Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Recruitment 2021

 APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉద్యోగాలు. దరఖాస్తు చేసుకొనే విధానం.

APPSC Recruitment 2021:

APPSC Recruitment 2021  ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC). ఏపీ శాసనసభలో ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పలు ఖాళీల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది.  అక్టోబర్ 18న ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సర్వీస్‌లో తెలుగు రిపోర్టర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 8 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోగలరు.


APPSC Recruitment 2021: నోటిఫికేషన్

మొత్తం ఖాళీలు : 05

దరఖాస్తు ప్రారంభం :      18.10.2021
దరఖాస్తుకు చివరి తేదీ  : 08.11.2021

విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి.

వయస్సు- 2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌ రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.

ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

వేతనం- రూ.37,100 బేసిక్ వేతనంతో మొత్తం రూ.91,450 వేతనం లభిస్తుంది.


APPSC Recruitment 2021: అప్లై చేయు విధానం.

  • Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.
  • Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
  • Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
  • Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
  • Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
  • Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి.
  • Step 8- Online Application Submission పైన క్లిక్ చేయాలి.
  • Step 9- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
  • Step 10- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
  • Step 11- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.


NOTIFICATION


APPLY HERE


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0