Vaccine Certificate: How to verify the validity of the Kovid Vaccine Certificate? Description.
Vaccine Certificate : కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ నిజమైందా కాదా అని ఎలా ధ్రువీకరించాలి .. ? వివరణ.
వ్యాక్సినేషన్(Vaccination) కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తుండటంతో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోంది.
భారత్‌లో థర్డ్ వేవ్ ఊహాగానాల నడుమ టీకాల పంపిణీ వేగవంతమైంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కోవిన్, ఆరోగ్య సేతు ప్లాట్‌ఫాంలను అభివృద్ధి చేసింది. వీటి ద్వారా వ్యాక్సిన్ స్లాట్లను బుక్ చేసుకోవడంతో పాటు ప్రూఫ్ కోసం సర్టిఫికేట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భారత వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఈ రెండు ప్లాట్‌ఫాంలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే భారత్ సహా 29 దేశాల్లో నకిలీ వ్యాక్సినేషన్ రిపోర్టులు కలకలం సృష్టిస్తున్నాయి.
ఒక్కో నకిలీ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను రూ.6 వేల చొప్పున విక్రయిస్తున్నారని చెక్ పాయింట్ రిసెర్చ్ పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి.. పౌరుల సహాయార్థం వెబ్ పోర్టల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. ఇందులో భాగంగా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సర్టిఫికేట్ల ప్రామాణికతను ధ్రువీకరించుకోవచ్చు. ఇలాంటి పోర్టల్స్ ద్వారా భారత్‌లో స్మార్ట్ ఫోన్లు ఉన్న వినియోగదారులు ఈ పత్రాల వ్యాలిడిటీని చెక్ చేసుకోవచ్చు. వీటిని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం.
మొదటి దశ..
కోవిన్ అధికారిక వెబ్ సైట్‌కు వెళ్లి (cowin.gov.in) టాప్ రైట్ కార్నర్ లో ఉన్న 'ప్లాట్ ఫామ్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ 'వెరిఫై సర్టిఫికేట్స్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. లేదా వినియోగదారులు నేరుగా www.verify.cowin.gov.in ని సందర్శించవచ్చు.
రెండో దశ..
అక్కడ 'స్కాన్ క్యూఆర్' అనే ఆకుపచ్చ బటన్ పై క్లిక్ చేయాలి. ఇందుకోసం వినియోగదారులకు కెమెరా తప్పనిసరిగా అవసరమవుతుంది.
మూడో దశ..
ఆ బటన్ మీ కెమెరాను యాక్టివేట్ చేస్తుంది. అనంతరం మీ సర్టిఫికేట్ కింద కుడి వైపున ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.
నాలుగో దశ..
మీ సర్టిఫికేట్ ప్రామాణికమైనది అయితే స్క్రీన్ పై 'సర్టిఫికేట్ సక్సెస్ ఫుల్లీ వెరిఫైడ్' అని కనిపిస్తుంది. పేరు, వయస్సు, లింగం, సర్టిఫికేట్ ఐడీ, టీకా పేరు తదితర వ్యక్తిగత సమాచారాన్ని చూపిస్తుంది. ఒకవేళ సర్టిఫికేట్ నకిలీది అయితే 'సర్టిఫికేట్ ఇన్‌వ్యాలీడ్' అని కనిపిస్తుంది.
ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 85.42 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. రాష్ట్రాల వద్ద 4.57 కోట్ల డోసులు ఉపయోగించలేదని స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయిలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
0 Response to "Vaccine Certificate: How to verify the validity of the Kovid Vaccine Certificate? Description."
Post a Comment