APPSC Job Notification .. 151 Job Replacement. How to apply
APPSC జాబ్ నోటిఫికేషన్.. 151 ఉద్యోగాల భర్తీ. అప్లయ్ చేసుకొనే విధానం.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుష్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయుర్వేదం, యూనాని, హోమియో విభాగాల్లో 151 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని శాఖల్లోనూ మెడికల్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అక్టోబర్ 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 25 దరఖాస్తులకు చివరితేది. ఈ పోస్టులకు రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ను చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 151
- మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) - 72
- మెడికల్ ఆఫీసర్ (యునానీ) - 26
- మెడికల్ ఆఫీసర్ (హోమియో) - 53
ముఖ్య సమాచారం
- విద్యార్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలను కోనే వారు ఆయుర్వేదం, యునానీ, హోమియోలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంవత్సరం పాటు ఇంటర్న్‌షిప్ చేయడంతోపాటు దరఖాస్తు చేస్తున్న విభాగంలో మెడికల్ ప్రాక్టీస్‌నర్‌గా రిజిస్టర్ అయి ఉండాలి.
- వయసు: అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి పోస్టింగ్ ఉంటుంది.
- రాత పరీక్ష విధానం:
- పేపర్ -1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ- 150 మార్కులు
- పేపర్-2: ఆయుర్వేదం లేదా యునానీ లేదా హోమియో- 150 మార్కులు
- పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతీ తప్పు ప్రశ్నకు 1/3 మార్కులు కోత విధిస్తారు.
- మొదట అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ను ఓపెన్ చేయాలి.
- గతంలో ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో రిజిస్టరై ఉంటే లాగినై సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
- ఏపీపీఎస్సీ పరీక్ష రాస్తే మీరు రిజిస్టర్ ఐడీ కోసం Login ఆప్షన్ లోకి వెళ్లి New User అని క్లిక్ చేసి సమాచారం అంతా నమోదు చేయాలి.
- అప్పుడు మీకు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఏర్పడతాయి.
- వాటి ద్వారా మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
0 Response to "APPSC Job Notification .. 151 Job Replacement. How to apply"
Post a Comment