What if I have an SBI debit card? Benefit up to Rs.1,00,000.
ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉంటే? రూ.1,00,000 వరకు బెనిఫిట్.
మీ దగ్గర ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉంటే సులభంగా రూ.1,00,000 మీరు లోన్ తీసుకోవచ్చు. ఈఎమ్ఐ కూడా ప్రతి నెల చెల్లించవచ్చు. మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి స్టోర్ కి వెళ్లినప్పుడు మీ దగ్గర లేని సమయంలో ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా లోన్ అక్కడే తీసుకోవచ్చు. అలాగే, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టల్స్ ద్వారా ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఎస్‌బీఐ కస్టమర్లు ఈఎమ్ఐ సదుపాయాన్ని వాడుకోవచ్చు.
ఆన్‌లైన్ షాపింగ్ మాత్రమే కాదు.. ఆఫ్‌లైన్‌లో కూడా అంటే ఎక్కడైనా స్టోర్లలో కూడా మీరు షాపింగ్ చేసి మీ పేమెంట్‌ను ఈఎమ్ఐగా మార్చేయొచ్చు. ఈ ఈఎమ్ఐ తీసుకునేటప్పుడు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐ ఖాతాదారులు రూ.8,000 నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని పొందవచ్చు. రెండేళ్ల ఎంసీఎల్ఆర్(7.20%) + 7.50% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం వడ్డీరేటు అనేది 14.70%గా ఉంటుంది
మీరు ఈ మొత్తాన్ని తీసుకున్నప్పుడు ఆరు, తొమ్మిది, పన్నెండు, పద్దెనిమిది నెలల రుణ కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
అయితే, ఈ సౌకర్యం మీకు అందుబాటులో ఉందో/లేదో తెలుసుకోవడానికి కస్టమర్లు మీ బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి DCEMI అని టైపు చేసి 567676కు పంపాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ అత్యవసర సమయాల్లో చాలా భాగ ఉపయోగపడుతుంది.
- మర్చంట్ స్టోర్ వద్ద పివోఎస్ మెషిన్ పై ఎస్‌బీఐ డెబిట్ కార్డును స్వైప్ చేయండి
- ఇప్పుడు బ్రాండ్ ఈఎమ్ఐ - బ్యాంక్ ఈఎమ్ఐ అనే ఆప్షన్ ఎంచుకోండి.
- మీకు కావాల్సిన మొత్తం, రుణ కాలపరిమితి రెండు ఎంచుకోండి.
- మీ అర్హత చెక్ చేసిన తర్వాత పిన్ ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేయండి.
- ఇప్పుడు ఆ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది,
- రుణ నిబంధనలు, షరతులు ఉన్న ఛార్జ్ స్లిప్ ప్రింట్ వస్తుంది. దాని మీద కస్టమర్ సంతకం చేయాల్సి ఉంటుంది
- ఆన్‌లైన్‌లో ఈఎమ్ఐ సదుపాయం
- బ్యాంకులో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబరు సహాయంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో లాగిన్ అవ్వండి.
- మీకు నచ్చిన వస్తువు కొనుక్కొని పేమెంట్ మీద క్లిక్ చేయండి.
- మీకు కనిపించే పేమెంట్ ఆప్షన్ల నుంచి ఈజీ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకొని, ఆ తర్వాత ఎస్‌బీఐ ఎంచుకోండి.
- రుణ కాలవ్యవది ఎంచుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి.
- ఎస్‌బీఐ లాగిన్ పేజీలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు క్రెడెన్షియల్స్ నమోదు చేయండి.
- ఒకవేళ లోన్ ఆమోదీస్తే ఆర్డర్ బుక్ చేయబడుతుంది.
- అప్పుడు నిబంధనలు & షరతులు(టీసీ) కనిపిస్తాయి.
0 Response to "What if I have an SBI debit card? Benefit up to Rs.1,00,000."
Post a Comment