NFL Recruitment
NFL Recruitment : నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ లో డిగ్రీ , డిప్లొమా , ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు .. ఇలా అప్లై చేయండి.
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (National Fertilizers Limited) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు తాజాగా సంస్థ నుంచి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. జూనియర్ ఇంజినీరింగ్ (ప్రొడక్షన్), జూనియర్ ఇంజనీరింగ్ (ఇన్‌స్ట్రుమెంటేషన్), జూనియర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్), లోకో అటెండెంట్, లోకో అటెండెంట్, అటెండెంట్ గ్రేడ్-I, అటెండెంట్ గ్రేడ్-I, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ తదితర విభాగంలో 183 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఈ నెల 21న దరఖాస్తు ప్రక్రియ (Job Application Process) ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు నవంబర్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అధికారిక వెబ్ సైట్ https://nationalfertilizers.com/ లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టు | ఖాళీలు |
జూనియర్ ఇంజినీరింగ్ (ప్రొడక్షన్) | 87 పోస్టులు |
జూనియర్ ఇంజనీరింగ్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) | 15 పోస్టులు |
జూనియర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) | 7 పోస్టులు |
లోకో అటెండెంట్ (ఎలక్ట్రికల్) | 4 పోస్టులు |
లోకో అటెండెంట్(మెకానికల్) | 19 పోస్టులు |
అటెండెంట్ గ్రేడ్-III | 17 పోస్టులు |
అటెండెంట్ గ్రేడ్-II | 19 పోస్టులు |
మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ | 15 పోస్టులు |
విద్యార్హతల వివరాలు:
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్: బీఎస్సీ లేదా మూడేళ్ల విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్(ఇన్స్ట్రుమెంటేషన్): ఇన్స్ట్రుమెంటేషన్ లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
అటెండెంట్ (ఎలక్ట్రికల్): టెన్త్ తో పాటు ఐటీఐ(ఎలక్ట్రికల్) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
అటెండెంట్ (మెకానికల్): టెన్త్+ఐటీఐ(ఫిట్టర్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
లోకో అటెండెంట్ మెకానికల్: ఇంజనీరింగ్ లో మూడేళ్ల ఫుల్ టైమ్ డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
మార్కెటింగ్ రిప్రజెంటీటివ్: బీఎస్సీ(అగ్రికల్చర్) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు రూ. 200లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
అప్లై చేయు విధానం
- అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
- Step 1: మొదటగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
- Step 2: అనంతరం Careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- Step 3: తర్వాత మీకు Recruitment in NFL అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- Step 4: అనంతరం 'Recruitment of Non- Executives (Workers) in Marketing, Transportation and various Technical Disciplines-2021' లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
- Step 5: ఇప్పుడు మీకు Advertisement, Apply Online అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మొదట Advertisement లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాలి. తర్వాత అప్లై Apply Online లింక్ పై పూర్తి చేయాలి.
- Step 6: తర్వాత అప్లికేషన్ ఫామ్ లో సూచించిన వివరాలను నమోదు చేయాలి. చివరగా అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
- Step 7: అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి.
0 Response to "NFL Recruitment "
Post a Comment