How much of the retirement fund is needed.
పదవీ విరమణ నిధి ఎంత అవసరం.
రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్ధిక ఇబ్బందులు లేకుండా హాయిగా గడపడానికి తగినంత నగదు అవసరమే. 20, 25, 30 సంవత్సరాలలో భారీ మొత్తాన్ని పొందడానికి ఎంత ఆదా చేయాలి?
మీరు యువకుడిగా ఉన్నప్పుడు రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తే నెలవారీగా పొదుపు తక్కువ మొత్తమే అవసరం అవుతుంది. కానీ మీ రిటైర్మెంట్ కి రూ. 2 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే వార్షిక ద్రవ్యోల్బణం 5% అనుకుంటే అది 20 సంవత్సరాల తర్వాత రూ. 38 లక్షలు (ఇప్పటి విలువ పరంగా), 25 సంవత్సరాల తర్వాత రూ. 30 లక్షలుగా మాత్రమే అని గమనించాలి. అందుచేత ఈ మొత్తం సరిపోకపోవచ్చు.
అయితే పెట్టుబడులు పెట్టడానికి ఇతర ముఖ్యమైన సాధనాలలో ఈక్విటీలు కూడా ఉన్నాయి. ప్రస్తుత సమయంలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి అత్యంత ఆకర్షణీయమైన పొదుపుగా పరిగణిస్తున్నారు. ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి అధిక రాబడిని అందిస్తున్నాయని నిపుణుల అభిప్రాయం. రూ. 3 కోట్లు, రూ. 5 కోట్లు సృష్టించడం కోసం సరైన మొత్తాన్ని చేరుకోవడానికి మీకు సహాయపడే అనేక `కరోర్‌పతి కాలిక్యులేటర్లు` ఉన్నాయి. 20, 25, 30 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 12% వృద్ధి రేటు వద్ద రూ. 2.50 కోట్లు పొందడానికి ఎంత ఆదా చేయాలో క్రింద చూడవచ్చు.
20 సంవత్సరాల తర్వాత రూ. 2.50 కోట్లు పొందాలంటే.. నెలవారీ పొదుపు అవసరం రూ. 25,000
25 సంవత్సరాల తర్వాత రూ. 2.50 కోట్లు పొందాలంటే.. నెలవారీ పొదుపు అవసరం రూ. 13,250.
30 సంవత్సరాల తర్వాత రూ. 2.50 కోట్లు పొందాలంటే.. నెలవారీ పొదుపు అవసరం రూ. 7,125.
రూ. 25,000, రూ. 13,250, రూ. 7,125 నెలవారీ ఆదా చేయడం ద్వారా, ఒకరు 20, 25, 30 సంవత్సరాలలో దాదాపు రూ. 2.50 కోట్లు సృష్టించవచ్చు. అయితే, సగటు వార్షిక రాబడి 12 శాతంగా ఉంటుందని భావించండి. నేటికి రాబడి చూసినట్టైతే చాలా ఇండెక్స్ ఫండ్లు 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 14% రాబడిని ఇచ్చాయి. అయితే, పైన తెలిపినట్టుగా ద్రవ్యోల్బణం కారణంగా దీర్ఘకాలం లో రూ. 2.50 కోట్లు మీకు సరిపోకపోవచ్చు. కాబట్టి, మీరు మీ వీలు ప్రకారం పెట్టుబడి మొత్తాన్ని పెంచుతూ వెళ్లడం ముఖ్యం.
పదవీ విరమణ నిధి కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)ను ప్రారంభించి క్రమం తప్పకుండా పొదుపును చేయవచ్చు. స్టాక్ మార్కెట్ భారీ తేడాతో పడిపోయినపుడు, అదే మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో మరిన్ని పెట్టుబడులు పెట్టవచ్చు. దీని తో మీరు మరిన్ని యూనిట్స్ కొనుగోలు చేయవచ్చు. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా అవసరమైతే సిప్, ఏకమొత్తంగా పెట్టుబడిని ఉపయోగించండి. మీ పదవీ విరమణకు 3 సంవత్సరాల దూరంలో ఉన్నప్పుడు ఈక్విటీ ఫండ్‌ల నుండి పెట్టుబడి మెల్లగా వెనక్కి తీసుకోవడం మేలు.
0 Response to "How much of the retirement fund is needed."
Post a Comment