Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

E-Vote

ఈ-ఓట్‌కు తొలి వేదిక ఖమ్మం

ప్రయోగాత్మక పరిశీలనకు ఎంపిక

E-Vote


  • రేపటి నుంచి 18 వరకు నమోదు... 20న ఓటింగ్‌
  • స్మార్ట్‌ఫోన్‌తో ఇంటి నుంచే ఓటు
  • ఈ-ఓట్‌కు తొలి వేదిక ఖమ్మం

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఇంటినుంచే ఓటు వేసే ఈ-ఓట్‌ విధానాన్ని తెలంగాణలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), రాష్ట్ర ఐటీ శాఖ లోని ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ విభాగం రూపొందించిన ఈ-ఓట్‌ విధానాన్ని ఖమ్మం జిల్లాలో పరిశీలించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ క్షేత్ర స్థాయిలో ఈ-ఓట్‌ విధానం అమలు ఎలా జరుగుతుందో గుర్తించనున్నారు. ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు  ఈ-ఓట్‌ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదివేల మంది ఓటు వేయవచ్చు. ఈ నెల 20న  ఓటింగ్‌ నిర్వహిస్తారు.

అత్యాధునిక సాంకేతికత

ఈ ఓట్‌లో పాల్గొనాలంటే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో గిళీనిది ’జ్న్ము’  యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 15-20 ఏళ్ల క్రితం దిగిన ఫొటోను కూడా సరిపోల్చగలిగేలా ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. యాప్‌లో వివరాలు తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటాయి. ఎలా నమోదు చేసుకోవాలి? ఓటు ఎలా వేయాలి? అని తెలుసుకునేలా వీడియోలను అందుబాటులో ఉంచారు.

సమస్యల పరిష్కారానికి సాంకేతికతతో పరిష్కారం: జయేశ్‌రంజన్‌

రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ-ఓట్‌పై చూపిన చొరవకు ఐటీ శాఖ తోడ్పాటును ఇవ్వడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని సమస్యలకు పరిష్కారాన్ని సూచించడానికి ఇది ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ఐటీ విభాగానికి చెందిన సీ-డాక్‌, ఐఐటీ భిలాయ్‌ డైరెక్టర్‌ రజత్‌మోనా, ముంబయి, దిల్లీ ఐఐటీలు తోడ్పాటు అందించినట్లు పేర్కొన్నారు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "E-Vote"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0