Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IBPS PO Notification 2021 Released for 4135 Posts, How to Apply

 IBPS Recruitment 2021: పీఓ పోస్టులకు అప్లయ్ చేయండి..జీతం 65వేలు.!

IBPS PO Notification 2021 Released for 4135 Posts, How to Apply

ప్రముఖ బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలెక్షన్‌ (ఐబీపీఎస్) దేశవ్యాప్తంగా పలు జాతీయ బ్యాంకుల్లో ప్రొబేషనరీ లేదా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 4135 పీఓ/ఎంటీ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 11 బ్యాంకులు ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటున్నాయి. వేతనం విషయానికొస్తే ఎంపికైప అభ్యర్థులకు నెలకు రూ. 55000/- నుంచి రూ.65000/- వరకు ఉంటుంది. ఈ ఉద్యోగాలన్నీ శాశ్వత ప్రాతిపదికనే భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.

ఇక ఐబీపీఎస్ చేపట్టనున్న పీఓ/ఎంటీ అర్హతలను పేర్కొంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉండాలి. ఇక అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్లు ఉండాలి. అది కూడా 2021 అక్టోబర్ 1 నాటికి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక ఏ బ్యాంకుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

IBPS Recruitment 2021: Vacancy details

  • బ్యాంక్ ఆఫ్ ఇండియా -588
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - 400
  • కెనరా బ్యాంక్ - 650
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 620
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 98
  • పంజాబ్ & సింద్ బ్యాంక్ -427
  • యూకో బ్యాంక్ - 440
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 912

ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లకు సంబంధించి ఖాళీల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పోస్టుల వివరాలు కూడా వెల్లడైతే పోస్టుల సంఖ్య మరింత పెరుగుతాయి.

సంస్థ పేరు:ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలెక్షన్‌ (ఐబీపీఎస్ )

పోస్టు పేరు: పీఓ/ఎంటీ

పోస్టుల సంఖ్య: 4135

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 10.11.2021

ఆన్‌లైన్ ద్వారా ప్రిలిమినరీ పరీక్ష - 4 డిసెంబర్ నుంచి 11 డిసెంబర్ 2021 వరకు జరిగే అవకాశాలున్నాయి.

IBPS నియామకం 2021: పత్రాలు అవసరం

  • ఫోటోగ్రాఫ్
  • సంతకం
  • ఎడమ బొటనవేలు ముద్ర
  • చేతితో వ్రాసిన ప్రకటన

అర్హత

వయస్సు:

  • అక్టోబర్ 1, 2021 నాటికి అభ్యర్థి కనీసం 20 సంవత్సరాలు మరియు 30 సంవత్సరాల కంటే పాతవారు కాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు గరిష్ట పరిమితి సడలిస్తారు.

అర్హత:

  • ప్రభుత్వం గుర్తించిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ. 
  • భారతదేశంలో లేదా ఏదైనా సమానమైన అర్హత.

అప్లికేషన్ ఫీజు

  • అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ .850 చెల్లించాలి. 
  • SC, ST మరియు PwBD వర్గాలకు చెందిన వారు రూ .175 చెల్లించాలి.

 దరఖాస్తు ఎలా చేయాలి

  • దశ 1: అధికారిక వెబ్‌సైట్ - ibps.in ని సందర్శించండి
  • దశ 2: ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
  • దశ 3: మీ వివరాలతో నమోదు చేసుకోండి
  • దశ 4: దరఖాస్తు ఫారమ్ నింపండి
  • దశ 5: ఫీజు చెల్లించండి మరియు సమర్పించు నొక్కండి


సైట్: https://ibps.in/


 NOTIFICATION


NOTIFICATION DETAILS IN ENGLISH CLICK HERE







SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IBPS PO Notification 2021 Released for 4135 Posts, How to Apply"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0