Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs can be applied for in Andhra Pradesh.

 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోగలరు.

Jobs can be applied for in Andhra Pradesh.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్తుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. జిల్లాల వారిగా ఖాళీలు, అర్హతలు, వేతనాలు, ఇతర వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఎన్‌హెచ్‌ఎం, ఆంధ్రప్రదేశ్‌లో 858 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం.. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్‌ఓల ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల : 858

  • పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌లు-53
  • మెడికల్‌ ఆఫీసర్లు-308
  • స్టాఫ్‌ నర్సులు-324
  • ల్యాబ్‌ టెక్నీషియన్లు-14
  • పారామెడికల్‌ స్టాఫ్‌-90
  • కన్సల్టెంట్‌-13
  • సపోర్ట్‌ స్టాఫ్‌-56.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), డీఎంఎల్‌ /టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ(సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

వెబ్‌సైట్‌: visakhapatnam.ap.gov.in

డీఎంహెచ్‌వో, కృష్ణా జిల్లాలో 55 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 55

పోస్టుల వివరాలు: 

  • సైకియాట్రిస్ట్‌లు-01
  • ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌లు-01
  • జనరల్‌ ఫిజీషియన్‌-01
  • కార్డియాలజిస్ట్‌-01
  • మెడికల్‌ ఆఫీసర్లు-20
  • స్టాఫ్‌ నర్సు-17
  • ల్యాబ్‌ టెక్నీషియన్‌-02
  • ఫిజియోథెరపిస్ట్‌/ఆక్యుపే షనల్‌ థెరపిస్ట్‌-02
  •  ఆడియోమెట్రీషియన్‌-03
  • సోషల్‌ వర్కర్‌-02
  • కన్సల్టెంట్‌/క్వాలిటీ మానిటర్‌-01
  • హాస్పిటల్‌ అటెండెంట్‌-02
  • శానిటరీ అటెండెంట్‌-02.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ (సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులకు(సైకియాట్రిస్ట్‌లు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌లు, జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌)వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మిగతా పోస్టుల్ని టెక్నికల్‌ అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

వాక్‌ ఇన్‌ తేదీలు: 2021, సెప్టెంబర్‌ 02 నుంచి 08 వరకు

దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021

 వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

డీఎంహెచ్‌వో, ప్రకాశంలో 61 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో)..నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌ హెచ్‌ ఎం) ద్వారా ఒప్పంద/అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 61

పోస్టుల వివరాలు: 

  • మెడికల్‌ ఆఫీసర్లు-23
  • స్టాఫ్‌ నర్సులు-26 
  • సైకియాట్రిక్‌ నర్స్‌-01
  • ఫిజియోథెరపిస్ట్‌/ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌-02
  • ఆటోమెట్రీషియన్‌-02, సోషల్‌ వర్కర్‌-02
  • కన్సల్టెంట్‌-క్వాలిటీ మానిటర్‌-01
  • హాస్పిటల్‌ అటెండెంట్‌-02
  • శానిటరీ అటెండెంట్‌-02.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ (సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.

వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.53,495 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్‌-హెల్త్‌ ఆఫీస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు, జీజీహెచ్, కాంపౌండ్, ఒంగోలు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in

డీఎంహెచ్‌వో, శ్రీకాకుళంలో 71 మెడికల్‌ స్టాఫ్‌ కొలువులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ ఎం) ద్వారా ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపది కన మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 71

పోస్టుల వివరాలు: 

సైకియాట్రిస్ట్‌-01

ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌-01

జనరల్‌ ఫిజిషియన్‌-01

ఎన్‌పీసీడీసీ వైద్యాధికారులు-11

ఎన్‌బీఎస్‌యూసీ వైద్యాధికారులు-07

స్టాఫ్‌ నర్సులు-15

సెకియాట్రిక్‌ నర్స్‌-01

జిరియాట్రిక్‌/పెల్లవేటివ్‌ కేర్‌ నర్సులు-03

మెడికల్‌ కాలేజి ల్యాబ్‌ టెక్నీషియన్‌లు-19

ఫ్లోరోసిస్‌ ల్యాబ్‌ టెక్నీషియన్లు-01

ఎన్‌పీహెచ్‌సీఈ ఫిజియోథెరపిస్ట్‌/ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌-02

 ఆడియో మెట్రీషియన్‌-02

ఎన్‌ఎంహెచ్‌పీ సోషల్‌ వర్కర్‌-01

ఎన్‌టీసీపీ సోషల్‌ వర్కర్‌-01

కన్సల్టెంట్‌ క్వాలిటీ మానిటర్‌-01

ఎన్‌పీహెచ్‌సీఈ హాస్పిటల్‌ అటెండెంట్‌-02

ఎన్‌పీహెచ్‌సీఈ అటెండెంట్‌-02.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం /బీఎస్సీ(నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

వెబ్‌సైట్‌: srikakulam.ap.gov.in

ఐఐఎం, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు
విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

విభాగాలు: డెసిషన్‌ సైన్స్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, ఆర్గనైజేషనల్‌∙బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్, పబ్లిక్‌ పాలసీ, ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, మార్కెటింగ్, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సెమినార్‌ ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ఐఐఎం విశాఖపట్నం, ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌-530003 చిరునామకు పంపించాలి.

ఈమెయిల్‌: facultyrecruit2021sep@iimv.ac.in

ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.10.2021

వెబ్‌సైట్‌: www.iimv.ac.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs can be applied for in Andhra Pradesh."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0