New facility in Kovin .. Let the customer know the vaccination status
కొవిన్లో కొత్త సదుపాయం .. కస్టమర్ వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకునే వీలు
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తి వ్యాక్సినేషన్ వేసుకున్నాడా లేదా అనే విషయాన్ని ఒక సంస్థ తెలుసుకునేందుకు వీలుగా కేవైసీ విఎస్ (నో యువర్ కస్టమర్ / క్లయింట్ వ్యాక్సినేషన్ స్టేటస్ ) సదుపాయాన్ని ప్రవేశ పెట్టింది.
వాటిని ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ ద్వారా తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంది. అయితే మాల్స్, పని ప్రదేశాలు వంటి చోట్ల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించకుండా కేవలం మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా సదరు వ్యక్తి వ్యాక్సిన్ వేసుకున్నాడా ? ఒక డోసు మాత్రమే వేసుకున్నాడా ? అనేది తెలుసుకోవచ్చు. పని ప్రదేశంలో సదరు సంస్థ తమ ఉద్యోగుల వ్యాక్సినేషన్ స్థితి తెలుసుకునేందుకు రైల్వేలు, విమానయాన సంస్థలు తమ ప్రయాణికుల వ్యాక్సిన్ వివరాలు తెలుసుకునేందుకు కెవైసీ వీసీ ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే హోటళ్లు. గదులను కస్టమర్లకు ఇచ్చే ముందు వారి వ్యాక్సినేషన్ స్థితి తెలుసుకునేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది.
ఉదాహరణకు రైల్వే టికెట్ బుక్ చేయాలనుకున్నప్పుడు . ప్రయాణికుడి వ్యాక్సినేషన్ స్థితి రైల్వే శాఖ తెలుసుకోవాలంటే ఏపీఐని తన సిస్టమ్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్ సమయంలో మొబైల్ నెంబర్ , ఒటిపీ ఎంటర్ చేయడం ద్వారా వ్యాక్సిన్ వివరాలు రైల్వేశాఖకు అందుతాయి. ఇది వ్యక్తి సమ్మతి ఆధారంగా జరుగుతుంది కాబట్టి పౌరుల డేటాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్రం చెబుతోంది. దీని ద్వారా త్వరిత గతిని టీకా సమాచారం పొందే వీలుంటుందని పేర్కొంది. ఇందుకోసం కొవిన్ టీమ్ సిద్ధం చేసిన ఏపీఐని సులువుగా ఏ సిస్టమ్‌లోనైనా పబ్లిక్ ప్రైవేట్ సంస్థలు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.
0 Response to "New facility in Kovin .. Let the customer know the vaccination status"
Post a Comment