Amma Vodi
Amma Vodi : అమ్మఒడి డబ్బులు .. ప్రభుత్వం కొత్త రూల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.15వేల వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండేళ్ల పాటు లక్షలాది మందికి ఈ పథకాన్ని అందించిన విషయం తెలిసిందే.
తాజాగా అమ్మఒడి పథకం కింద డబ్బులు రావాలంటే ప్రభుత్వం కొత్త షరతు పెట్టింది. అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు తప్పనిసరి చేసింది. నవంబర్ 8, 2021 నుంచి ఏప్రిల్ 30,2022 వరకు సుమారు 130 రోజులు విద్యా సంవత్సరం ఉంటుంది. ఇందులో 75శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకానికి అర్హులు అవుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా కరోనా ఉంది కాబట్టే ఈ నిబంధన అమలు చేయలేదని, ఇక నుంచి తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
2022 జనవరిలో అమలు చేయాల్సిన అమ్మఒడి పథకం జూన్ నెలలో అమలు చెయ్యాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పథకం వర్తిస్తుందని… ప్రచారం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి అమ్మ ఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమలు చేయనున్నారు. నాణ్యమైన ప్రమాణాలతో విద్య భోదిస్తున్న ఏపీ సర్కార్.. అందుకోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఇంత చేస్తున్నా.. విద్యార్థులను స్కూల్‌కి తీసుకురాకపోతే అనుకున్న మేర ఫలితాలు రావు. అందుకే ఏపీ సర్కార్ హాజరుతో అమ్మ ఒడిని ముడి పెట్టాలని నిర్ణయించింది.
.
0 Response to "Amma Vodi "
Post a Comment