Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Post Office Scheme

 Post Office Scheme: రూ.50 వేలు డిపాజిట్ చేస్తే రూ.3,300 పెన్షన్. పోస్టాఫీస్ పథకం ప్రయోజనాలివే.

Post Office Scheme

కష్టపడి సంపాదించిన సొమ్మును ఎందులోనైనా మదుపు చేయాలనుకుంటే.. పెట్టుబడిదారులు ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి సెక్యూరిటీ, రెండు రాబడి. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపుతారు. ఈ విషయంలో పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలు వినియోగదారులకు గట్టి హామీ ఇస్తున్నాయి. ఇలాంటి వాటిలో విజయవంతమైన ఎంఐఎస్ స్కీమ్ (Monthly Income Scheme) మెరుగైన రాబడిని అందిస్తుంది. ఈ పథకంలో ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతి నెలా పెన్షన్ మాదిరిగా వడ్డీని పొందవచ్చు. కాలపరిమితి పూర్తయిన తర్వాత మదుపు చేసిన మొత్తాన్ని కూడా రాబడిగా పొందవచ్చు.

పోస్టాఫీస్ ఎంఐఎస్ స్కీమ్‌లో(Post Office MIS Scheme) ప్రస్తుతం ఏడాదికి వడ్డీ 6.6 శాతం లభిస్తుంది. ఒక ఖాతాలో గరిష్ఠంగా 4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకు పరిమితి ఉంటుంది. ఈ ప్లాన్ కాలపరిమితి 5 సంవత్సరాలుగా ఉంది.

ఈ పథకానికి అర్హత.

మేజర్ అయిన ప్రతి భారతీయుడు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. లబ్ధిదారులు మైనర్లు అయితే, 10 ఏళ్ల పైబడినవారై ఉండాలి. ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పోస్టాఫీస్ ఎంఐసీ డిపాజిట్ స్కీమ్‌లో కనీసం రూ.1000తో అకౌంట్ తెరవవచ్చు. గరిష్ఠంగా ఖాతాలో 4.5 లక్షలు, జాయింట్ ఖాతా అయితే రూ.9 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్లో పెట్టుబడిదారులందరూ సమాన వాటాను కలిగి ఉంటారు. ఓ వ్యక్తి ప్రారంభించిన అన్ని ఎంఐఎస్ ఖాతాల్లో డిపాజిట్లు లేదా షేర్లు రూ.4.5 లక్షలకు మించకూడదు.

ఎంఐఎస్ క్యాలిక్యులేటర్.

ఈ పథకంలో భాగంగా ఎవరైనా అకౌంట్‌లో ఒకసారి రూ.50 వేలు డిపాజిట్ చేస్తే.. 5 సంవత్సరాల వరకు నెలకు రూ.275 లేదా ఏడాదికి రూ.3300 పొందుతారు. ఐదేళ్లలో మొత్తం వడ్డీ రూ.16,500 వస్తుంది. ఎవరైనా రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.550, ఏడాదికి 6600 చొప్పున ఐదేళ్ల వరకు రూ. 33,000 పొందుతారు. రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.2475 చొప్పున సంవత్సరానికి రూ.27,700 వస్తుంది. ఐదేళ్లలో ఈ వడ్డీ రూ.1,48,500 వరకు ఉంటుంది.

ఎంఐఎస్ వడ్డీ.

అకౌంట్ ఓపెనింగ్ తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తరువాత వడ్డీ చెల్లిస్తారు. మెచూరిటీ పూర్తయ్యే వరకు ఈ వడ్డీ చెల్లిస్తారు. ప్రతి నెలా చెల్లించాల్సిన వడ్డీని ఖాతాదారుడు క్లెయిమ్ చేయకపోతే, ఆ మొత్తంపై అదనపు వడ్డీ లభించదు. డిపాజిటర్ ఏదైనా అదనపు డిపాజిట్ చేసినట్లయితే దాన్ని రిఫండ్ చేస్తారు. ఖాతా తెరిచినప్పటి నుంచి రిఫండ్ తేదీ వరకు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీని మాత్రమే పొందుతారు. వడ్డీని ఆటో క్రెడిట్ ద్వారా అదే పోస్టాఫీస్ లేదా ఈసీఎస్‌లో ఉన్న సేవింగ్స్ ఖాతాలోకి తీసుకోవచ్చు. డిపాజిటర్ వద్ద ఉన్న వడ్డీపై పన్ను ఉంటుంది.

పోస్టాఫీస్ ఎంఐఎస్ అకౌంట్లో ప్రీమెచ్యూర్ క్లాజ్

డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం గడువు ముగిసేలోపు ఎలాంటి డిపాజిట్ ఉపసంహరించుకోలేరు. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత, 3 ఏళ్ల ముందు ఖాతా మూసివేసినట్లయితే ప్రిన్సిపల్ మొత్తం నుంచి 2 శాతానికి సమానమైన తగ్గింపును మినహాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 3 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల లోపు ఖాతా మూసివేసినట్లయితే.. 1 శాతానికి సమానమైన తగ్గింపును మినహాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు.

సంబంధిత పోస్టాఫీసులో పాస్ బుక్ తో నిర్దేశించిన దరఖాస్తు ఫారమ్ ను సమర్పించడం ద్వారా అకౌంట్ మూసివేయవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Post Office Scheme"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0