Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Power Bill App: No tension that the electricity bill has not arrived. An explanation of how you can take your bill yourself.

 Power Bill App : విద్యుత్ బిల్లు రాలేదని నో టెన్షన్.మీ బిల్లు మీరే తీసుకోవచ్చు ఎలానో వివరణ.

Power Bill App: No tension that the electricity bill has not arrived. An explanation of how you can take your bill yourself.

మీ ఇంటికి కరెంటు బిల్లు రాలేదా..ఒక నెల బిల్లు రాకపోతే..రెండు నెలలకు కలిపి అధిక బిల్లులు వస్తాయని కంగారు పడుతున్నారా..?కరోనా కాలంలో బిల్లింగ్ తీసే వారు రాకపోయిన పర్వాలేదు.ఎవరి ఇంటి మీటరు రీడింగ్‌ను వారే తీసుకునేందుకు విద్యుత్ శాఖ సెల్ఫ్ రిడింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది.

ఇందుకోసం ప్రత్యేక యాప్‌లను రూపోందించి విడుదల చేసింది..
సెల్ఫ్ స్కానింగ్ ద్వార మీటర్ రీడింగ్
కరోనా సమయంలో ప్రజల జీవన విధానంలో తీవ్ర మార్పులు వస్తున్న విషయం తెలిసిందే..మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు లాక్డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో మీటరు రీడింగ్ తీసే విద్యుత్ సిబ్బంది వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు ఎవరికి కరోనా ఉందో తెలియని పరిస్థితుల్లో సిబ్బంది మరియు వినియోగదారుల రక్షణను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
విద్యుత్ బిల్లులకు ఆధునికత
ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యుత్ డిస్కంలు ఈ సమస్యలను అధిగమించేందుకు బిల్లింగ్ కోసం ఓ యాప్‌ను రూపోందించి అందుబాటులోకి తెచ్చింది. తమ వినియోగదారుల విద్యుత్ బిల్లుల పంపిణి మరియు చెల్లింపుకు ఆధునికతను తీసుకువచ్చింది. గతంలో కరెంటు బిల్లులు రెండు నెలలకు ఒక సారి తీయడంతో పెద్ద మొత్తంలో విమర్శలు వచ్చాయి. ప్రతి ఇంటికి డబుల్ బిల్లులు వచ్చిన పరిస్థితి కనిపించింది. దీంతో విద్యుత్ డిస్కంలు విద్యుత్ బిల్లులను క్రియోట్ చేసేందుకు స్వంతగా ఓ యాప్‌ను రూపోందించాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఎన్పిడీసిఎల్ ముందుగా ఈ ఆప్‌ను తీసుకురాగా సదరన్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ కూడ తాజాగా (TSSPDCL ) అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఉపయోగించడం ఎలా ?
ముందుగా టీఎస్‌ఎస్పీడీసిఎల్ (TSSPDCL ) ఐటీ వింగ్‌ లేదా భారత్‌ మీటర్‌ రీడింగ్‌ యాప్‌ ను డౌన్‌లోడ్ చేసుకొవాలి. అనంతరం ఓపెన్‌ చేసి అందులో కన్స్యూమర్ సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి ఎంపిక చేసుకోవాలి. తర్వాత వినియోగదారులు యూనిక్‌ సర్వీసు నంబర్ మరియు మొబైల్‌ నంబర్‌ను మరియు ఈమేయిల్ అడ్రస్‌ను నమోదు చేయాలి. అనంతరం అందులో ఉండే స్కాన్‌ కేడబ్ల్యూహెచ్‌ రీడింగ్‌ను ఎంపిక చేసి మీటర్‌లోని రీడింగ్‌ను స్కాన్‌ చేసి సబ్‌మిట్ బటన్‌ క్లిక్‌ చేయాలి. మీరు తీసిన రీడింగ్ రీడింగ్ ఫోటో విద్యుత్ అధికారులకు వెళుతోంది. అన్ని సక్రమంగా ఉంటే వెంటనే మీరు ఎంటర్ చేసిన ఫోన్ నంబర్‌కు అధికారులు విద్యుత్‌ బిల్లును ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపిస్తారు . బిల్లు వచ్చిన అనంతరం అందులోనే చెల్లించుకునే అవకాశం కూడ కల్పించారు.ఇక రీడింగ్ కూడ రెండు మూడు సార్లు తీసేందుకు అవకావం లేదు. మీకంటే ముందే ఎవరైన స్కాన్ చేసి ఉంటే యాప్‌లో చూపిస్తుంది.
సిబ్బంది రాకుంటే చేయాల్సిన పని
అయితే ప్రస్తుత ఏ నెలలో స్పాట్‌ బిల్లింగ్‌ సిబ్బంది ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీయకపోతే, రెండు రోజులు వేచి చూసి ఆ తర్వాత సెల్ఫ్‌ బిల్లింగ్‌ సదుపాయాన్ని వాడుకోవాలని విద్యుత్ అధికారులు సూచించారు. కాగా అవకాశాన్ని ప్రస్తుత కరోనా కాలంలో అమలు చేస్తున్నట్టు చెప్పారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Power Bill App: No tension that the electricity bill has not arrived. An explanation of how you can take your bill yourself."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0