Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news on vehicle re-registration!

వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌పై శుభవార్త!

Good news on vehicle re-registration!

న్యూఢిల్లీ : వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఒక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బదిలీ అయినపుడు తన వాహనానికి మరోసారి రిజిస్ట్రేషన్ చేయించవలసిన  అవసరం ఉండదు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదలైంది.

ఈ నూతన విధానానికి సంబందించిన నోటిఫికేషన్‌ను రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. బీహెచ్ సిరీస్ క్రింద వాహనాల రిజిస్ట్రేషన్ విధానం ప్రయోజనాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులు పొందవచ్చు. నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలుగల కేంద్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ/ కేంద్ర/రాష్ట్ర పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు/ఆర్గనైజేషన్లలో పని చేసే ఉద్యోగులు ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.

రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య వ్యక్తిగత వాహనాలు స్వేచ్ఛగా సంచరించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాహనం యజమాని ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి బదిలీ అయినపుడు, ఈ వాహనాన్ని కూడా తనతోపాటు తీసుకెళ్ళడానికి కొత్తగా మరోసారి రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరం ఉండదు.

ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాన్ని వేరొక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఉపయోగించాలంటే, 12 నెలల లోపుగా రీ-రిజిస్ట్రేషన్ చేయించవలసి ఉంటుంది. దీంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. బీహెచ్ సిరీస్ స్కీమ్‌తో ఈ కష్టాలకు తెరపడుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news on vehicle re-registration!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0