Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona not wanting to leave school

 పాఠశాలలను వదలనంటున్న కారోనా


AP Schools: స్కూళ్లు తెరవకపోతే.. ఓ బాధ. తెరిస్తే మరో బాధ.. అయోమయ స్థితిలో పేరెంట్స్

స్కూళ్లు తెరవకపోతే.. ఓ బాధ. తెరిస్తే మరో బాధ అన్నట్లు ఉంది పరిస్థితి. బడికి పంపి నాలుగు అక్షరాలు నేర్పిద్దామనుకుంటే.. అసలు జీవితం ఉంటుందో లేదోనన్న భయం మొదలైంది. ఏపీలో స్కూళ్లు తెరిచాక పరిస్థితి ఓసారి తెలుసుకుందాం.

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు స్కూల్స్‌ను పునః ప్రారంభించాయి. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆగష్టు 16వ తేదీ నుంచి స్కూల్స్‌ను రీ-ఓపెన్ చేసింది. అయితే అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం.. తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. స్కూల్స్ పునః ప్రారంభంతో మరోసారి వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేగింది. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. పెదపాలపర్రు జడ్పీ హైస్కూల్‌లో 10 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా కలకలం రేగింది. బొబ్బిలి పరిధిలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పది మంది 4వ తరగతి విద్యార్థులు కొవిడ్‌ బారినపడినట్లు ఎంఈవో లక్ష్మణరావు తెలిపారు. పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉండగా.. ఏడుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పది మంది విద్యార్థులు వైరస్‌ బారినపడడంతో పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల మధ్యాహ్న భోజన సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు ఎంఈవో వెల్లడించారు. వారం రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విద్యార్థులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, వారందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎంఈవో వివరించారు. అటు చిన్నారుల నుంచి వైరస్‌ వ్యాప్తి జరక్కుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ కరోనా మహమ్మారి మనుషులు జీవితాలను సాఫీగా పోనిచ్చేలా లేదు. ఇప్పుటికే రెండేళ్లు చదువు అటకెక్కింది. ఇలానే కొనసాగితే ఎలా..? పోని బళ్లకు పంపిద్దామంటే కరోనా భయం. ఏం చెయ్యాలో తెలియక పేరెంట్స్ అయోమయ స్థితిలో ఉన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona not wanting to leave school"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0