Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Did you know that PAN numbers contain some information about us?

 పాన్ సంఖ్యలో మన గురించి కొంత సమాచారం ఉంటుందని మీకు తెలుసా ?

Did you know that PAN numbers contain some information about us?

మీ పాన్ కార్డ్ నంబర్ మీకు గుర్తుందా. చాలా మందికి గుర్తుంటుంది. కానీ ఆ నంబర్ వెనుక ఉన్న అర్థం ఏంటి ఆ పది సంఖ్యలు ఏంటి ఎందుకు మీకు కేటాయించారు అనేది మీకు తెలుసా.

పాన్ నెంబరు కోడ్ మాత్రమే కాదు.. ఆ నంబర్‌తో కార్డుదారుని గురించి కొంత సమాచారం తెలుస్తుంది.

యుటీఐ లేదా ఎన్ఎస్‌డీఎల్ ద్వారా ఒక క్రమంలో పాన్ నంబర్‌ను వ్యక్తులకు, ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. మీ మొబైల్ నంబర్ మాదిరిగా పాన్ నంబర్ కంప్యూటర్ జనరేటెడ్ నంబర్ కాదు. దాని వెనుక పరమార్థం ఉంది.

పాన్ సంఖ్య 10 అక్షరాలను కలిగి ఉంటుంది. అందులో సంఖ్యలతో పాటు అక్షరాలు ఉంటాయి. మొదటి ఐదు ఆంగ్ల అక్షరాలు, తర్వాత నాలుగు సంఖ్యలు, చివరిలో ఒక అక్షరం ఉంటుంది.

ఒక్కోసారి ఇంగ్లీష్ అక్షరం 'O' , సున్నా '0'(జిరో) కి మధ్య వ్యత్యాసాన్ని గుర్తుపట్టకపోవచ్చు. అయితే మీకు సంఖ్యల వెనకు ఉన్న అర్థం తెలిస్తే సులభంగా గుర్తించవచ్చు.

పాన్‌లో మొదటి మూడు అక్షరాలు AAA to ZZZ సిరీస్‌లో ఉంటాయి. నాలుగో అక్షరం ఆదాయ పన్ను శాఖ దృష్టిలో మీరు ఏంటి అనేది చెప్తుంది. అందరు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు నాలుగో అక్షరం "P" అనే ఉంటుంది.

"P" - అంటే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడు
"C" - అని ఉంటే కంపెనీ
"H" - అని ఉంటే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌)
"A" - అంటే వ్యక్తులు లేదా సంస్థల బృందం(అసోసియేషన్ పర్సన్స్‌-ఏఓపి)
"B" - వ్యక్తుల బృందం(బిఓఐ)
"G" - ప్రభుత్వ ఏజెన్సీ
"J" - తాత్కాలిక న్యాయవ్యవస్థ
"L" - స్థానిక అధికారిక కేంద్రం
"F" - సంస్థ లేదా పరిమిత భాగస్వామ్య సంస్థ
"T" - ట్రస్ట్‌
ఐదో అక్షరం మీ ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని తెలుపుతుంది. ఉదాహరణకు మీ సర్‌నేమ్ సింగ్ అయితే Singh ఐదో అక్షరం "S" అవుతుంది. వ్యక్తులు కాకుండా ఇతరులు అయితే పాన్ కార్డు హోల్డర్ పేరులోని మొదటి అక్షరం ఉంటుంది. ఆ తర్వాత నాలుగు సంఖ్యంలు 0001 నుంచి 9999 మధ్య ఉంటాయి. చివరి సంఖ్య ఎప్పుడు అక్షరం ఉంటుంది. పాన్ సంఖ్య వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుంటే సులభంగా గుర్తుంచుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Did you know that PAN numbers contain some information about us?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0