RBI: Changes in Debit and Credit Card Payments ..!
RBI : డెబిట్ , క్రెడిట్ కార్డు పేమెంట్ లో మార్పులు !
తాజాగా రిజర్వ్ బ్యాంకు (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. మర్చంట్ సైట్లకు టోకెనైజేషన్‌ను కట్టడి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు ఇక సేవ్ అవ్వవు.
ఇది 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంది. ఇక కస్టమర్స్ పై ఎలాంటి ప్రభావం పసుతుంది అనేది చూస్తే.. ఇప్పుడు అయితే అన్ని మర్చంట్ ప్లాట్‌ఫామ్‌లు కార్డు వివరాలు సేవ్ చేసుకుంటున్నాయి. షాపింగ్ చేసే సమయంలో ప్రతీసారి క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు వివరాలు పూర్తిగా టైప్ చెయ్యక్కర్లేదు. ఓటీపీతోనే పని పూర్తి అవుతుంది.
ఒకవేళ కనుక ఈ టోకెనైజేషన్ రద్దయితే ట్రాన్సాక్షన్ చేయాల్సిన ప్రతీ సారి కూడా కస్టమర్లు తమ 16 అంకెల కార్డు నంబర్, కార్డు ఎక్స్పైరీ, సీవీ టైప్ చేయాల్సి ఉంటుంది. దీనితో ఆన్లైన్ షాపింగ్ మరింత సెక్యూర్ గా ఉంటుంది. కార్డు వివరాలు సేవ్ కాకుండా.. వన్‌క్లిక్ పర్చేజెస్ ఫీచర్ లేకపోతే కస్టమర్లు కార్డు పేమెంట్స్‌పై ఆసక్తి కోల్పోతారేమోనని మర్చంట్లు కాస్త ఆందోళన చేస్తున్నప్పటికీ కస్టమర్లు వివరాలు సేఫ్‌గా ఉండేలా అన్ని చర్యలు చేపడతామని అన్నారు. ఆర్బీఐ మాత్రం టోకెనైజేషన్ కట్టడికే నిర్ణయం తీసుకుంది.
0 Response to "RBI: Changes in Debit and Credit Card Payments ..!"
Post a Comment