Shock to AP village and ward women police.
ఏపీ గ్రామ , వార్డు మహిళా పోలీసులకు షాక్ .ఏడాది , రెండేళ్లలో కాకుంటే ఉద్యోగం పోయినట్లే.
ప్రధానాంశాలు:
- ఏపీ మహిళా పోలీసులకు అలర్ట్
- డిపార్ట్‌మెంటల్ పరీక్ష పాస్ కావాలి
- లేకపోతే ఉద్యోగం ఊడిపోయినట్లే
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు అలర్ట్. ఏడాది, రెండేళ్లలోపు డిపార్ట్‌మెంటల్ పరీక్ష పాస్ కాకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు గెజిట్ జారీ చేసింది. డిపార్ట్‌మెంటల్ పరీక్షకు సంబంధించి ఒక ఏడాది ఫెయిలైనా కలెక్టర్ అనుమతిస్తే మరుసటి ఏడాది అవకాశం ఇస్తామన్నారు. అప్పుడు కూడా ఫెయిలైతే ఉద్యోగం ఊడినట్లేనని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసుల్ని హోంశాఖ పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 14,910 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల పోస్టులకు గాను ప్రస్తుతం 14,313 మంది ఉన్నారు. త్వరలోనే వీరికి రెండేళ్ల ప్రొబెషన్ సర్వీసు పూర్తి కానుంది. దీంతో వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. మహిళా పోలీస్‌గా పేర్కొంటూ కానిస్టేబుల్‌కు ఉండే అధికారాలు, బాధ్యతలు ప్రకటించారు. మహిళా పోలీసులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం మహిళా కానిస్టేబుళ్లు వినియోగిస్తున్న యూనిఫాంను వీరికి కూడా ఇస్తారు.
వివిధ చట్టాల ప్రకారం కానిస్టేబుళ్లకు ఉన్న అధికారాలు, బాధ్యతలు కూడా మహిళా పోలీసులకు కల్పిస్తారు. మహిళా పోలీసులు తమ గ్రామ, వార్డు సచివాలయానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. వీరికి పదోన్నతి కోసం అదనపు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను సృష్టిస్తారు. మహిళా పోలీసులుగా తగిన అధికారాలు, విధుల కల్పనకు చట్టంలో అవసరమైన మార్పులు చేస్తారు.
0 Response to "Shock to AP village and ward women police."
Post a Comment