Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Cabinet Decisions

 AP Cabinet: ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాలు ఇవే.

AP Cabinet Decisions

ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

 ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం (AP Cabinet Meet) ముగిసింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమ తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పర్యావరణ అనుకూలంగా ప్రమాదరహిత పరిశ్రమ నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్‌కు అనుమతినిచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ 'సెకి'తో కలిసి సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి 10 వేల మెగావాట్ల ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ వినియోగానికే 10 వేల మెగావాట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. యూనిట్‌కు రూ.2.49కు సరఫరా చేసేలా మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.  

మంత్రి వర్గ భేటీలో కీలక నిర్ణయాలు

  • మైనార్టీ సబ్ ప్లాన్‌కు ఆమోదం
  • రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నియామకం చట్ట సవరణకు ఆమోదం
  • కేంద్ర ప్రభుత్వ సంస్థ 'సెకి'తో కలిసి సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం
  • సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి 10 వేల మెగావాట్ల ప్లాంట్‌
  • ఆర్‌అండ్‌బీ ఖాళీ స్థలాలు, భవనాలు ఆర్టీసీకి బదలాయించేందుకు ఆమోదం
  • అరకులో ఏకలవ్య మోడల్ స్కూల్‌ నిర్మాణానికి ఆమోదం
  • నకిలీ ఔషధాలను అరికట్టేలా 1940 డ్రగ్స్ కాస్మోటిక్స్ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం
  • 10 మండలాలతో బద్వేలు కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు
  • ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ కోసం అథారిటీ ఏర్పాటు

రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. మంత్రి వర్గ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల రుణాలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌ పథకం తీసుకొస్తున్నామన్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంతో ప్రజలకు రూ.14,609 కోట్ల మేర లబ్ధి చేకూరనుందని తెలిపారు.  

"1983 నుంచి ఇచ్చిన ఇళ్ల రుణాలకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీం. 46,67,301 మందికి లబ్ధి కలిగేలా ఇళ్ల పట్టాలు, ఇళ్లు పత్రాలు ఇస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.10 వేలు చెల్లించాలి. మున్సిపాలిటీలో వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ15 వేలు చెల్లించాలి. నగరపాలికల్లో వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.20 వేలు చెల్లించాలి. 31 లక్షల మందికి ఇప్పటికే నవరత్నాల పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు. ఇంటి నిర్మాణానికి డ్వాక్రా మహిళలకు అదనంగా రూ.35 వేల రుణం. తనఖాలో ఉన్న ఇల్లు కొన్నవారు పేదవాళ్లైతే వారికీ పథకం వర్తింపు" - పేర్ని నాని, మంత్రి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Cabinet Decisions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0