Google's new app for kids to read
పిల్లలు చదువుకోవడానికి గూగుల్ కొత్త యాప్
యాప్ ఉపయోగాలు
- గూగుల్ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 1,2వ తరగతులు విద్యార్థుల కోసం ఓ యాప్‌ను విడుదల చేసింది.
 - చిన్నారులు ఇంటి వద్దనే ఉంటూ ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకునేలా యాప్ రూపొందించింది.
 - ఆ యాప్ పేరే రీడ్ ఎలాంగ్ యాప్.. దీనిలో లాగిన్ అయ్యాక.. దియా అనే ఒక కంప్యూటర్ వాయిస్ మనల్ని గైడ్ చేస్తుంది.
 - ఆ యాప్ ఎలా ఉపయోగించాలో కూడా చెబుతుంది.
 - ఈ యాప్ తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ తదితర భాషల్లో అందుబాటులో ఉంది.
 - ఆ యాప్‌లో ఏమున్నాయ్.. అంత ప్రత్యేకత ఎంటో ఓ లుక్కేద్దాం..
 - తెలుగు, ఆంగ్లంతో పాటు లెక్కల్ని ఆడుతూ పాడుతూ నేర్పే రీడ్ ఎలాంగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 - ఈ యాప్‌లోని సహాయకురాలు దియా యాప్‌ను ఎలా వినియోగించాలో చెబుతుంది.
 - పదాలు, వాక్యాలు ఎలా చదవాలో గైడ్ చేస్తుంది.
 - ఏవైనా తప్పులు చేస్తే సరిదిద్దుతుంది. సరిగా చదవమని చెబుతుంది.
 - యాప్‌లో గ్రంథాలయం కూడా ఉంది.
 - ఛోటా భీమ్, బాలల కథలు కూడా ఉన్నాయి.
 - ఎప్పటికప్పుడు కొత్త కథలూ అందుబాటులోకి తేనుంది.
 - యాప్‌ని ఆఫ్‌లైన్‌లో కూడా వాడొచ్చని నిపుణులు తెలిపారు.
 - ఈ యాప్ చిన్నారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎన్సీఈఆర్టీ పేర్కొంది.
 



0 Response to "Google's new app for kids to read"
Post a Comment