Key changes from 2021-22 to apply on the NSP portal for the NMMS Scholarship.
NMMS స్కాలర్షిప్ కోసం NSP పోర్టల్ లో అప్లై చేసుకునేందుకు 2021-22 నుండి వచ్చిన కీలకమైన మార్పులు.
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు విద్యార్థి వివరములు నమోదు చేసుకొనే సమయంలో గమనించవలసిన ముఖ్య విషయములు
- 1. విద్యార్ధి యొక్క ఆధార్ వివరములను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయవలెను .
- 2. స్కీమ్ “ NATIONAL MEANS CUM MERIT SCHOLARSHIP SCHEME " ను జాగ్రత్తగా గమనించుకొనవలెను .
- 3. స్కీమ్ ను మార్చుకొనుట ఏ విధంగానూ వీలుకాదు కాబట్టి స్కీమ్ తప్పుగా ఉన్నట్లు గమనించిన వెంటనే అటువంటి అప్లికేషన్ ను విత్ డ్రా చేసుకుని మరలా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి తద్వారా వచ్చిన అప్లికేషన్ నెంబర్ ను ఉపయోగించి లాగిన్ అయ్యి అప్లికేషన్ ను జాగ్రత్తగా స చేయవలెను .
- 4. అప్లికేషన్ సబ్మిట్ చేయుటకు ముందు ప్రతీ వివరమును జాగ్రత్త గా పరిశీలించి అన్ని వివరములు సరిగా ఉన్న యెడల మాత్రమే ఫైనల్ గా సబ్మిట్ చేయవలెను
- 5. విద్యార్ధి పేరు , పుట్టిన తేదీ మరియు విద్యార్ధి తండ్రి పేరు తప్పకుండా ఆధార్ కార్డ్ , మెరిట్ కార్డ్ మరియు బ్యాంక్ పాస్ బుక్ ల యందు ఖచ్చితముగా ఒకే విధముగా ఉండవలెను . ఒక్క అక్షరం తేడా ఉన్నప్పటికినీ పోర్టల్ నందు అంగీకరింపబడదు .
- 6. ఆధార్ కార్డ్ పైన విద్యార్ధి యొక్క పుట్టిన తేదీ పూర్తిగా ( DD / MM / YYYY ) ముద్రించి ఉండవలెను . పుట్టిన సంవత్సరము మాత్రమే ఉన్నచో వెంటనే ఆధార్ కార్డ్ నందు పూర్తి పుట్టిన తేదీని నమోదు చేయించుకొనవలెను .
- 7. ఒకసారి పోర్టల్ లో నమోదు చేసిన బ్యాంక్ అకౌంటు నంబరును మార్చుకునే సౌలభ్యం లేని కారణమున అదే బ్యాంక్ అకౌంటు పని చేసే విధంగా చూసుకొనవలెను .
- 8. విద్యార్ధి యొక్క అప్లికేషన్ ను సంబంధిత పాఠశాల యొక్క నోడల్ ఆఫీసర్ ( INO ) లాగిన్ ద్వారా వెరిఫై చేయవలెను . అదే విధంగా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి నోడల్ ఆఫీసర్ ( NO ) లాగిన్ ద్వారా వారిపై చేయవలెను . అప్పుడు మాత్రమే విద్యార్ధి యొక్క వివరములు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చేరి సంబంధిత విద్యార్థికి స్కాలర్షిప్ మంజూరు చేయబడుతుంది .
- 9. ప్రతీ పాఠశాల ఖచ్చితంగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు పాఠశాల నోడల్ ఆఫీసర్ యొక్క ఆధార్ వివరములను నమోదు చేయడం ద్వారా స్కూల్ KYC పూర్తి చేసుకొనవలెను .
- 10. పాఠశాల ప్రధానోపాధ్యాయుని లాగిన్ ( HM Login ) ద్వారా సంబంధిత విద్యార్ధుల వివరములు అన్నీ నమోదు అయినవో లేదో గమనించి ఈ సంవత్సరం నవంబరు 15 లోపు ప్రతి విద్యార్ధి వివరములూ తప్పకుండా నమోదు కాబడి పాఠశాల నోడల్ ఆఫీసర్ ( INO ) మరియు జిల్లా నోడల్ ఆఫీసర్ ( DNO ) లచే తమ విద్యార్ధుల అప్లికేషన్లు వెరిఫై కాబడునట్లు జాగ్రత్త తీసుకొనవలెను .
0 Response to "Key changes from 2021-22 to apply on the NSP portal for the NMMS Scholarship."
Post a Comment