లో పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొంది. వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించింది. చిన్నారులు ఇళ్లకే పరిమితమై ఉంటే తల్లిదండ్రులు, వారి మధ్య ఉన్న సంబంధా లు సైతం ప్రభావితమవుతాయని వెల్లడించింది.. 

రెండు షిప్టుల్లో క్లాసులు

పాఠశాలలు ఏడాదికిపైగా మూతపడడం వల్ల చదువులు ఆగిపోవడమే కాదు, దేశంలో బాల్య వివాహాల సంఖ్య కూడా పెరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా స్కూళ్లను తెరిచే ఆలోచన చేయాలని ఉద్ఘాటించింది. విద్యార్థు లకు, ఉపాధ్యాయులకు, పాఠశాలల సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేసి, పాఠశాల లు తెరవొచ్చని సూచించింది. స్కూళ్లలో భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వెల్లడించింది. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి రెండు షిప్టుల్లో క్లాసులు నిర్వహించాలని తెలిపింది. పిల్లలను సెక్ష న్లుగా విభజించి, రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించవచ్చని సూచించింది. 

స్కూళ్లలో తరచుగా తనిఖీలు

విద్యార్థుల నుంచి హాజరు తీసుకొనేటప్పుడు ధర్మల్ స్క్రీనింగ్ తోపాటు తరచుగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించాలని స్థాయీ సంఘం కోరింది. ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్ కాన్సంట్రే టర్లు ఏర్పాటు చేయాలని, పిల్లలకు ఏదైనా ఆనారోగ్యం సంభవిస్తే వైద్య సాయం అందించడా నికి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. స్కూళ్లలో కోవిడ్ -19 ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం హెల్త్ ఇన్స్పెక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తరచుగా తనిఖీలు చేయాలని తెలిపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశా ల్లో పాఠశాలలను పునఃప్రారంభించారని, అక్కడ పాటిస్తున్న ఉత్తమమైన విధానాలను మన దేశం లోనూ అమలు చేయవచ్చని తెలియజేసింది.. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల 2020 మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్లో కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లను తెరిచినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ మూసివేయాల్సి వచ్చింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Consequences with the closure of schools"

Post a Comment