Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Google images

 Google images : Google లో మనకు కావాల్సిన ఇమేజ్ దొరకడం లేదా ? అయితే , ఎలా చేయాలో వివరణ

Google images

ప్రస్తుత టెక్నాలజీ యుగంలోప్రతీది ఆన్‌లైన్‌లో దొరుకుతోంది. ఏ సమాచారం కావాలన్నా Google లో సెర్చ్​ చేసి క్షణాల్లో తెలుసుకోవచ్చు.అయితే, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం Google లో చాలా మంది తమకు కావాల్సిన ఇమేజెస్ దొరకడం లేదని ఫీలవుతుంటారు.

అటువంటి, వారి కోసం కొన్ని కొత్త పద్దతులను పరిచయం చేస్తోంది Google ​. వీటిని ఫాలో అవ్వడం ద్వారాయూజర్లు తమకు కావాల్సిన ప్రతీ ఇమేజ్​ను హై క్వాలిటీలో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. Google లో సెర్చ్‌లో ఇమేజ్ వచ్చాక దానిపై రైట్ క్లిక్ చేసి సెర్చ్ Google  ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీకు బోలెడన్ని ఇమేజెస్ కనబడుతాయి. అందులో మీకు కావాల్సిన ఇమేజ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ఇమేజెస్ దొరకనప్పుడు Google  అందించే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మీరు క్వాలిటీ ఇమేజెస్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకుగాను మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.. మీ డెస్క్ టాప్ లేదా ఫోన్ లేదా ఇతర ఏ డివైజెస్‌లోనైనా Google ​ఇమేజ్ సులభంగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

 డౌన్​లోడ్  చేయు విధానం

  • 1.బ్రౌజర్‌లో https://images.google.com/ అని టైప్ చేయండి.
  • 2.వెబ్ పేజ్‌లోని కెమెరా ఐకాన్‌కు ఎడమవైపునకు ఉన్న సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • 3.ఇప్పుడు మీరు మీకు కావాల్సిన ఇమేజ్ యూఆర్ఎల్ పేస్ట్ చేసి లేదా అప్‌లోడ్ యాన్ ఇమేజ్ ట్యాబ్ ద్వారా ఇమేజ్‌నుఅప్‌లోడ్ చేయండి. తద్వారా మీకు కావాల్సిన ఇమేజ్‌ను Google  సెర్చ్ చేసి పెడుతుంది.
  • 4.ఒకవేళ మీరు Google  క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లైతే మీరు సెర్చ్ చేయాలనుకున్న శాంపిల్ ఇమేజ్‌పై రైట్ క్లిక్ చేసి సెర్చ్ Google  ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్​ను ఎంచుకోండి.మీకు కావాల్సిన ఇమేజ్ లభిస్తుంది.
  • 5.మీ వద్ద ఉన్న ఇమేజ్‌ను Google  ఇమేజెస్ సైట్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా సిమిలార్ ఇమేజెస్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్‌లో సైతం రివర్స్ సెర్చ్ ద్వారా మీకు కావాల్సిన ఇమేజెస్‌ను ఇట్టే వెతుక్కోవచ్చు.. ఎలాగంటే..
  • 1.రివర్స్ సెర్చ్ ద్వారా ఇమేజెస్ సెర్చ్ చేయాలనుకుంటే మీ ఫోన్‌లో Google  యాప్ ఖచ్చితంగా ఉండాలి.
  • 2. సెర్చ్ బార్‌లో కెమెరా ఐకాన్‌పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీ కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అయి పిక్చర్ తీసుకోవాలా? అని మిమ్మల్ని అడుగుతుంది.
  • 3.కెమెరా నుంచి మీరు ఫొటో తీయొచ్చు లేదా మీ ఫోన్‌లోని ఇమేజ్‌ను బ్రౌజ్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకుగాను మీరు ఆ విండో కింది భాగంలో ఎడమ వైపున ఉండేసెలక్ట్ యాన్ ఇమేజ్ అనే ఆప్షన్ అనే బటన్‌ను క్లిక్ చేయాలి.
  • 4.అంతే మీకుకావాల్సినఇమేజ్‌ ప్రత్యక్షమవుతుంది. దాన్ని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Google images"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0