Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar Card: Let us know what to do with his Aadhaar card if the person dies.

 Aadhaar Card : వ్యక్తి మరణిస్తే అతని అధార్ కార్డును ఏంచేయాలో తెలుకుందాం.

Aadhaar Card: Let us know what to do with his Aadhaar card if the person dies.

Aadhaar Card : భారత ప్రభుత్వం దేశంలో నివశించే ప్రతి వ్యక్తి 12 అంకెల తోకూడిన విశిష్ట గుర్తిపు కార్డు అధార్ ను జారీ చేస్తుంది. ఇందులో ఆ వ్యక్తి యొక్క వేలిముద్రలు, వ్యక్తిగత వివరాలు పొందుపరచబడి ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్ధ… అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యకలాపాల నిర్వాహణకు అధార్ తప్పనిసరైంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఒక వ్యక్తి పై జారీచేయ బడ్డ అధార్ కార్డు.. అతను చనిపోయిన తరువాత ఏంచేయాలన్న దానిపైనే అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

మరణించిన వ్యక్తి యొక్క అధార్ కార్డు ను రద్దు చేసే నిర్ణయమేది ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకోలేదు. అలాగని మరణించిన వ్యక్తి అధార్ నెంబర్ ను వేరొకరికి కేటాయిస్తారా అంటే అది లేదు.

ఎందుకంటే ఆ నెంబర్ పై మరణించిన వ్యక్తి యొక్క వేలిముద్రలు , ఇతర సమాచరమంతా నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి అది సాధ్యమయ్యేపని కాదు. ఇదే విషయంపై కేంద్ర ఐటీ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభలో సమాధానమిచ్చారు. చనిపోయిన వ్యక్తి అధార్ కార్డును అధికారులకు అప్పగించేలా త్వరలో కొత్త నిబంధనలు తీసుకురానున్నట్లు చెప్పారు.

త్వరలో రానున్న కొత్త విధానం ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణిస్తే అతనికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం పొందెందుకు ధరఖాస్తు చేసే సమయంలో అతని యొక్క అధార్ కార్డును జనన,మరణాల శాఖ అధికారులకు అందించాల్సి ఉంటుంది. అనంతరం చనిపోయిన వ్యక్తి అధార్ ను యూఐడీఏఐ రద్దు చేయనుంది. ఈ కొత్త నిబంధనలు అమలు చేసే విధంగా త్వరలో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ యాక్ట్ 1969కి సవరణలు చేయనున్నారు.

ఇక చనిపోయిన వ్యక్తికి సంబంధించి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ , పాస్ పోర్టు వంటి ధ్రువపత్రాల విషయానికి వస్తే వాటికి ఇప్పటికే కొన్ని నిబంధనలు ఉన్నాయి. పాన్ కార్డు విషయానికి వస్తే ఒక వ్యక్తి మరణించిన పక్షంలో అతని పాన్ కార్డును ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో అప్పగించాలన్న నిబంధన ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు కు సంబంధించి అందులో నిర్ణీత కాల వ్యవధి వరకు మాత్రమే అవి ఫోర్సులో ఉంటాయి. తరువాత రెన్యువల్ చేయించుకోని పక్షంలో రద్ధై పోతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aadhaar Card: Let us know what to do with his Aadhaar card if the person dies."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0