Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Today is 'Quit India' day ..

 నేడు ‘క్విట్ ఇండియా’ దినోత్సవం..

Today is 'Quit India' day ..

 • ఈ ఉద్యమం స్వాతంత్య్ర సంగ్రామంలో మేరుశిఖరం.!
 • గాంధీ ప్రసంగం స్వాతంత్య్ర కాంక్షను రగిలించింది.
 • బ్రిటీషు పాలకుల సింహాసనాన్ని కదిలించింది.

యుద్ధానంతరం భారతీయులకు అధికార బదలాయింపుకు ప్రతిఫలంగా యుద్ధంలో భారతీయుల సంపూర్ణమద్దతు కూడగట్టటానికి బ్రిటీష్ వారు క్రిప్స్ ఆధ్వర్యంలోరాయబార బృందాన్ని భారతదేశానికి పంపించటం జరిగింది.


అయితే స్వపరిపాలన కు నిర్ధిష్ట సమయాన్ని సూచించలేకపోవటం, ఆధికార బదలాయింపుకు సరైన నిర్వచనాన్ని ఇవ్వలేక పోవటంతో పరిమితమైన పాలనాధికారాన్ని మాత్రమే ఇవ్వజూపిన"క్రిప్స్ రాయబారం" భారత ఉధ్యమకారులకు ఆమోదయోగ్యం కాలేదు. దీనితో చర్చలు విఫలమైనాయి.

కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది.

 • భారతదేశం విడిచిపో (Quit India) అనేది భారత స్వాతంత్ర్యసంగ్రామంలో దేశవ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన అవిధేయతా ఉద్యమము.
 •  అహింస, సహాయ నిరాకరణ మూలసూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని కూడా భారతదేశం వైపు ఆకర్షించింది.
 • గాంధీజీ ప్రసంగంలో ఇచ్చిన "చేయండి లేదా చావండి" అనే పిలుపుతో ఈ ఉద్యమం 1942 ఆగస్టులో ప్రారంభమైనది.
 • దీనినో  'ఆగస్టు విప్లవ ఉద్యమం ' అని కూడా పిలుస్తారు.
 • రెండో ప్రపంచ యుద్ధ సమయంలోజపాన్‌కు వ్యతిరేకంగా భారత రక్షణను ప్రజాప్రభుత్వా నికి అప్పజెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టింది.
 • దీనికిగాను గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని రూపొందించారు
 • 1942జూలైలో వార్ధాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బ్రిటిష్‌వారిని భారతదేశం
 • వదిలివెళ్లమని ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
 • దీన్నే ఆంగ్లంలో క్విట్ ఇండియా అంటారు.
 • దీన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1942, ఆగస్టు 8న ఆమోదించడంతో జాతీయోద్య మం తుది దశ బొంబాయిలో ప్రారంభమైంది.
 • అదే రోజు బొంబాయిలోని గోవాలియా చెరువు మైదానంలో గాంధీజీ అశేషజనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
 • ఐక్య రాజ్యాల విజయం కోసం, భారతదేశం కోసం భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే ముగియడం అత్యవసరం. కావున ప్రజాపోరాటమే ఏకైక మార్గమని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది.
 • ఈ ఉద్యమానికి ఆధారం అహింస అన్న విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని కూడా ఆ తీర్మానం పేర్కొంది.
 • 1942, ఆగస్టు 9న గాంధీని, ప్రముఖ నాయకులందరినీ ప్రభుత్వం నిర్బంధించడమే కాకుండా కాంగ్రెస్ సంస్థను నిషేధించింది.
 • పోలీసులు ఉద్యమాన్ని అణచివేసేందుకు క్రూరమైన చర్యలకు దిగారు.
 • డు ఆర్ డై (ఉద్యమించండి లేదా మరణించండి) అని ప్రజలకు గాంధీజీ పిలుపునిచ్చారు.
 • అంతేకాక మనం భారతదేశాన్ని విముక్తి అయినా చేద్దాం లేదా ఆ ప్రయత్నంలోనైనా మరణిద్దాం అని ఆయన అన్నారు.
 • అందుకు కేవలం అహింసాత్మక ప్రజా ఉద్యమమే మార్గమని కూడా గాంధీజీ చెప్పారు.
 • జాతీయ నాయకులందరూ అరెస్టయిన ప్పుడు అరుణా అసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్ లాంటి రెండో తరం నాయకులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
 • ఉషామె హతా కాంగ్రెస్ రేడియోను నిర్వహించారు.
 • ప్రజాందోళన మీద లాఠీ దాడి చేయటంమే కాక అపరాధ రుసుమును విధించింది. త్వరలోనే ఉద్యమం నాయకత్వం లేని ఆందోళనగా మారి అనేక ప్రాంతీయ విప్లవ సంఘాల చేతులలోకి మళ్ళంది.
 • గాంధీ గారి అహింసా యుత సిద్దాంతాలకు వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Today is 'Quit India' day .."

Post a Comment