Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

50000 Ex-Gratia to Covid-19 deceased persons

  ఏపీలో కోవిడ్ తో మరణించిన వ్యక్తి కుటుంబానికి యాభైవేల ఆర్ధిక సహాయం

50000 Ex-Gratia to Covid-19 deceased persons

కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి వీటిని మంజూరు చేయాలని కలెక్టర్లకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లింపుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించింది. డీఆర్‌వో నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సుభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది.

రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.50 వేల చొప్పున సాయం అందించనుంది.

కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి వీటిని మంజూరు చేయాలని కలెక్టర్లకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో డీఆర్వో ఆధ్వర్యంలో ఓ సెల్‌ ఏర్పాటు చేసి, కొవిడ్‌ మృతుల కుటుంబీకుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

వీటిని పరిశీలించి కలెక్టర్‌కు సిఫార్సు చేశాక, రెండు వారాల్లో సాయం అందించనున్నారు. దరఖాస్తులో స్థానిక ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎం, వైద్యాధికారి సంతకాలు కూడా అవసరమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొవిడ్‌ మరణం నిర్ధారించే కమిటీ సర్టిఫికేట్‌, మృతుల కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ప్రతిపాదనలు పంపాలి. కొవిడ్‌ మృతుల కుటుంబంలో వారి తర్వాత ఎవరైతే ఉంటారో వారికే ఈ నష్టపరిహారం చెల్లిస్తారు.

దరఖాస్తులో పేరు, మృతుడితో బంధుత్వం, చనిపోయిన ప్రదేశం, దరఖాస్తుదారుడి చిరునామా, ఆధార్‌ నెంబరు, ఆధార్‌ లింక్‌ అయిన బ్యాంకు అకౌంట్‌, మరణ ధ్రువీకరణపత్రం, సీడీఏసీ ఆమోదించిన నెంబరుని ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తు నమూనాలో నింపాలి.

దరఖాస్తుతో పాటు

  • స్థానిక రిజిస్ట్రార్‌ మంజూరు చేసిన మరణ ధ్రువీకరణపత్రం,
  • సీడీఏసీ సర్టిఫికేట్‌,
  • ఆధార్‌ కార్డు జిరాక్స్‌,
  • బ్యాంకు అకౌంట్‌ కాపీ,
  • తహసీల్దారు జారీ చేసిన ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ కాపీలను జత చేయాలి. 
  • దరఖాస్తుపై ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్‌ కూడా కౌంటర్‌ సంతకం చేయాల్సి ఉంటుంది.
  • చివరిగా డీఆర్‌వో సంతకం చేసి ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది.

Download Orders for more details


Application Form

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "50000 Ex-Gratia to Covid-19 deceased persons"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0