Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

చదువే వద్దంటే..స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది

ముగ్గురు ఆడపిల్లలు. రెండెకరాల చేనే జీవనాధారం. ఆర్థిక పరిస్థితి అనుకూలించక అమ్మానాన్న చదువు ఆపేయమన్నారు. కానీ ఆమె అంగీకరించలేదు. కష్టపడి చదివి మంచి మార్కులతో పది, ఇంటర్‌ పూర్తిచేసింది. డీఈఈ సెట్‌ రాసి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన గడీల అనోధ.. విద్యపై తనకున్న మక్కువను చాటి చెప్పింది. ఆమె గురించి తన మాటల్లోనే..

చదువే వద్దంటే..స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం బోడపల్లి మా స్వగ్రామం. అమ్మానాన్న తిరుపతి-రాజేశ్వరీ రెండు ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటారు. నాకు అక్క, చెల్లితోపాటు ఒక తమ్ముడు. అక్కకు వివాహమైంది. ఆ అప్పులే ఇంకా ఉన్నాయి. చేదోడుగా ఉంటానని నాన్న చదువిక చాలనేవారు. మా గ్రామంలో ఎనిమిదో తరగతి వరకే ఉంది. పది వరకు కొనసాగించాలంటే మూడు కిలోమీటర్ల దూరంలోని ఇట్యాల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలి. శంకర్రావు అనే మాష్టారు సాయంతో నాన్నను ఒప్పించా. రోజూ ఆటోలోనో  కాలినడకనో పాఠశాలకు వెళ్లేదాన్ని. 2019లో 9.3 గ్రేడింగ్‌తో పది పూర్తిచేశా. అప్పుడూ చదువు చాలన్న మాటే. ఈ ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు కళాశాలలో చదివించలేమన్నారు. మళ్లీ శంకర్రావు మాష్టారే నచ్చజెప్పి, దహెగాం కస్తూర్బా కళాశాలలో ఇంటర్‌ (ఎంపీసీ)లో చేర్పించారు. చదువు ఎలాగైనా కొనసాగించాలనే లక్ష్యం ముందు ఇంకేమీ కనిపించేవి కావు. ఫలితంగా 976 మార్కులొచ్చాయి. తెలంగాణ కస్తూర్బా కళాశాలల్లో నాదే మొదటి ర్యాంకు.

పది మందికి జ్ఞానం పంచే బోధనావృత్తి అంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. అది తెలుసుకుని ఉపాధ్యాయులు ఇంటర్‌ తర్వాత డీఈఈసెట్‌ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) ప్రవేశపరీక్ష రాయమన్నారు. దరఖాస్తు చేశా. కోచింగ్‌ తీసుకునే స్థోమత లేదు. సొంతంగా చదివా. తెల్లవారుజామున ఉదయం 3 గం. నుంచి 8 గం. వరకు, రాత్రి 8 గం. నుంచి 11 గం.సమయాన్ని సన్నద్ధతకు కేటాయించేదాన్ని. ఈ ర్యాంకు నన్నే కాదు అమ్మానాన్నల్నీ సంతోషపరిచింది. అందుకే చదవాలన్న కోరికను గెలిపించుకోవడంలో నాకిది పెద్ద విజయమే. ఉపాధ్యాయురాలినై, ఆపై సివిల్స్‌ దిశగా వెళ్లాలన్నది భవిష్యత్‌ లక్ష్యం. ఇక ఈ దిశగా కృషి చేస్తా.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0