Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Government Teachers' Doubts - Answers

 ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు – సమాధానాలు 

Government Teachers' Doubts - Answers

సందేహాలుసమాధానాలు

ప్రశ్న:

భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనపప్పుడు, వారిలో ఎవరైనా ఒకరు మరణించిన సందర్భంలో ఆ కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం ఇస్తారా? ఏదైనా జీవో ఉన్నదా?

సమాధానం

కారుణ్య నియామకం హక్కు కాదు. చనిపోయిన ఉద్యోగి కుటుంబం రోడ్డున పడకుండా ఇచ్చిన Social Welfare Scheme.  కుటుంబానికి ఆదాయ మార్గాలున్నప్పుడు కారుణ్య నియామకం ఇవ్వరు.

ప్రశ్న:

సార్ నాకు ఇంక్రిమెంట్ జనవరి నెలలో వస్తుంది కానీ నేను 2020 అక్టోబర్ లో లీవ్ వెళ్లినాను. జూన్ 2021 నెలలో జాయిన్ అయ్యాను. ఇంక్రిమెంట్ డేట్ జనవరి లోనా? జూన్ లోనా? చెప్పండి.

సమాధానం

జనవరిలో ఇంక్రిమెంట్ తేదీన మీరు లీవ్ లో ఉన్నారు కాబట్టి, ఆ లీవ్ నుండి జాయిన్ అయిన తర్వాత మాత్రమే, జాయినింగ్ తేదీన వస్తుంది. మెడికల్ లీవులో వెళ్ళారు కాబట్టి, ఈ సంవత్సరం, జూన్ లో వస్తుంది. తర్వాత జనవరికి వస్తుంది.

 ప్రశ్న

నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను. నాకు పదోన్నతి ఇస్తారా? ఇవ్వరా?

సమాధానం

స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.

ప్రశ్న:

డిపార్ట్మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు ఎన్నిసార్లు Onduty సౌకర్యం ఏ ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది?

సమాధానం

AP ట్రావలింగ్ రూల్స్ లో 73 ప్రకారం , F.R 9(6)(B)(iii) ప్రకారం ఒక అభ్యర్థి డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరగుటకు DA లేకుండా రెండుసార్లు TA మరియు OD సౌకర్యాన్ని వినియోగించవచ్చును.

ప్రశ్న:

SA(Hindi) గా పనిచేయుచున్న నేను HM Post ప్రమోషన్ కు అర్హుడనేనా ?*

జవాబు:

అవును. సంబంధిత డిపార్ట్ మెంట్ టెస్టు పాస్ అయి, డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయితే 45 సం.లు దాటినా లేదా స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినవారు 50సం.లు వయస్సు దాటినా హెచ్.ఎం గా ప్రమోషన్ పొందడానికి అర్హులు. 10వ తరగతి తర్వాత 5 సంవత్సరములు స్టడీ ఉండాలి.

ప్రశ్న

ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు?

జవాబు:

రూల్-22A ప్రకారం అన్ని కేటగిరీలకు చెందిన రిజర్వేషన్ స్థానాలలో మహిళలు కి 33 1/2 % రిజర్వ్ చేయబడి ఉన్నది. sc/st/bc/oc కేటగిరీల వారికి కేటాయించబడిన స్థానాలలో ఆయా కేటగిరీకి చెందిన మొదటి స్థానం, ఆ తదుపరి ప్రతి మూడవ స్థానం మహిళలకి రిజర్వ్ చేయబడింది. పై రెండు రకాల రిజర్వేషన్లు వర్తింపజేస్తూ కమ్యూనల్ రోస్టర్ తయారు చేయబడుతుంది.

ప్రశ్న:

నేను 13.6.16 న విధులలో చేరాను. ట్రైనింగ్ లేదు. కానీ జీతం 1.6.16 నుండి ఇచ్చారు. ఇపుడు జాయినింగ్ తేదీగా ఏది SR లో రాయాలి?

సమాధానం

జీతం 1.6.16 నుండి ఇచ్చారు కాబట్టి మీ date of జాయినింగ్ కూడా 1.6.16 రే అవుతుంది.

 ప్రశ్న:

నేను CPS ఉద్యోగిని. సేవింగ్స్ 1,20,000/- ఉన్నాయి. CPS మినహాయింపు 53,000/- ఉన్నాయి. వీటిని ఐటీ ఫారంలో ఎలా చూపాలి

సమాధానం

30,000/- వరకు 80ccd(1) కింద, మిగిలిన 23,000/- ను 80ccd(1బి)కింద చూయించి పన్ను మినహాయింపు పొందవచ్చు.

ప్రశ్న:

ఈ సంవత్సరం రెండు DA లు కలపటం వల్ల నా ఆదాయం 5 లక్షలు దాటింది. 20% పన్ను పరిధిలోకి వెళ్ళాను. ఆ రెండు DA లు గత సంవత్సరం ఆదాయంలో చూయించుకోవచ్చా?

సమాధానం

చూపించుకోవచ్చు. గత సంవత్సరంనకు చెందిన బకాయిలను ఆయా సంవత్సరాలలో చూపి పన్ను మినహాయింపు పొందవచ్చు. అందుకోసం ఫారం 10-E సమర్పించాలి.

ప్రశ్న:

నేను ఎయిడెడ్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నాను. నేను HM అకౌంట్ టెస్ట్ పాస్ కాలేదు. నేను 6,12,18 ఇయర్స్ స్కేల్స్ పొందాను. నాకు 24 ఇయర్స్ స్కేల్ కి అర్హత ఉన్నదా?

సమాధానం

ఉన్నది. నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా నియమించబడినందున మీరు 24 ఇయర్స్ స్కేల్ పొందాలంటే రెండవ ప్రమోషన్ పోస్ట్ లేనందువలన మీకు అర్హతలతో సంబంధం లేకుండా 24 ఇయర్స్ పూర్తి కాగానే స్కేల్ మంజూరు చేయబడుతుంది.

ప్రశ్న:

నేను LFL HM గా పనిచేయుచున్నాను. 6 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను. 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి. నాకు ప్రస్తుతం 50 ఇయర్స్ నిండినవి.

సమాధానం

మీరు 12 ఇయర్స్ స్కేల్ తీసుకోవాలి అంటే డిగ్రీ, బి.ఎడ్ లతో పాటు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి ఉండాలి. మెమో.34408 తేదీ:4.2.12 ప్రకారం 50 ఇయర్స్ మినహాయింపు వర్తించదు.

ప్రశ్న:

12 years ఇంక్రిమెంట్ కు 12 years తరువాత department టెస్ట్ పాస్ ఐతే ఇంక్రిమెంట్ ఇస్తారా? నేను ఒక ప్రమోషన్ తీసుకున్నాను. అయినా ఇస్తారా?*

సమాధానం

12సంవత్సరాల సర్వీసు పూర్తి అయ్యేలోపు ప్రమోషన్ తీసుకున్నట్లయితే 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ రాదు. ప్రమోషన్ పోస్ట్ లో మళ్ళీ 6 సంవత్సరాల సర్వీసు పూర్తి అయినట్లయితే, ప్రమోషన్ పోస్ట్ లో 6 సంవత్సరాల స్కేల్ వస్తుంది.

ఒకవేళ ప్రమోషన్ తీసుకోని వారికి ప్రమోషన్ పోస్ట్ ఉండి, దానికి క్వాలిఫై అయినా కూడా, కేవలం వేకెన్సీ లేక ప్రమోషన్ రానందువల్ల AAS 1A ఇవ్వాలి. ప్రమోషన్ కు ఎప్పుడు క్వాలిఫై అయితే ( 12 సం. తర్వాత) అప్పటినుండి (ప్రమోషన్ రాని సందర్భాలలో) AAS 1A ఇవ్వాలి.

ప్రశ్న:

సార్, నేను కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. నేను నా యొక్క సర్ name గేజిట్ ద్వారా మార్చుకున్నాను. నా ఆధార్, pan, చేంజ్ అయినవి. మా sp సార్ కి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాను. నా సర్వీస్ బుక్, APGLI, ఆరోగ్య భద్రత, భద్రత, etc... మార్చటానికి దానికి sp సార్ ఒక memo ఇచ్చారు మార్చుకోవచ్చు అని, నా సందేహం ఏమిటంటే నేను cps ఎంప్లాయ్ ని PRAN లో నా సర్ name మార్చుకోవాలంటే నేను ఎవరికీ అప్లై చేయాలి. దయచేసి సలహా ఇవ్వగలరు.

సమాధానం

S2 form ఫిల్ చేసి డిడిఓ కవరింగ్ లెటర్ ద్వారా ట్రెజరీ ద్వారా NSDL వారికి అప్లై చేయండి

ప్రశ్న:

సార్ నేను డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి 4 సంవత్సరాలు అయింది. ఇపుడు డిపార్ట్మెంట్ చేంజ్ కావడానికి పర్టిక్యులర్ ఉంటే పంపించండి సార్

సమాధానం

సాధారణంగా ఒక డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన వారు అదే డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యే వరకూ పని చేయవలసియుంటుంది. ఒక డిపార్ట్మెంట్ నుంచి మరో డిపార్ట్మెంట్ కు మారడానికి ఎలాంటి ఉత్తర్వులూ లేవు.*

కాకపోతే డిపార్ట్మెంట్ల రద్దు వంటి సందర్భాల్లో సర్ప్లస్ అయితే ఖాళీలు ఉన్న డిపార్ట్మెంట్ కు ప్రభుత్వమే మారుస్తుంది.

There is no provision for transfer from one unit to another unit in the APMS Rules, 1998.

కానీ ఒక డిపార్ట్మెంట్ నుండి వేరొక డిపార్ట్మెంట్ కు బదిలీలు అడపాదడపా జరుగుతూనే ఉంటాయి. దానికి పొలిటికల్ విల్ అవసరము. అది ఉంటే ఏ రూల్స్ అవసరం లేదు. పొలిటికల్ విల్ లేకపోతే రూలున్నా కానివి ఉంటాయి. అర్ధమయ్యిందనుకుంటాను.

ప్రశ్న

నేను PF నుండి ఋణం పొందియున్నాను.

వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??

సమాధానం

ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

ప్రశ్న

ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??

సమాధానం

జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ప్రశ్న

ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి??

సమాధానం

ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.

ప్రశ్న

నేను సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.

ప్రశ్న

నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను. రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే, DEO గారి అనుమతి తీసుకోవాలా?

సమాధానం

అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి.

ప్రశ్న

చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో  ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?

సమాధానం

G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి. మంజూరు ఉత్తర్వులిచ్చి, ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది.

ప్రశ్న

స్కూల్ ఇంచార్జ్ బాధ్యతలు హెచ్.ఏం ఎవ్వరికైనా ఇవ్వవచ్చునా ? లేక సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలా ?

సమాధానం

డి.ఎస్.సి ఉత్తర్వుల సంఖ్య Rc.2409/C3-1/2004 తేది :27.01.2005 ప్రకారం ప్రధానోపాధ్యాయుని అర్హతలు కలిగిన వారిలో సీనియరు ఉపాధ్యాయుడిని మాత్రమే ఇంచార్జ్ గా లేదా ఎఫ్.ఏ.సి.గా నియమించాలి.

ప్రశ్న

ఎస్.జి.టి ఉపాధ్యాయుడు 24 సం॥ స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత సాధించాలా ?

సమాధానం

G.O.Ms.No.38 Fin తేది:15.04.2015 ప్రకారం 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు (GOT&EOT) ఉత్తీర్ణత సాధించాలి

ప్రశ్న

 వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత సర్వీస్ పూర్తిచేసి ఉండాలి? పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా?

సమాధానం

ఏ.పి.రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూల్ 43 ప్రకారంగా 20 సం॥ సర్వీసు (అసాధారణ సెలవు కాకుండా) పూర్తిచేసిన వారికి వాలంటరి రిటైర్మెంట్ అర్హత లభిస్తుంది. రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.

ప్రశ్న

నేను PF నుండి ఋణం పొందియున్నాను.

వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??

సమాధానం

ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

ప్రశ్న

ఇంటి నిర్మాణానికి అడ్వాన్స్ తీసుకుంటే ఎప్పటి లోగా తీర్చాలి??

సమాధానం

ఇంటి నిర్మాణానికి అడ్వాన్సు తీసుకుంటే 300 నెలల్లో, మరమ్మతులకి తీసుకుంటే 90 నెలల్లో,ఇంటి స్థలం కోసం తీసుకుంటే 12 నెలల్లో తీర్చాలి.

ప్రశ్న

వాల0టరీ  నియామకం పొందువరికి కారుణ్య నియామకం వర్తిస్తుందా??

సమాధానం

వర్తించదు.ల

ప్రశ్న

CCL ను DDO నుండి ఎప్పటిలోగా తీసుకోవాలి??

సమాధానం

ఏ CCL ఐనా తాను పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి 6 నెలలలోపే DDO దగ్గర నుండి పొందాలి.

ప్రశ్న

వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్ వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు??

సమాధానం

మెమో.14568 ,తేదీ:31.1.2011 ప్రకారం పే,డీఏ సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.

ప్రశ్న

ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్ గా పొందవచ్చు??

సమాధానం

ఇంటి మరమ్మతులు, విస్తరణకు ములవేతనం కి 20 రెట్లు గానీ, 4 లక్షలు గానీ ,ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.

ప్రశ్న

మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా? వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?

సమాధానం

రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు. ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది. అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.

ప్రశ్న

నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

సమాధానం

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేయించాలి.

ప్రశ్న

బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా??

సమాధానం

Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను కన్నా ప్రసూతి సెలవులు వాడుకోవచ్చు

ప్రశ్న

ఇంటి అద్దె (HRA మినహాయింపు) గణన ఎలా?

సమాధానం

చెల్లించిన అద్దె -10% ఫే - 10% డి.ఏ

సంవత్సరంలో చెల్లించిన అద్దె 1లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఇంటి యజమాని  PAN ఇవ్వాలి (నెలసరి అద్దె 8400/- కానీ అంతకంటే ఎక్కువ చెల్లించిన వారు)

ప్రశ్న

టాక్సేబుల్ ఆదాయం దాదాపు 7,00,000 ఉంటే టాక్స్ ఎలా గణించాలి?*

సమాధానం

2,50,000 వరకు పన్ను లేదు (60 ఏళ్ల లోపు వారికి)

2,50,001-5,00,000 వరకు (2.50 లక్షలకు) 10% 

5,00,001-10,00,000 వరకు (5 లక్షలకు) 20%

10,00,000  పైబడిన 30%

-----

7,00,000 కు టాక్స్ గణిస్తే 

2,50,000 వరకు పన్ను లేదు 

2,50,001 - 5,00,000 వరకు (2.50 లక్షలకు) 10% 

అంటే 2,50,000 X 10% = 25,000/-

5,00,001 - 7,00,000 వరకు (2 లక్షలకు) 20%

అంటే 2,00,000 X 20% = 40,000/-

చెల్లించాల్సిన టాక్స్ (25,000+40,000/-)+3%ఎడ్యుకేషన్ సెస్సు. 

-----

CPS వారికి సంబంధించిన సెక్షన్ల వారిగా ఉన్న అవకాశాలు.

ఉద్యోగుల కంట్రీబ్యూషన్ చేసిన నిధి 80CCD(1) ప్రకారం 80C సెక్షన్ తో 1,50,000/- లో చూపాలి.

అధనంగా 80CCD1(B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది

ఉద్యోగులకు వారి ప్రాన్ (PRAN)  ఖాతా లో ఉద్యోగుల వాటకి సమానంగా జమచేసిన నిధిని ముందుగా ఆదాయం గా చూపించి తర్వాత 80CCD(2) ప్రకారం ఆదాయం నుండి పూర్తి మినహాయింపు కలదు.

ప్రశ్న

అధనంగా 80CCD(1B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది?*

సమాధానం

ఉద్యోగులకు CPS కాకుండా 80C కింద 1,50,000/- సేవింగ్స్ ఉంటే CPS నిధిని 80CCD(1B) లో 50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. 

ఒకవేళ ఉద్యోగులకు 80C కింద CPS కాకుండా 1,30,000/- సేవింగ్స్ ఉండి CPS deduction 70,000/- ఉంటే అప్పుడు 20,000/- లను 80C కింద మిగతా 50,000/- లను 80CCD(1B) కింద చూపవచ్చు.

ప్రశ్న:

ఒక ఉపాధ్యాయుడు గృహిణి ఐన తన భార్యకు కిడ్నీని దానం చేయడానికి అంగీకరించాడు. ఈ సర్జరీ కోసం ఆ ఉపాధ్యాయునికి డాక్టర్లు 6 - 8 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడు వేతనంతో కూడిన సెలవులు పొందాలంటే ఏం చెయ్యాలి?

సమాధానం

వైద్య కారణాలతో (మెడికల్ గ్రౌండ్స్) కమ్యూటేషన్ సెలవుగానీ, ఎరండు లీవును గాని తీసుకుని పూర్తి జీతము పొందవచ్చు. అందుకు డాక్టర్ సర్టిఫికేట్ జతపరచాలి. G.O. Ms.No. 386, DT: 6-9-1976;; G.O. 268, DT: 28-10-1991 and G.O. 29, DT: 9-3-2011.

ప్రశ్న:

దాదాపు6 సంవత్సరాల కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై, అక్కడ కూడా 2 సం,, రాలు పనిచేసి తిరిగి పాత పోస్ట్‌ లో చేరిన ఉపాధ్యాయుని 2 సం,,రాల సర్వీసును ఏవిధంగా లెక్కిస్తారు ? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా ?

సమాధానం

FR -26(i) ప్రకారం ప్రస్తుత పోస్ట్ పై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు, ప్రస్తుత పోస్ట్ కంటే తక్కువ కాని పోస్ట్ లో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కించవచ్చును. G.O.Ms.No. 117, F&P, DT: 20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2 సం,,. ఇతర పోస్ట్ సర్వీసు AAS నకు  కూడా లెక్కించబడుతుంది.

ప్రశ్న:

వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??

సమాధానం:

వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు

ప్రశ్న:

సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??

సమాధానం:

ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.

ప్రశ్న:

ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా??

సమాధానం:

విరమించుకోవటానికి అతనికి అనుమతి ఇవ్వరు.

ప్రశ్న: 

Sir APGLI బాండ్లపై లోన్లు ఇవ్వటానికి ఏమైనా పథకం ఉన్నదా ? ఎప్పుడు, ఎలా లోన్ బాండ్ పై తీసుకోవచ్చు? తెలుపగలరు.

సమాధానం:

APGLI  లో బాండ్స్ పై లోన్ ఏమి ఇవ్వరు. లోన్ ఫెసిలిటీ మాత్రం ఉంది.. APGLI  Loan will be sanctioned basing on the premiums paid. But not basing on the bond value (sum assured)

ప్రశ్న

నాకు మొదటిసారి బాబు. తర్వాత కవల పిల్లలు పుట్టారు. ఐటీ కి ముగ్గురు పిల్లల ట్యూషన్ ఫీజు పెట్టుకోవచ్చా??

సమాధానం

ఐటీ కి ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు మాత్రమే సేవింగ్స్ కి పరిగణించబడుతుంది.

ప్రశ్న

ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా??

సమాధానం

చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

 ప్రశ్న

నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా??

సమాధానం

జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.

ప్రశ్న

UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు??

సమాధానం

FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది

ప్రశ్న

SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా??

సమాధానం

DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.

ప్రశ్న

మహిళా టీచర్ భర్త నిరుద్యోగి. అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు. అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు. మెడికల్ రీఅంబర్సుమెంట్ వర్తిస్తుందా??

సమాధానం

APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.

ప్రశ్న

నాకు మొదటి సారి అమ్మాయి.తర్వాత కవల పిల్లలు జన్మించారు. LTC లో ముగ్గురు పిల్లలు ప్రయాణం చేయవచ్చా??

సమాధానం

జీఓ.140 తేదీ:3.4.96 ప్రకారం ఇద్దరు పిల్లలుకి మాత్రమే అవకాశం ఉంది.

ప్రశ్న

అబార్షన్ కి రెండుసార్లు మాత్రమే సెలవు ఉపయోగించుకోవాలి అనుచున్నారు. వాస్తవమా?? కాదా??

సమాధానం

జీఓ.254;ఆర్ధిక;తేదీ:10.11.95 ప్రకారం ఇద్దరు కంటే తక్కువ జీవించియున్న బిడ్డలు గలవారు అర్హులు. అంతేకానీ ఎన్నోసారి అనే దానితో నిమిత్తం లేదు.

ప్రశ్న

సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??

సమాధానం

సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.

ప్రశ్న

స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??

సమాధానం

జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.

ప్రశ్న

ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??

సమాధానం

అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.

ప్రశ్న

LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??

సమాధానం

LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.

ప్రశ్న

విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు??

సమాధానం

 విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై కాలానికి Edn. Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి.అనుమతి లభించిన కాలానికి అర్హత గల(EL/HPL/EOL)ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు.జీఓ.70 తేదీ:6.7.2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4--6 నెలల వరకు Dy. EO, 6 నెలల నుండి 1 ఇయర్ వరకు DEO,1--4 ఇయర్స్ వరకు CSE,4 ఇయర్స్ పైన Edn. Sec నుండి సెలవు మంజూరు చేయించుకోవాలి.

ప్రశ్న

మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా??

సమాధానం

చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.

ప్రశ్న

స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??

సమాధానం

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జతపరచాలి

ప్రశ్న

SR లో సర్వీస్ వెరిఫికేషన్ ఎప్పుడు ఎంటర్ చెయ్యాలి??

సమాధానం

మెమో:8388, తేదీ:20.1.12 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో సర్వీస్ వెరిఫికేషన్ ఎంటర్ చెయ్యాలి.

ప్రశ్న

ఒక టీచర్ వేసవి సెలవుల్లో 35 రోజులు వివిధ రకాల ప్రభుత్వ పరీక్షలకి హాజరు అయ్యాడు.అతనికి ఎన్ని Els జమచేయబడతాయి??

సమాధానం

వినియోగించుకున్న వేసవి సెలవులు 14 రోజులే కనుక 24 రోజుల ELs జమ చేయబడతాయి.

ప్రశ్న

మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు.ఎవరు మాలో సీనియర్ అవుతారు??

సమాధానం

సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.

ప్రశ్న

FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా??

సమాధానం

FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.

 ప్రశ్న

నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల??

సమాధానం

జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.

ప్రశ్న

నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము.ఒకే రోజు జాయిన్ అయ్యాము.SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు??

సమాధానం

SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే,వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.

ప్రశ్న

PF ఋణం ఎంత ఇస్తారు??తిరిగి ఎలా చెల్లించాలి??

సమాధానం

PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణ0 కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.

ప్రశ్న

కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి APGLI ఎప్పటి నుంచి కట్ చెయ్యాలి??

సమాధానం

జీఓ199, ఆర్థికశాఖ తేదీ:30.7.13 ప్రకారం మొదటి నెల వేతనం నుంచే APGLI మినహాయించాలి.

ప్రశ్న

సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరితే ఎన్ని రోజులలోపు సమాధానం ఇవ్వాలి??

సమాధానం

30 రోజులలోపు సమాధానం ఇవ్వాలి.

ప్రశ్న

నేను B.Sc, M.Ed చేశాను.1995 లో SGT గా చేరాను.ఐతే నాకు M.Ed కి అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వటం లేదు.ఎందువల్ల??

సమాధానం

మెమో:5399, తేదీ:23.11.2000 ప్రకారం పీజీ అర్హత ఉంటేనే M.Ed కి ఆదనపు ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది.

ప్రశ్న

నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు??

సమాధానం

మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.

ప్రశ్న

నేను రక్త దానం చేశాను. Spl. CL ఎవరు ఇస్తారు??

సమాధానం

జీఓ.137 తేదీ:23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే Spl. Cl కూడా మంజూరు చేస్తారు.

ప్రశ్న

నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

సమాధానం

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.

ప్రశ్న

ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??

సమాధానం

తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ప్రశ్న:

నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు??

సమాధానాలు

మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.

ప్రశ్న:

నేను రక్త దానం చేశాను. Spl. CL ఎవరు ఇస్తారు??

సమాధానాలు

జీఓ.137 తేదీ:23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే Spl. Cl కూడా మంజూరు చేస్తారు.

ప్రశ్న:

నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

సమాధానాలు

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.

ప్రశ్న:

నేను PF నుండి ఋణం పొందియున్నాను.

వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??

సమాధానాలు

ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

ప్రశ్న:

ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??

సమాధానాలు

జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది

ప్రశ్న:

 MA (Tel) MEd , PhD చేసినాను ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ( తెలుగు ) గా పనిచేస్తున్నాను . Ph.D కి సంబంధించిన వివరములు సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేయబడినవి . అయితే టీచర్ అటిండెన్సు రిజిస్టర్ లో  నాపేరుకు ముందు డాక్టర్ అని సంబోదించి  నేను నాపేరుకు ముందు డాక్టర్ పెట్టుకోకూడదా వివరములు తెలుపగలరు

సమాధానం:

గౌరవ phd పట్టా ను పొందినారు కావున మీరు టీచర్ అటిండెన్సు రిజిస్టర్ లో  పేరుకు ముందు ఖచ్చితంగా డాక్టర్ ను పెట్టుకోవచ్చును.

ప్రశ్న:

APGLI నుండి పొందిన ఋణానికి వడ్డీ చెల్లించాలా??

సమాధానం:

ఋణం మంజూరు చేసే సమయంలోనే వడ్డీ కూడా అంచనా వేసి సమాన నెలసరి వాయిదాలు నిర్ణయిస్తారు.

ప్రశ్న:

ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద ఎన్ని రోజులు కమ్యూటెడ్ సెలవు వాడుకోవాలి??

సమాధానం:

జీఓ.186 ; ఆర్ధిక ; తేదీ:23.07.75 ప్రకారం సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవు గా వాడుకోవచ్చు.

ప్రశ్న:

ఒక టీచర్ ఏదైనా పరీక్ష రాయాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలా??

సమాధానం:

 ఉండి ఏ పరీక్ష రాయాలన్నా పై అధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి.

ప్రశ్న:

ఒక sgt వేరే dsc లో sa గా ఎంపిక ఐతే వేతన రక్షణ ఉంటుందా?అదే ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా??

సమాధానం:

మీరు పై అధికారి అనుమతి తో relieve ఐతే FR.22(a) ప్రకారం రక్షణ ఉంటుంది. ఇంక్రిమెంట్ కి మాత్రం రక్షణ ఉండదు.sa గా చేరిన సంవత్సరం నకు మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తారు.

ప్రశ్న:

నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను.పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా??

సమాధానం:

పెన్షన్ ను ఆదాయం గా చూపాలి.గ్రాట్యుటీ, కమ్యుటేషన్,సంపాధిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.

ప్రశ్న

నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు??

సమాధానం

మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.

ప్రశ్న

నేను రక్త దానం చేశాను. Spl. CL ఎవరు ఇస్తారు??

సమాధానం

జీఓ.137 తేదీ:23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే Spl. Cl కూడా మంజూరు చేస్తారు.

ప్రశ్న

నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

సమాధానం

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.

ప్రశ్న

నేను PF నుండి ఋణం పొందియున్నాను.

వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??

సమాధానం

ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

ప్రశ్న

ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??

సమాధానం

జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

 ప్రశ్న:

భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనపప్పుడు, వారిలో ఎవరైనా ఒకరు మరణించిన సందర్భంలో ఆ కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం ఇస్తారా? ఏదైనా జీవో ఉన్నదా?

సమాధానం

కారుణ్య నియామకం హక్కు కాదు. చనిపోయిన ఉద్యోగి కుటుంబం రోడ్డున పడకుండా ఇచ్చిన Social Welfare Scheme.  కుటుంబానికి ఆదాయ మార్గాలున్నప్పుడు కారుణ్య నియామకం ఇవ్వరు.

ప్రశ్న

సార్ నాకు ఇంక్రిమెంట్ జనవరి నెలలో వస్తుంది కానీ నేను 2020 అక్టోబర్ లో లీవ్ వెళ్లినాను. జూన్ 2021 నెలలో జాయిన్ అయ్యాను. ఇంక్రిమెంట్ డేట్ జనవరి లోనా? జూన్ లోనా? చెప్పండి.

సమాధానం

జనవరిలో ఇంక్రిమెంట్ తేదీన మీరు లీవ్ లో ఉన్నారు కాబట్టి, ఆ లీవ్ నుండి జాయిన్ అయిన తర్వాత మాత్రమే, జాయినింగ్ తేదీన వస్తుంది. మెడికల్ లీవులో వెళ్ళారు కాబట్టి, ఈ సంవత్సరం, జూన్ లో వస్తుంది. తర్వాత జనవరికి వస్తుంది.

 ప్రశ్న:

భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనపప్పుడు, వారిలో ఎవరైనా ఒకరు మరణించిన సందర్భంలో ఆ కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం ఇస్తారా? ఏదైనా జీవో ఉన్నదా?

సమాధానం

కారుణ్య నియామకం హక్కు కాదు. చనిపోయిన ఉద్యోగి కుటుంబం రోడ్డున పడకుండా ఇచ్చిన Social Welfare Scheme.  కుటుంబానికి ఆదాయ మార్గాలున్నప్పుడు కారుణ్య నియామకం ఇవ్వరు.

 ప్రశ్న

సార్ నాకు ఇంక్రిమెంట్ జనవరి నెలలో వస్తుంది కానీ నేను 2020 అక్టోబర్ లో లీవ్ వెళ్లినాను. జూన్ 2021 నెలలో జాయిన్ అయ్యాను. ఇంక్రిమెంట్ డేట్ జనవరి లోనా? జూన్ లోనా? చెప్పండి.

సమాధానం

జనవరిలో ఇంక్రిమెంట్ తేదీన మీరు లీవ్ లో ఉన్నారు కాబట్టి, ఆ లీవ్ నుండి జాయిన్ అయిన తర్వాత మాత్రమే, జాయినింగ్ తేదీన వస్తుంది. మెడికల్ లీవులో వెళ్ళారు కాబట్టి, ఈ సంవత్సరం, జూన్ లో వస్తుంది. తర్వాత జనవరికి వస్తుంది.

ప్రశ్న:

నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను. నాకు పదోన్నతి ఇస్తారా? ఇవ్వరా?

సమాధానం

స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.

ప్రశ్న

డిపార్ట్మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు/ ఉద్యోగులు ఎన్నిసార్లు Onduty సౌకర్యం ఏ ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది ?

సమాధానం

AP ట్రావలింగ్ రూల్స్ లో 73 ప్రకారం , F.R 9(6)(B)(iii) ప్రకారం ఒక అభ్యర్థి డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరగుటకు DA లేకుండా రెండుసార్లు TA మరియు OD సౌకర్యాన్ని వినియోగించవచ్చును.

ప్రశ్న

SA(Hindi) గా పనిచేయుచున్న నేను HM Post ప్రమోషన్ కు అర్హుడనేనా ?

సమాధానం

అవును. సంబంధిత డిపార్ట్ మెంట్ టెస్టు పాస్ అయి, డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయితే 45 సం.లు దాటినా లేదా స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినవారు 50సం.లు వయస్సు దాటినా హెచ్.ఎం గా ప్రమోషన్ పొందడానికి అర్హులు. 10వ తరగతి తర్వాత 5 సంవత్సరములు స్టడీ ఉండాలి.

ప్రశ్న

ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు?

సమాధానం

రూల్-22A ప్రకారం అన్ని కేటగిరీలకు చెందిన రిజర్వేషన్ స్థానాలలో మహిళలు కి 33 1/2 % రిజర్వ్ చేయబడి ఉన్నది. sc/st/bc/oc కేటగిరీల వారికి కేటాయించబడిన స్థానాలలో ఆయా కేటగిరీకి చెందిన మొదటి స్థానం, ఆ తదుపరి ప్రతి మూడవ స్థానం మహిళలకి రిజర్వ్ చేయబడింది. పై రెండు రకాల  రిజర్వేషన్లు వర్తింపజేస్తూ కమ్యూనల్ రోస్టర్ తయారు చేయబడుతుంది.

ప్రశ్న:

నేను డ్రాయింగ్ టీచర్ ని.PAT పాస్ అయ్యాను.B. Com పాస్ అయ్యాను.B. ed లేదు.నాకు 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరా??

సమాధానం:

24 ఇయర్స్ స్కేల్ పొందాలి అంటే డిగ్రీ&బీ.ఎడ్ ఉండాలి.

ప్రశ్న:

నేను రెండు నెలలు FAC HM గా పనిచేశాను.అలవెన్సు ఇచ్చారు.పెరిగిన DA తేడా ఇవ్వరా??

సమాధానం:

FAC కాలానికి,సరెండర్ లీవు కాలానికి DA తేడా పొందవచ్చు.

ప్రశ్న:

ఒక టీచర్ సస్పెండ్ అయ్యాడు.ఇంక్రిమెంట్ ఆపారు.అతనికి 12 ఇయర్స్ స్కేల్ ఇచ్చేటప్పుడు  ఈ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చా??

సమాధానం:

మెమో.41082, తేదీ:30.12.96 ప్రకారం ఇంక్రిమెంట్ నిలుపుదల కాలాన్ని కూడా AAS కి పరిగణలోకి తీసుకోవాలి.

ప్రశ్న:

నేను శనివారం, సోమవారం సెలవు పెట్టాలి.రెండు CL లెటర్లు ఇవ్వాలా??

సమాధానం:

అవసరం లేదు. ఒక లెటర్ పై రాసి ఆదివారం అనుమతి అని రాయండి సరిపోతుంది.

ప్రశ్న:

నేను బదిలీ అయ్యాను.పాత మండలం లో చాలా ఎంట్రీ లు వేయలేదు.ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు.ఆ ఎంట్రీ ల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి??

సమాధానం:

సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చు.

ప్రశ్న:

నేను జులై 14 న ఉద్యోగం లో చేరాను.ఇంక్రిమెంట్ నెల జులై.నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను.పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి??

సమాధానం:

జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది నెల మొదటి తేదీ అవుతుంది. ఉద్యోగం లో చేరిన తేదీ కాదు.కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.

ప్రశ్న:

నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి??

సమాధానం:

FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.

ప్రశ్న:

డైస్ నాన్ కాలం అంటే ఏమిటి??

సమాధానం:

FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ.

FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.

ప్రశ్న:

అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను.నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు.నా ఉద్యోగం తమ్ముడు కి ఇప్పించవచ్చునా?

సమాధానం:

టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు.

కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహి0సలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.

ప్రశ్న:

నేను,నా భార్య ఇద్దరం టీచర్ల0.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి  తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా??

సమాధానం:

చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.

ప్రశ్న:

GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా??

సమాధానం:

ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.

ప్రశ్న:

ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??

సమాధానం:

మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.

ప్రశ్న:

ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.

సమాధానం:

Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి.ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3 ELs జమ చేయకూడదు.

ప్రశ్న:

ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.

సమాధానం:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.

ప్రశ్న:

ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?

సమాధానం:

మార్చి1 నుండి ఇవ్వాలి. AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.

ప్రశ్న:

ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.

సమాధానం:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.

ప్రశ్న

ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?

సమాధానం:

మార్చి1 నుండి ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.

ప్రశ్న:

OD తర్వాత CL పెట్టవచ్చా?

సమాధానం:

మీరు వాడిన OD కి TA&DA ఇస్తే మాత్రం CL పెట్టకూడదు.

ప్రశ్న:

మున్సిపల్ టీచర్ల కి కూడా పిల్లల ఫీజు రీ- అంబర్సుమెంట్ అవకాశం ఉందా?

సమాధానం:

RC.14311,తేదీ:15.7.13 ప్రకారం అవకాశం ఉంది.

ప్రశ్న:

చైల్డ్ కేర్ లీవ్ మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా?

సమాధానం:

బిడ్డల వయస్సు 18 ఇయర్స్ లోపు ఎన్ని పర్యాయాలు ఐనా వాడుకోవచ్చు. ఐతే మొత్తం 60 మాత్రమే వాడుకోవాలి.

ప్రశ్న:

మున్సిపల్ టీచర్ల కి కూడా పిల్లల ఫీజు రీ- అ0బర్సుమెంట్ అవకాశం ఉందా??

సమాధానం:

RC.14311,తేదీ:15.7.13 ప్రకారం అవకాశం ఉంది.

ప్రశ్న:

చైల్డ్ కేర్ లీవ్ మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా??

సమాధానం:

బిడ్డల వయస్సు 18 ఇయర్స్ లోపు ఎన్ని పర్యాయాలు ఐనా వాడుకోవచ్చు. ఐతే మొత్తం 60 మాత్రమే వాడుకోవాలి.

ప్రశ్న:

GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా??

సమాధానం:

ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.

ప్రశ్న:

ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??

సమాధానం:

మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.

ప్రశ్న:

ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.

సమాధానం:

Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి.ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3 ELs జమ చేయకూడదు

ప్రశ్న:

వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్ వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు??

సమాధానం:

మెమో.14568 ,తేదీ:31.1.2011 ప్రకారం పే,డీఏ సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.

ప్రశ్న:

ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్ గా పొందవచ్చు??

సమాధానం:

ఇంటి మరమ్మతులు, విస్తరణకు ములవేతనం కి 20 రెట్లు గానీ, 4 లక్షలు గానీ ,ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.

ప్రశ్న

బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి?

సమాధానం:

ఒక బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసిన మొత్తం డబ్బులపై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి. అపుడు బ్యాంకు వారు మన డిపాజిట్ ల పైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీలో టాక్స్ కట్ చేస్తారు. ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.

ప్రశ్న:

అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా? హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సందర్భాలలో కూడా వర్తిస్తుందా? ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది: 23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు. 2000 సం.లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది: 20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు. వీరిలో ఎవరు సీనియరు?

సమాధానం:

ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది. 2000సం.లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.

ప్రశ్న:

ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం,, స్కేలు, 24 సం,, స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి. అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ  Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు  ఏమైనా వున్నాయా?

సమాధానం:

ఏ క్యాడర్ లో నైనా 18 సం,, స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు. 12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం,, ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది. SGT లు 24సం,, స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి. SA లకు తమ 12సం,, స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొంది వుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం,, వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు. పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.

ప్రశ్న:

ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?*

సమాధానం:

వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ  cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా) తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.

(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)

ఇంకా మరెన్నో సందేహాలు - సమాధానాలు కొరకు 

CLICK HERE 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

11 Responses to "Government Teachers' Doubts - Answers"

  1. నేను 10తరగతి,ఇంటర్,చదవకుండా open universityద్వారా Direct B.A,degreeచేసి తర్వాత B.Ed, చేసి SGTగా చేస్తున్నాను నాకు ప్రమోషన్ వస్తుందా చెప్పగలరు

    ReplyDelete
  2. Grade 1,2 పండిట్స్ sa,sgtలుగా పరిగణించబడుతారా ?,హింది విద్వాన్ బేస్ తొ MA చేసి grade1 పండిట్ గా విధులు నిర్వహిస్తున్నపుడు HM గా ప్రమోషన్ పొందవచ్చునా ?

    ReplyDelete
  3. నేను 2002 untrained టీచర్ నియమించబడి,హిందీ మద్యమ విశారద చేశాను.Deo గారి అనుమతితో HPT చేసి 2019 లో S.A హిందీ ప్రమోషన్ పొందాను.present నా అర్హతలు:10+ఇంటర్+D.Ed+(2years)+మధ్యమ విశారద+పండిట్ ట్రైనింగ్(HPT)+2020లో Go+EO పాస్ అయ్యాను.నేను HM pramotion కి అర్హుడు నా కాదా

    ReplyDelete
  4. నేను sgt టీచర్ గా పని చేస్తున్నాను. డిగ్రీ లో b.com చదివాను. B.ed లో social మరియు తెలుగు methadology తీసుకున్నాను.నేను మళ్ళీ B.A(తెలుగు) చేస్తే తెలుగు ప్రమోషన్ కి అర్హుడుని అవుతానా సార్?

    ReplyDelete
  5. మా అమ్మగారు ఫ్యామిలీ పెన్షనర్,కానీ ఆవిడకి EHS Scheme వర్తించదు (వారి department లొ పెన్షనర్స్ కి EHS Scheme లేదు) నా EHS కార్డ్ లొ చేర్చుకోవచ్చనా.

    ReplyDelete
  6. నమస్కారం సార్ . నేను Open heart surgery చేయంచుకున్నాను . అనంతరం వాడుకో దగ్గ జీతంతో కూడిన మెడికల్ త లీవ్స్ గూర్చి తెలియ జేయగలరు

    ReplyDelete
  7. నేను ఒక govt.టీచర్ ని. నేను ఒకేసారి రెండు వేర్వేరు యూనివర్సిటీస్ లో రెండు వేరువేరు కోర్సెస్ distance mode లో చేయవచ్చా.

    ReplyDelete
  8. Nenu 2009 dsc lo SA SS Ga 20/10/2009 na join ayyanu roster no 25 . Ade DSC lo maro teacher 19/10/2009 na SA Maths ga join ayyaru roster no 150. Attendence register lo yevari Peru mundu rayali.
    2nd teacher two months loss pay lo vunnaru.

    ReplyDelete
    Replies
    1. Loss of pay lo vunnaru 1st teacher increment 1 October . 2nd teacher increment 1 December . Please give me answer if available Go's mention please.

      Delete
  9. Sir PH ALLOWANCE పొందడానికి PH percentage ఎంత ఉండాలి

    ReplyDelete
  10. Promotions phc resevation cycles ante VH/OH/HI or HI/VH/OH

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0