Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PM Kisan Samman Nidhi Yojana

 PM Kisan : రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ .. ఆ నెలలోనే పీఎం కిసాన్ 10 వ విడత డబ్బులు విడుదల .. స్టేటస్ ఇలా చెక్ చేసుకోగలరు.

PM Kisan Samman Nidhi Yojana


వ్యవసాయం చేసే అన్నదాతలకు తీపికబురు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM Kisan) (పీఎం కిసాన్‌) కింద పదో విడత పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఒక తేదీని నిర్ణయించింది.

డిసెంబర్ (December) ద్వితీయార్థం నాటికి పదో విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మునుపటి విడతలో డబ్బులు పొందని రైతులు (Farmers) ప్రస్తుత విడతతో పాటు ఆ డబ్బులు కూడా అందుకునే అవకాశం ఉంది. అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న రైతులు మాత్రమే ఈ స్కీం కింద డబ్బులు పొందడానికి అర్హులు.

ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన ఈ పథకం కింద రైతులు ప్రతి త్రైమాసికానికి రూ. 2వేల చొప్పున ఏడాదికి రూ.6000 పెట్టుబడి సాయాన్ని అందుకుంటున్నారు. అయితే ఈ పెట్టుబడి సాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీన్నిబట్టి భవిష్యత్తులో రైతులు మూడు త్రైమాసిక వాయిదాలలో రూ.4వేల చొప్పున ఏడాదికి రూ. 12,000 పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.

రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 కాగా ఈ తేదీకి ముందు ఆమోదం పొందిన దరఖాస్తుదారులు డబ్బులు అందుకుంటారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. సాగుభూమి ఉన్న రైతుల కుటుంబాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు.

పీఎం కిసాన్‌ (PM-KISAN) లబ్ధిదారుల లింక్ రిలీజ్ అయ్యాక ఆన్‌లైన్‌లోనే బెనిఫిషరీ స్టేటస్ (beneficiary status) వివరాలను చెక్ చేయవచ్చు. మీరు ఇప్పటికే పదో వాయిదా డబ్బుల కోసం నమోదు చేసుకున్నట్లయితే.. మీరు వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీ స్టేటస్ చెక్ చేయవచ్చు.

పీఎం-కిసాన్‌ స్కీమ్ బెనిఫిషరీ స్టేటస్ ని ఎలా చెక్ చేయాలి?

  • స్టెప్ 1: అధికారిక పీఎం కిసాన్ యోజన వెబ్‌సైట్ (pmkisan.gov.in) ని విజిట్ చేయండి.
  • స్టెప్ 2: వెబ్‌సైట్ హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత.. కుడివైపు కనిపించే 'ఫార్మర్స్ కార్నర్ (Farmers Corner)' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో 'బెనిఫిషరీ స్టేటస్ (Beneficiary Status)' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 4: తర్వాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీకు ఆధార్/అకౌంట్/ మొబైల్ నంబర్‌ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ మూడింటిలో ఏదో ఒక నంబర్‌ను సెలెక్ట్ చేయండి. ఉదాహరణకి మీరు ఆధార్ నంబర్‌ సెలెక్ట్ చేసుకుంటే.. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయండి.
  • స్టెప్ 5: మీ స్టేటస్ తెలుసుకోవడానికి "గెట్ డేటా(Get Data)" పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ ఖాతాలో చివరిసారిగా ఎప్పుడు.. ఏ బ్యాంకు ఖాతాకు డబ్బు జమ అయిందనే విషయాలు తెలుసుకోవచ్చు. మీరు 9వ, 8వ వాయిదాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు చూడొచ్చు. అలాగే పీఎం కిసాన్ కింద మీరు చేసిన అన్ని లావాదేవీల సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. 'FTO ఇస్ జనరేటెడ్ అండ్ పేమెంట్ కన్ఫర్మేషన్ ఇస్ పెండింగ్‌' అని మీరు కనిపిస్తే, మీకు రావాల్సిన మొత్తం మీ ఖాతాకి బదిలీ అయ్యే ప్రక్రియలో ఉందని అర్థం చేసుకోవాలి.
ఈ పథకం లబ్ధి పొందాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కార్డు, వ్యవసాయ భూమి పత్రాలు, వ్యవసాయ సమాచారానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో అవసరమవుతాయి.

ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం.

  • స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని ఓపెన్ చేయండి.
  • స్టెప్ 2: న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ (New Farmer Registration) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  • స్టెప్ 4: క్యాప్చా వెరిఫికేషన్ పూర్తి చేయండి.
  • స్టెప్ 5: పొలం, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించి మీ ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "PM Kisan Samman Nidhi Yojana"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0