Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Finance: Which of PPF, LD and Sukanya Samridhi Yojana schemes is the best?

 Finance : పీపీఎఫ్ , ఎల్డీ , సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో ఏది బెస్ట్ .

Finance: Which of PPF, LD and Sukanya Samridhi Yojana schemes is the best?

చాలామంది ప్రజలు భవిష్యత్తులో తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటారు. డబ్బును రెట్టింపు చేయడానికి ప్రస్తుతం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాల్లో ఇన్వెస్ట్ చేసే మంచి రాబడి పొందొచ్చు. అయితే పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్న ప్రతిసారీ.. డబ్బు ఎంత త్వరగా రెట్టింపవుతుంది? అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. ఇది తెలుసుకోవడానికి ఒక సింపుల్ రూల్ ఉంది. రూల్ ఆఫ్ 72 (Rule of 72) మీ డబ్బు ఎంత త్వరగా రెట్టింపు అవుతుందో చెబుతోంది. డబ్బు రెట్టింపయ్యే కాలం తెలుసుకోవడం కంటే ముందుగా మీ లక్ష్యాలు, పెట్టుబడి వ్యవధిని నిర్ణయించడం చాలా ముఖ్యం. ఈ పెట్టుబడులు ఎంత వేగంగా డబ్బును రెట్టింపు చేస్తాయో తెలుసుకోవడానికి ఇప్పుడు 'రూల్ ఆఫ్ 72' ని ఉపయోగిద్దాం.


రూల్ ఆఫ్ 72 అంటే?

రూల్ 72 అనేది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాలో '72' అనే సంఖ్యను పెట్టుబడి పథకం అందించే వడ్డీ రేటుతో విభజిస్తారు. తద్వారా పెట్టుబడి డబ్బు ఎంత త్వరగా రెట్టింపు అవుతుందో తెలుసుకోవచ్చు. మీరు ఒక పథకం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ పెట్టుబడి డబ్బు ఆర్జించే రాబడి లెక్కపెట్టవచ్చు.

రూల్ ఆఫ్​ 72 ఫార్ములా

మీ డబ్బును రెట్టింపు చేయడానికి అవసరమైన సంవత్సరాల సంఖ్య = 72/రిటర్న్ రేట్. ఇక్కడ రిటర్న్ రేట్ అంటే ఇంటరెస్ట్ రేట్ అని అర్థం
పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుంది?

1. బ్యాంక్ ఎఫ్‌డీ

ప్రస్తుతం బ్యాంక్ ఎఫ్‌డీలు పెట్టుబడిదారులకు దాదాపు 5.5% వడ్డీని అందిస్తున్నాయి. ఈ రేటు ప్రకారం మీ డబ్బు రెట్టింపు కావడానికి పైన పేర్కొన్న ఫార్ములా ఉపయోగిస్తే.. 72/5.5 = 13.09గా వస్తుంది. అంటే మీరు ఎఫ్‌డీలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే అది రూ.2 లక్షలు కావడానికి 13 సంవత్సరాలు పడుతుందన్న మాట.

2. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)

పీఎఫ్ లో చాలామంది డబ్బులు పెట్టుబడి పెడుతుంటారు. ప్రస్తుతం పీఎఫ్‌ పెట్టుబడులపై 7.1% వార్షిక వడ్డీ రేటు లభిస్తోంది. భవిష్యత్తులో పీపీఎఫ్‌ వడ్డీ రేటు మారదు అని అనుకుంటే.. ఫార్ములా ప్రకారం మీ డబ్బు రెట్టింపు కావడానికి 72/7.1 = 10.14 ఏళ్లు పడుతుంది. అంటే పీఎఫ్ లో మీ డబ్బు రెట్టింపు కావడానికి దాదాపు పదేళ్ల సమయం పడుతుందని గమనించాలి.

3. సుకన్య సమృద్ధి యోజన(SSY)

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ప్రస్తుతం 7.6% గా ఉంది. ఫార్ములా ప్రకారం ఈ వడ్డీరేటును 72 తో భాగిస్తే.. 9.47 సంఖ్య వస్తుంది. ఇది డబ్బు రెట్టింపు కాలాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో ఈ వడ్డీ రేటు మారదని అనుకుంటే.. మీ డబ్బు రెట్టింపు కావడానికి 9 ఏళ్లకు పైగా సమయం పడుతుంది.

ఆర్థిక అంచనాలు, కాంపౌండ్ వడ్డీ(compound interest) స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి రూల్ 72 ని ఆర్థిక నిపుణులు ఉపయోగిస్తుంటారు. పీపీఎఫ్, ఎస్‌ఎస్‌వై, ఇతర పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలపై ప్రభుత్వం అందించే వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికానికి స్వల్పంగా మారుతుంటాయి. అయితే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వడ్డీరేట్లను ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. ప్రభుత్వం వరుసగా ఆరవ త్రైమాసికానికి కూడా వడ్డీరేట్లను మార్చకపోవడం విశేషం. భవిష్యత్తులో ఈ వడ్డీ రేట్లు మారినా.. స్వల్పంగానే మారుతాయి. కాబట్టి రూల్ 72 ఫార్ములాతో మీ డబ్బు రెట్టింపు కాలాన్ని దాదాపు కచ్చితంగా తెలుసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Finance: Which of PPF, LD and Sukanya Samridhi Yojana schemes is the best?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0