Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Cabinet Highlights

 ముగిసిన AP కేబినెట్ సమావేశం.



కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన AP సర్కారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.

ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా, ఈ సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో సమావేశం కానున్నారు.



కేబినెట్‌ భేటీలో ఆమోదం తెలిపిన అంశాలు.

  • రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం
  • యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్‌
  • సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదలకు కేబినెట్‌ ఆమోదం.
  • 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం
  • అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • కొత్తగా జైన్‌ కార్పొరేషన్‌, సిక్కు కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం
  • వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
  • రాష్ట్రంలో 5చోట్ల సెవన్‌ స్టార్‌ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం
  • పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం
  • విశాఖలో తాజ్‌ వరుణ్‌ బీచ్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేబినెట్‌
  • జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు, అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు ఆమోదం
  • శ్రీశారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం
  • అమ్మఒడి పథకానికి అర్హత ఉన్న వారందరికీ జూన్‌, డిసెంబర్‌లో అర్జీకి అవకాశం కల్పిస్తాం. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Cabinet Highlights"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0