Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Warning to motorists .. Notices within 15 days if rules are not followed

 వాహనదారులకు హెచ్చరిక .. రూల్స్ పాటించకుంటే 15 రోజుల్లో నోటీసులు.

Warning to motorists .. Notices within 15 days if rules are not followed

వాహనదారులు ఇకపై అప్రమత్తంగా ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే వాహనదారులకు కష్టమే. ఎందుకటే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇక నుండి 15 రోజుల్లోగా నోటీసు జారీ చేయాలని కేంద్రం సూచించింది.

ఈ మేరకు పోలీసులు జారీ చేసిన ఛలాన్‌లో ఉండే డబ్బు చెల్లించకపోతే వాహనదారుడు చెల్లించే వరకూ కూడా ఎలక్ట్రానిక్ రికార్డును జాగ్రత్తగా ఉంచాలని కేంద్రం చెప్పింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ కొత్త నియమాలను అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేయడం కూడా జరిగింది. మోటార్ వాహన చట్టం 1989 ఇటీవల సవరణలు చేసిన విషయం తెలిసిందే.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు గుర్తించడానికి స్పీడ్ కెమెరా, సీసీటీవీ కెమెరా, స్పీడ్ కం డాష్ బోర్డ్ కెమెరా మొదలైనవి రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అదే విధంగా ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఉన్న జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు ప్రస్తావించిన 132 నగరాలతో పాటు పది లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని నగరాల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమైంది. అయితే పలువురు నిబంధనలను అతిక్రమించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు నిబంధనలు బ్రేక్ చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ కనుక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇక నుండి 15 రోజుల్లోగా ఈ-చలాన్ జారీ అవుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Warning to motorists .. Notices within 15 days if rules are not followed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0