Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Don’t trust teachers? Students dissatisfied with biometric

 టీచర్లపై నమ్మకం లేదా? విద్యార్థులకు బయోమెట్రిక్పై అసంతృప్తి.

Don’t trust teachers?  Students dissatisfied with biometric

  •  ఇప్పటికే ప్రక్రియల్లో హాజరు నమోదు
  • చాలదన్నట్టు బయోమెట్రిక్ పనీ అప్పగింత భారమేకాదు... ఇది టీచర్లను అనుమానించడమే
  • అమ్మఒడికి 75% హాజరుపై సర్కారు తీరు 

అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు తప్పనిసరి చేసిన ప్రభుత్వం... ఆ విషయంలో అనుసరిస్తున్న వైఖరి పట్ల ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవు తోంది. సాధారణంగా హాజరును ప్రతి తరగతిలోనూ ఉపాధ్యాయులు తీసుకుంటారు. హాజరుపట్టీల్లో తీసు కున్న హాజరును ఏరోజుకారోజు ప్రభుత్వం ఇచ్చిన యాప్లలో ఉపాధ్యాయులు అప్లోడ్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు బయోమెట్రిక్ పద్దతిలో విద్యార్థుల హాజరు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్త ర్వులిచ్చింది. కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని పేర్కొంది. బయోమెట్రిక్ యంత్రంలో వేలి ముద్ర వేసేందుకు...దాన్ని అప్లోడ్ చేసేందుకు ఒక యాప్ రూపొందించారు. ఉదయం రాగానే విద్యార్థులు ఈ యాప్లో వేలిముద్రలు వేసి హాజరైనట్లు నిర్ధారిం చాలి. అంటే హాజరుపట్టీలో హాజరు తీసుకోవడం, ఆ హాజరును ఇప్పటికే ఉన్న యాప్లో అప్లోడ్ చేస్తుండ ఇప్పుడు మళ్లీ బయోమెట్రిక్ పద్దతి పెట్టనున్నారు. ఒకరకంగా ఇది హాజరుపట్టీ ద్వారా హాజరు తీసుకుని, యాప్లో అప్లోడ్ చేస్తున్న తమను అవమానించడ మేనని కొందరు టీచర్లు వాపోతున్నారు. ఒక విద్యార్థికి మూడుసార్లు హాజరుతీసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

ఇప్పటికే ఉపాధ్యాయులకు యాప్లలో నమోదు వ్యవహారం కొంత ఇబ్బందిగానే మారింది. హాజరు అప్లోడ్, మధ్యాహ్న భోజన సమయంలో పదార్థాల అప్లోడ్, మరుగుదొడ్ల ఫొటోలు అప్లోడ్. ఇలా బోధనేతర పని చాలానే ఉంది. ఇప్పుడు మళ్లీ మూడోసారి బయోమెట్రిక్తో విద్యార్థుల హాజరు తీసు కోవడం ఒక అదనపు పనే. తాము హాజరుపట్టీ ద్వారా తీసుకున్న హాజరునే ప్రామాణికంగా తీసుకోవచ్చని, అదీ కాకుంటే తాము అప్లోడ్ చేస్తున్న హాజరు వివ రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయని.. వాటినైనా పరిగ ణనలోకి తీసుకోవచ్చని అంటున్నారు. మళ్లీ ఇప్పుడు ఏదో ఉద్యోగులకు పెట్టినట్లుగా విద్యార్థులకు బయోమె ట్రిక్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఈ పద్దతి పెట్టినా ఆమలుకాలేదని, ఇప్పుడు మళ్లీ అమలు చేస్తాననడంలో ఆంతర్యమేంటని అడుగుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Don’t trust teachers? Students dissatisfied with biometric"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0