Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Instructions for conducting structured evaluation.

నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహణకై సూచనలు.


నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహణకై సూచనలు.

ప్రభుత్వం సరఫరా చేసిన పాఠశాల సంసిద్ధత/వర్క్ షీట్స్ పై లేదా సంబంధిత సబ్జెక్టు లోని మొదటి పాఠం/చాప్టర్ లో FA 1 నిర్వహించాలి.

FA 1 కి సంబంధించి ముద్రించబడిన/ఉమ్మడి ప్రశ్నపత్రాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించరాదు.

ప్రాధమిక తరగతులకు కూడా FA 1 తప్పనిసరిగా నిర్వహించాలి. దీని కొరకు SCERT వారు విడిగా మార్గదర్శకాలను విడుదల చేస్తారు.

FA పత్రాలను సరిదిద్దున్నపుడే ఉపాధ్యాయులు...చదువులో వెనుకబడిన విద్యార్థులను విషయం/తరగతి వారీగా గుర్తించి వారి నివారణ బోధనకై ప్రణాళిక చేయాలి.

ఉపాధ్యాయుల సౌకర్యం మేరకు...చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఉదయం 8 గం నుండి 9 గం వరకు మరియు సాయంత్రం 4గం నుండి 6గం వరకు లేదా ఆదివారాలలో నివారణ బోధన నిర్వహించవలెను.

నివారణ బోధన(Remidial టీచింగ్)లో భాగం గా FA 1 లో తక్కువ పెర్ఫార్మెన్స్ చూపిన విద్యార్థులకు... రాసిన  FA 1 ప్రశ్నాపత్రాలనే మరొకసారి ఇచ్చి  సహచర బృందం/పాఠ్యపుస్తకాల సహాయంతో వానికి జవాబులు రాయమని సూచించాలి.

ఎట్టి పరిస్థితులలోనూ గైడ్ లు/ క్వశ్చన్ బ్యాంక్ ల ఆధారంగా ప్రశ్నపత్రాలను రూపొందించరాదు.ఒకవేళ అట్లు రూపొందించినట్లు సంచాలకులు, పాఠశాల విద్య వారి దృష్టికి వచ్చిన యెడల సంబంధితులపై కఠిన చర్యలు తీసుకొనబడును.

 ఒక వినూత్న కార్యక్రమం గా భావించి FA నిర్వహణ కొరకు ఇన్విజిలేటర్ లుగా పనిచేసేందుకు మరియు జవాబు పత్రాలను బాహ్య మూల్యాంకనం చేసేందుకు ఇతర పాఠశాలలనుండి ఉపాధ్యాయులను స్వచ్ఛందంగా  హాజరవ్వాలి. ఏదైనా ఒక స్కూల్ కాంప్లెక్స్ తన పరిధి లోని పాఠశాలల్లో ఒకరోజు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ స్వచ్ఛందంగా నిర్వహిస్తే బావుంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Instructions for conducting structured evaluation."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0