Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Expert opinion is that it is better to walk how many feet per day.

 రోజుకి నడక ఎన్ని అడుగులు నడిస్తే మంచిదో నిపుణుల అభిప్రాయాలు.

Expert opinion is that it is better to walk how many feet per day.

చాలా మందికి ఈ అనుమానం ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత దూరం నడవాలి అని. అయితే ఎన్ని 

సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం, జీవన విధానం ప్రధాన పాత్ర పోషిస్తాయి. అదే విధంగా ఒత్తిడి లేకుండా ఉండాలి. మంచి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. అలానే వ్యాయామం కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనాలని మనం పొందవచ్చు. కేవలం ఆరోగ్యంగా ఫిట్ గా మాత్రమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరకుండా జాగ్రత్తగా ఉండొచ్చు.

​ఎంత నడవాలి..

చాలా మంది ప్రతి రోజూ వాకింగ్ చేయడం మంచిది అని చెప్తూ ఉంటారు. అయితే ఎంత దూరం నడవచ్చు..? , ఎన్ని అడుగులు వేయొచ్చు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి దాని కోసం మనం తెలుసుకుందాం. ఫిట్ గా ఉండడానికి, సమస్యలు లేకుండా ఉండడానికి ఎన్ని అడుగులు వేయాలి అనేది మనం చూస్తే... తాజాగా చేసిన స్టడీ ప్రకారం 10 వేల అడుగులు వరకు రోజూ నడిస్తే మంచిదని తెలుస్తోంది.

​రోజుకి ఏడు వేల అడుగులు..

తాజాగా పబ్లిష్ చేసిన ఈ సమాచారాన్ని బట్టి మనకి ఈ ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయి. కనీసం రోజుకి ఏడు వేల అడుగులు వేస్తె మంచిదట. అయితే పది వేల అడుగుల కంటే ఎక్కువ నడవడం లేదా వేగంగా నడవడం వలన అంత ప్రయోజనం లేదు అని డాక్టర్ చెప్తున్నారు.

​పరిశోధన సాగిందిలా..

ఎన్ని అడుగులు వేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని చూస్తే.. ఈ రీసర్చ్ లో రెండు వేల ఒక వంద మంది పాల్గొనడం జరిగింది. వీళ్ళ వయసు 38 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మధ్య ఉన్నాయి. అయితే వీళ్ళని మూడు గ్రూపులు కింద విభజించారు. ఏడు వేల అడుగుల కంటే తక్కువ రోజుకి నడిచిన వాళ్ళు, ఏడు వేల నుండి 9,999 నడిచిన వాళ్ళు, 10 వేల కంటే ఎక్కువ అడుగులు నడిచిన వాళ్ళు.

​లాభాలేంటంటే..

అయితే ఏడు వేల నుండి పది వేల అడుగుల మధ్య నడిచిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని ...మోర్టాలిటీ రిస్క్ తగ్గింది అని తెలిసింది. ఇక పదివేల అడుగుల కంటే ఎక్కువ నడిచిన వాళ్ళలో ఎలాంటి ప్రయోజనాలు కనపడ లేదు. ఇది ఇలా ఉంటే నాలుగు వేల అడుగుల నుండి ఐదు వేల అడుగులు నడిచిన వాళ్ళ కూడా కాస్త పరవాలేదు అనిపించిందట.

​ఎక్కువ నడిస్తే..

5 వేల నుంచి ఆరువేల అడుగులు నడిచిన వాళ్లలో incremental risk reduction తగ్గింది. 10 వేల వరకు ఇలానే ఉంది. కానీ అంత కంటే ఎక్కువ అడుగులు నడవడం వలన అంత పెద్ద ఉపయోగం ఏమి లేదని కంపేర్ చేస్తే తెలిసింది అన్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Expert opinion is that it is better to walk how many feet per day."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0