Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IIT education with Dharana degree Jam-2022 Announcement

ధారణ డిగ్రీతో ఐఐటీ విద్య

జామ్‌-2022 ప్రకటన

IIT education with Dharana degree   Jam-2022 Announcement

ఐఐటీల్లో చదవాలనేది ఎందరో విద్యార్థుల కల. ఆ అవకాశం ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు కొద్ది మందికి వస్తుంది. మరి మిగిలినవాళ్లు ఐఐటీ మెట్లు ఎక్కాలంటే? అందుకు జామ్‌ దారి చూపుతుంది. సాధారణ డిగ్రీతో ఐఐటీల్లో చదువుకునే అవకాశం దీంతో లభిస్తుంది. దాదాపు ఐఐటీలన్నీ సైన్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్‌ విభాగాల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులు అందిస్తున్నాయి. జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌)తో అవకాశం కల్పిస్తున్నాయి. ఐఐటీలే కాకుండా ఐఐఎస్సీ, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో ఉన్నత విద్య, 

పరిశోధనలకు ఈ స్కోరు ఉపయోగపడుతుంది. వచ్చే విద్యా సంవత్సరంలో కోర్సుల్లో ప్రవేశానికి జామ్‌ ప్రకటన వెలువడింది!

జామ్‌ను 7 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు. అవి బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమేటిక్స్, మ్యాథమేటికల్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌. జామ్‌-2022 పరీక్షలు రవుర్కెలా ఐఐటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. రాతపరీక్షలో ప్రతిభ చూపినవారు ఏడు సబ్జెక్టులకు చెందిన వివిధ స్పెషలైజేషన్లతో కోర్సులు ఎంచుకోవచ్చు. 

పరీక్ష నిమిత్తం అభ్యర్థులు ఒకటి లేదా గరిష్ఠంగా రెండు సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. సెషన్‌-1లో ఒకటి, సెషన్‌-2లో మరొక సబ్జెక్టులో పరీక్ష రాసుకోవచ్చు. సెషన్‌ -1లో బయోటెక్నాలజీ, మ్యాథమేటికల్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. రెండో సెషన్‌లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమేటిక్స్, ఎకనామిక్స్‌ సబ్జెక్టుల్లో పరీక్షలు ఉంటాయి. 

జామ్‌ స్కోరుతో 20 ఐఐటీలతోపాటు, ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఎన్‌ఐటీలు, ఇతర సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఇవన్నీ మేటి విద్యా సంస్థలే. అందువల్ల ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్నవారు మెరుగైన అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. పరిశోధనల దిశగా అడుగేయాలనుకున్నవారికీ జామ్‌ చక్కని అవకాశం. ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులే ఉన్నాయి. వీటికి జామ్‌తోపాటు ఇంటర్వ్యూ అదనం.

అర్హత

కొవిడ్‌ నేపథ్యంలో జామ్‌-2022 అర్హత నిబంధనలు సడలించారు. సంబంధిత డిగ్రీలో సాధారణ ఉత్తీర్ణత సరిపోతుంది. (గత ఏడాది దాకా ఐఐటీల్లో ప్రవేశం కోరేవారు డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 50 శాతం అవసరం. అదే ఐఐఎస్సీ, బెంగళూరులో ప్రవేశాలకు 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం ఉండాలి). దాదాపు అన్ని సంస్థలూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్సులను ఎమ్మెస్సీలో భాగంగా అందిస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎస్సీలో కెమిస్ట్రీ కోర్సులకు డిగ్రీలో కెమిస్ట్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ తప్పనిసరిగా చదివుండాలి. ఐఐటీ ఇండోర్, రవుర్కెలాకు మాత్రం డిగ్రీలో కెమిస్ట్రీ చదివితే సరిపోతుంది. ఐఐటీ గాంధీనగర్‌కు ఎలాంటి నిబంధనలూ లేవు. మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ పీజీ కోర్సులకు డిగ్రీ స్థాయిలో ఆ సబ్జెక్టులు చదవడం తప్పనిసరి. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ ఐఐటీ- బాంబే, ఇండోర్‌ అందిస్తున్నాయి. వీటికోసం గ్రాడ్యుయేట్లు ఎవరైనా పోటీ పడవచ్చు. ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సును ఐఐటీ దిల్లీ, రవుర్కెలా అందిస్తున్నాయి. దిల్లీలో ఈ కోర్సులో చేరడానికి బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్‌ విద్యార్థులు పోటీ పడవచ్చు. రవుర్కెలాలో అయితే డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. ప్రస్తుతం డిగ్రీ ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు జామ్‌ రాసుకోవచ్చు.

రాతపరీక్ష ఎలా ఉంటుంది

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. వ్యవధి 3 గంటలు. ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఏ సబ్జెక్టు ప్రశ్నపత్రంలోనైనా మొత్తం ఆబ్జెక్టివ్‌ 60 ప్రశ్నలు ఉంటాయి. వీటికి వంద మార్కులు. మూడు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. అవి.. మల్టిపుల్‌ ఛాయిస్, మల్టిపుల్‌ సెలెక్ట్, న్యూమరికల్‌ సమాధాన ప్రశ్నలు. వీటిని ఏ బీ సీ సెక్షన్లగా విభజించారు.

సెక్షన్‌-ఎ

ఇందులో మొత్తం 30 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఒక మార్కు ప్రశ్నలు పది, రెండు మార్కుల ప్రశ్నలు ఇరవై వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. వీటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఒక మార్కు ప్రశ్నకు 1/3, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 మార్కులు తగ్గిస్తారు. 

సెక్షన్‌-బి

ఇందులో పది మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. నాలుగు ఆప్షన్లు ఇస్తారు. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలుగా ఉండవచ్చు. సరైన ఆప్షన్‌/ ఆప్షన్లను గుర్తిస్తేనే పూర్తి మార్కులు వస్తాయి. పాక్షిక సమాధానానికి మార్కులు కేటాయించరు. రుణాత్మక మార్కులు లేవు.

సెక్షన్‌-సి 

ఇందులో 20 న్యూమరికల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు వస్తాయి. వీటికి వాస్తవ సంఖ్య సమాధానంగా ఉంటుంది. ఈ ప్రశ్నలకు ఆప్షన్లు ఉండవు. ఒక మార్కు ప్రశ్నలు పది, రెండు మార్కుల ప్రశ్నలు పది వస్తాయి. రుణాత్మక మార్కులు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IIT education with Dharana degree Jam-2022 Announcement"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0