Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Home Loan

 Home Loan : ప్రముఖ బ్యాంకుల ఫెస్టివల్ బొనంజా. తక్కువ వడ్డీకే గృహ రుణాలు.ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందొ వివరణ.

Cheapest home loans : సొంతిళ్లు కలిగి ఉండాలనేకల ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ సొంతింటి కలను సాకారం చేసుకునే ఆర్థిక స్థోమత చాలామందికి ఉండదు. ఇలాంటి వారు గృహ రుణాలను తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతారు.

అయితే ఏ బ్యాంకులు అతి తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలు అందిస్తున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతానికైతే గృహ రుణ వడ్డీ రేట్లు 6.5% నుంచి ప్రారంభమవుతున్నాయి. కాగా కొన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు చవకైన వడ్డీ రేట్లకే హోం లోన్స్ ఇస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India)
ఇటీవలే దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. కొత్త, బ్యాలెన్స్ బదిలీ రుణగ్రహీతల (balance transfer borrowers)కు ఫెస్టివల్ బొనాంజా ప్రకటించింది. 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్న రుణగ్రహీతలకు రుణ మొత్తంతో సంబంధం లేకుండా 6.7 శాతం వడ్డీ రేటుకు లోన్స్ ఇస్తామని ప్రకటించింది. జీతం పొందని రుణగ్రహీతలకు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ప్రీమియంపై వసూలు చేసే వడ్డీని కూడా ఎస్‌బీఐ మినహాయించింది.
చాలా మంది రుణగ్రహీతల పాత రుణాలు బేస్ రేట్ లేదా మార్జినల్ కాస్ట్ ఫండ్-బేస్డ్ లెండింగ్ రేట్స్ (MCLR) పరిధిలోనే ఉన్నాయి. ఈ బేస్ రేట్ అనేది చాలా బ్యాంకులకు RBI రెపో రేటుతో సమానంగా ఉంటుంది. అయితే కొత్త రుణాలు వేరే బేస్ రేటు (external benchmark) తో ముడిపడి ఉంటాయనేది రుణ దరఖాస్తుదారులు గమనించాలి. ఈ బెంచ్‌మార్క్-లింక్డ్ రుణాల పాలసీ రేటు మార్పులు స్పష్టంగా తెలుసుకోవచ్చు కాబట్టి బ్యాంకుల నుంచి రెపో రేటు తగ్గింపు ప్రయోజనాలను పొందడం రుణగ్రహీతలకు సాధ్యపడుతుంది.
2. కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)
ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ గత సంవత్సరం నవంబర్ నుంచి అతి తక్కువ వడ్డీ రేట్లపై గృహ రుణాలు అందిస్తోంది. ఇది 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.75 లక్షల రుణానికి 6.5 శాతం వడ్డీరేటును వసూలు చేస్తుంది. ఈ మొత్తంలో రుణం తీసుకుంటే నెలకు రూ.55,918 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
3. పంజాబ్ & సింద్ (Punjab & Sind)
ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు గృహ రుణాలపై 6.65 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.
4. టాటా క్యాపిటల్ (Tata Capital)
టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ కంపెనీ 20 ఏళ్ల కాలపరిమితితో రూ.75 లక్షల గృహ రుణానికి 6.7 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. రుణ గ్రహీతలు రూ.56,805 ఈఎంఐ చెల్లించాలి.
5. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణ వడ్డీ రేట్లు 6.75 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ బ్యాంక్ ఫెస్టివల్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంది. మీరు 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.75 లక్షల గృహ రుణం తీసుకుంటే, మొత్తం రూ.57,027 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. హెచ్‌ఎఫ్‌సీ (HFC) ఆర్థిక సంస్థ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాతో దాదాపు సమానంగా 6.8 శాతం వడ్డీరేట్లను వసూలు చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ వసూలు చేస్తున్న 7 శాతం వడ్డీ రేటు కంటే హెచ్‌ఎఫ్‌సీ తక్కువ రేటుకు రుణాలను అందించడం గమనార్హం.
6. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank)
ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు 6.8 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. రుణగ్రహీతలు ఈఎంఐ రూ.57,250 చెల్లించాల్సి ఉంటుంది. ఇండియన్ బ్యాంక్ కూడా 6.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Home Loan"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0