Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

LIC Kanyadan Policy

LIC Kanyadan Policy : కన్యాదాన్ పాలసీ గురించి తెలుసుకుందాం.

LIC Kanyadan Policy

ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్ఐసీ ఆడపిల్లల కోసం ప్రత్యేకమైన పాలసీతో ముందుకు వచ్చింది.

ఎల్ఐసీ త్వరలో ఐపీవోకు రానుంది. ఐపీవోకు వస్తే దేశంలో అత్యంత మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన సంస్థగా నిలిచే అవకాశం ఉంది. ఇలాంటి ఎల్ఐసీ నుండి ఎన్నో బీమా పథకాలు వచ్చాయి. ఇందులో భాగంగా ఆడపిల్లల కోసం కన్యాదాన్ పాలసీ కూడా వచ్చింది. ఈ ప్రత్యేక ఎల్ఐసీ పాలసీని తీసుకుంటే... తండ్రి తన కూతురు పెళ్లి గురించి అంతగా ఇబ్బంది (ఆర్థికంగా) పడవలసిన అవసరం ఉండకపోవచ్చు. ఈ పాలసీని ప్రత్యేకంగా కూతుళ్ల పెళ్లిళ్ల కోసం డిజైన్ చేశారు.

ఈ ప్రత్యేక పాలసీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఎల్ఐసీ కన్యాదాన్ పేరుతో ఎలాంటి ప్లాన్ లేదు. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులను, మరింతమంది కస్టమర్లను పెట్టుబడిదిశగా ఆకర్షించేవిధంగా ఎల్ఐసీ జీవన్ లక్ష్యను ఎల్ఐసీ కన్యాదాన్ ట్యాగ్ లైన్‌తో ముందుకు తెచ్చారు. ఆడపిల్ల పెళ్లి అంటే ఇప్పుడు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలతో ముడివడి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం.

ప్లాన్ ముఖ్య లక్షణాలు

 • అర్హత: ఈ పాలసీ హోల్డర్ వయస్సు 18 సంవత్సరాల నుండి 50 ఏళ్లు ఉండాలి. ఆడపిల్ల కోసం కనీస వయస్సు పరిమితి 1 సంవత్సరం.
 • మినిమం సమ్ అస్యూర్డ్ రూ.1 లక్ష
 • బీమా చేసిన పేరెంట్ అకాల లేదా అకస్మిక మరణం చెందితే ప్రీమియం మినహాయింపు అందుబాటులో ఉంది.
 • ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1 లక్ష, నాన్-యాక్సిడెంటల్ అయితే రూ.5 లక్షలు.
 • మెచ్యూరిటీ వరకు ఏడాదికి రూ.50,000 చెల్లించాలి.
 • మెచ్యూరిటీకి మూడేళ్ల ముందు వరకు ఎల్ఐసీ కవర్.
 • ఎన్నారైలు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు.

పాలసీ కింద విభిన్న ప్రయోజనాలు

 • పాలసీదారు మృతి చెందితే సమ్ అస్యూర్డ్‌లో 1 శాతం మొత్తాన్ని ప్రతి సంవత్సరం చెల్లిస్తారు. మెచ్యూరిటీ తేదీ ముందు ఏడాది వరకు చెల్లిస్తారు.
 • పాలసీ మెచ్యూరిటీ టర్మ్ కంటే మూడు సంవత్సరాలు తక్కువగా ఉండే పరిమిత ప్రీమియం చెల్లింపు టర్మ్
 • మెచ్యూరిటీ కాలపరిమితి 13 సంవత్సరాల నుండి 25 ఏళ్లు.

ప్రీమియం కాలిక్యులేషన్

 • ఒకవేళ మనం ఈ పథకం కింద రూ.10 లక్షల సమ్ అస్యూర్డ్‌ను ఎంచుకుంటే, పదమూడు సంవత్సరాల కాలపరిమితికి, ప్రీమియం చెల్లింపు పదేళ్లు. DAB - రూ.10 లక్షలు. డెత్ సమ్ అస్యూర్డ్ - రూ.11 లక్షలు. బేసిక్ ఎస్ఏ - రూ.10 లక్షలు.
 • ఆల్ ఇన్ వన్ కాల్క్ యాప్ ఆధారంగా మొదటి సంవత్సరం ప్రీమియం రూ.1,02,937.(ఏడాదికి). అర్ధ సంవత్సరానికి రూ.52,003. త్రైమాసికానికి రూ.26,269. నెలకు రూ.8756. సగటున రోజుకు చెల్లించే మొత్తం రూ.282. ఈ ఇన్సురెన్స్ ప్రీమియం 4.5 శాతం పన్నుతో కలిపి ఉంటుంది.

మెచ్యూరిటీ ప్రయోజనం..

 • ఉదాహరణకు మీరు పదిహేనేళ్ల కాలపరిమితితో ఈ పాలసీ తీసుకుంటే, 12 సంవత్సరాలకు రూ.5 లక్షల ప్రీమియం చెల్లింపుతో, బీమా మొత్తం రూ.8.17 లక్షలకు (జీవించి ఉంటే) అవుతుంది.

కావాల్సిన పత్రాలు

 • కన్యాధాన్ పాలసీని ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు
 • ఆదాయపు పత్రం
 • ఐడెంటిటీ కార్డు
 • అడ్రస్ ప్రూఫ్పా
 • స్‌పోర్ట్ సైజ్ ఫోటో 
 • సంతకం చేసిన దరఖాస్తు ఫారమ్
 • చెక్కు, 
 • ఫస్ట్ ప్రీమియంకు క్యాష్ లేదా చెక్కు.
 • పుట్టిన తేదీ సర్టిఫికెట్ అవసరం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "LIC Kanyadan Policy"

Post a Comment