Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Village secretariats in government schools?

ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలా?

Village secretariats in government schools?

  • ప్రభుత్వమే ఇలా చేస్తే పేద విద్యార్థులు ఏం చేయాలి
  • ఐఏఎస్లపై మరోసారి హైకోర్టు ఫైర్
  • ఏడుగురు ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు
  • తదుపరి విచారణకు8 మందీ రావాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు
  • ఈ నెల 31కి వాయిదా

ప్రభుత్వ పాఠశాలు ఆవరణ లో ఎలాంటి ఇతర నిర్మణాలు చేపట్టరాదని గత ఏడా ది ఆదేశాలిచ్చాం.. ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు.. పాఠశాల భవనాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.. రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నారు.. ప్రభుత్వమే ఇలే చేస్తే పేద విద్యార్థుల తల్లిదండ్రులు తమ గోడు ఎవరితో చెప్పు కుంటారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమల్లో అత్యధిక శాతం మంది ఐఏఎస్ లు అనవసరమనే భావనతో ఉన్నట్టున్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు విద్యనభ్యసిస్తారనే విషయం తెలీదా?.. మేం ఇచ్చిన ఆదేశాలను అధికా రులు ఇప్పటి వరకు అమలు చేయకపోవటం క్షమిం చరానిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇతర నిర్మాణాలు చేపట్టకుండా కింది స్థాయి అధికారులకు ఎందు కు ఆదేశాలివ్వరని నిల దీసింది. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోండి.. కోర్టు ఉత్తర్వులు అమలు చేసే విధంగా కింది స్థాయి సిబ్బం దిని ఆదేశించి అమలు చేస్తే ధిక్కార వ్యాజ్యాలు మూసేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ సచివాలాయాలు, ఇతర కార్యాలయాల నిర్మాణాలు చేపట్టరాదంటూ గత ఏడాది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు. అయినా వివిధ జిల్లాల్లో నిర్మాణాలు చేపట్టటాన్ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలనేకం దాఖలవుతు న్నాయి. ఆదేశాల అమల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం. వ్యక్తం చేస్తూ సుమోటో ధిక్కార పిటిషన్గా స్వీకరించి కోర్టుముందు ఉన్నతాధికారులు హాజరు కావాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిష నర్ గిరిజా శంకర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, అప్పటి డైరెక్టర్ విజయకుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం నాయక్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్, కమిషనర్ చిన వీరభద్రుడు తదితరులు సోమవారం కోర్టు ముందు హాజర య్యారు. పురపాలకశాఖ కార్యదర్శి శ్యామలరావు వ్యక్తిగత మినహాయింపు కోరారు. కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు 8 మంది ఐఏఎస్ లు విధిగా వచ్చే విచారణకు కోర్టు ముం దు హాజరు కావాలని న్యాయ మూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు. కోర్టు ఆదేశాల ను అమలుపరచక పోవటానికి పంచాయతీరాజ్, పాఠశాల వి. ద్య, పురపాలకశాఖ అధికారులు బాధ్యత వహించాల్సిందే అని తేల్చి చెప్పారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరాం న్యాయమూర్తిని కోరారు. ఇందుకు అనుమతిస్తూ ఈనెల 31వ తేదీన తదుపరి విచారణ జరపనున్నట్లు జస్టిస్ బట్టు దేవానంద్ ప్రకటించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Village secretariats in government schools?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0