Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

kidney problems

 kidney problems : కరోనా బారిన పడిన వారికి కిడ్నీ సమస్యలు , లక్షణాలు ఎలా ఉంటాయో వివరణ.

kidney problems


కరోనా (Corona Effect) మహమ్మారి బారిన పడినవారు చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.

ఎక్కువ మంది రోగులు వైరస్ బారి నుంచి తప్పించుకున్నప్పటికీ కొంతమందికి మాత్రం మూత్ర పిండాలు దెబ్బతినడడం, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్(ఈఎక్ కేడీ) లాంటి లక్షణాలు అనుభవిస్తున్నారు. ప్రధానంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు.తాజాగా సెయిట్ లూయిస్ హెల్త్ కేర్ సిస్టం, వాషింగ్టన్ సేట్ వర్సిటీకి చెందిన పరిశోధకులు కోవిడ్ అనంతర పరిణామాలు, లాంగ్ కోవడ్ లాంటి అంశాలపై అధ్యయనం చేశారు.కిడ్నీలు పనిచేయకపోవడం, మూత్రపిండాల వ్యాధితో మరణించిన వ్యక్తులకు సంబంధించిన ఫెడరల్ హెల్త్ డేటానువిశ్లేషించారు. మూత్రపిండాల వ్యాధులు ఎలాంటి లక్షణాలను ప్రదర్శించదు కాబట్టి 37 మిలియన్లలో 90 శాతం మందికి వారి పరిస్థితి గురించి తెలియదని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అంచనావేసింది.


ఈ అధ్యయనం ప్రకారం కోవిడ్ అనంతరంపల్మనరీ, ఎక్స్ ట్రాల్మోనరీ అవయవ వ్యవస్థల్లో ప్రమాదముండే అవకాశముందని పరిశోధుకులు గుర్తించారు. దీన్నే లాంగ్​కోవిడ్​గా పేర్కొన్నారు.లాంగ్ కోవిడ్ అనేది కరోనా సోకిన నెల తర్వాత లేదా అంతకంటే ఎక్కువ కాలంలో నిరంతరం నూతన లక్షణాలు వచ్చే పరిస్థితి. ఇది మూత్రపిండాలతో ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది.2020 మార్చి 1 నుంచి సెప్టెంబరు 2021 వరకు 1,726,683 మంది యూఎస్ సైనికులపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.

ఈ అధ్యయనంలో భాగంగా కరోనాతో ఆసుపత్రిలో చేరిన వారిలో అత్యవసర చికిత్స తీసుకున్నవారికి మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం అధికంగా ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే లక్షణాల తక్కువగా ఉన్నవారిలో రిస్క్ ఉండదని చెప్పలేమని, రాబోయే రోజుల్లో ఆరోగ్య పరిస్థితులు ఎలా మారతాయనేది అంచనా వేయలేమని వాషింగ్టన్ వర్సిటీకి చెందిన జియాద్ అల్-అలీ తెలిపారు. మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై స్పష్టత లేదని, సిటోకిన్ స్టోమ్ సిండ్రోమ్ లేదా ప్రత్యక్షంగా కణాలపై ప్రభావం చూపే అవకాశముంది ఆయన అన్నారు.

లాంగ్ కోవిడ్ నుంచి ఎలా కోలుకోవాలి.

ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నవారికి లక్షణాలు తక్కువగా ఉంటాయి. మూత్రపిండాల సమస్యలకు సంబంధించి నిర్దిష్ట లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి మూత్రం తగినంత రాకపోయినా, చీలమండలు, కాళ్లు, కళ్లు చుట్టూ వాపు రావడం, శ్వాస సరిగ్గా అందకపోవడం, వికారం, మూర్ఛలు లేదా కోమా, ఛాతిపై ఒత్తిడి లేదా నొప్పి లాంటి సంకేతాలు ఉండవచ్చని భాటియా హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ అభిషేక్ సుభాష్ చెప్పారు. యూరిన్ లో అధిక ప్రోటీన్ ఉంటుందని, అబ్ నార్మల్ బ్లడ్ వర్క్ లాంటి సంకేతాలు ఉంటాయని ఆయన అన్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ముందుగానే వైద్యులను సంప్రదించాలని సుభాష్ అంటున్నారు. కోవిడ్ బారిన పడిన రోగులందరూ క్రమం తప్పకుండా వైద్యులను కలిసి మూత్రపిండాల పనితీరును నిర్ధారించడానికి క్రియేటినిన్ పరీక్ష చేయాలని అన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక పరిస్థితులతో బాధపడుతున్న రోగుల మూత్రపిండాలు ఇప్పటికే తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నందున, సంబంధిత వైద్యులను సంప్రదించి నిర్దిష్ట చికిత్సలు తీసుకోవాల్సినఅవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "kidney problems"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0