Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The impact of social media on childhood.

వద్దంటే వినరు .. కాదంటే కన్నీరు!

The impact of social media on childhood.

  • బాల్యంపై సామాజిక మాధ్యమాల ప్రభావం.
  • చరవాణులకు బానిసలవుతున్న పిల్లలు.


‘ఆ పిల్లాడు చదివేది 9వ తరగతి సామాజిక మాధ్యమాల ద్వారా కోల్‌కతాలో 12వ తరగతి విద్యార్థినితో పరిచయం. గంటల తరబడి మాట్లాడడం కొన్నాళ్లకు తనను చూసేందుకు వెళ్తానంటూ ఇంట్లో గొడవ ప్రారంభించాడు. రెండ్రోజులు తిండి మానేసి గదికే పరిమితమయ్యాడు. ఒక్కగానొక్క బిడ్డ ఏమవుతాడనే భయంతో తండ్రి తానే తీసుకెళ్తానంటూ’’ హామీనివ్వటంతో శాంతించాడు.


‘7వ తరగతి విద్యార్థిని. ఓరోజు 12 గంటలపాటు ఆన్‌లైన్‌ గేమ్స్‌తో చరవాణికి అతుక్కుపోయింది. తర్వాత వింతగా ప్రవర్తిస్తుండటంతో భయపడిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండ్రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచితే గానీ సాధారణ స్థితికి రాలేక పోయిదంటూ’’ చందానగర్‌ కు చెందిన ఆ బాలిక మేనమామ వాపోయారు.

వయసుకు మించిన ఆలోచన. తమకే అంతా తెలుసనే వాదన. ఎదిగే పిల్లల్లో సహజంగా కనిపించే లక్షణాలు. మంచిచెడుల విచక్షణ తెలియని వయసులో కొత్త వాటికి ఇట్టే ఆకర్షితులవుతుంటారు. ఆన్‌లైన్‌ పాఠాలతో చేరువైన చరవాణులు బాల్యాన్ని బందీగా మార్చాయి. కన్నవారిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

కొవిడ్‌ నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలో సుమారు 20-22 లక్షల మంది విద్యార్థులకు చరవాణులే తరగతి గదులయ్యాయి. విరామంలో సరదాగా ప్రారంభించిన ఆన్‌లైన్‌ గేమ్స్‌, ఛాటింగ్‌ వారి ఆలోచనలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మానసిక పరిణితిని దెబ్బతీస్తున్నాయి. బానిసలుగా మార్చాయి.

రంగుల లోకం.. అయోమయం


*ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దని తండ్రి మందలించటంతో ఇంటర్‌ విద్యార్థిని(17) ఆత్మహత్యకు పాల్పడింది. మరో ఘటనలో 7వ తరగతి చదివే కుమార్తె తరచూ ఫోన్‌లో ఛాటింగ్‌ చేస్తోందని కన్నవారు కోప్పడటంతో కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకొంది. యుక్తవయసుకు చేరే పిల్లలే గంటల కొద్దీ ఛాటింగ్‌ చేస్తున్నారు. విరామంలో అంతర్జాలంలో ఇష్టమైన అంశాలను వెతుకుతున్నారు. వ్యక్తిగత అభిరుచులు, సామాజిక స్నేహాలతో అవతలి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.*


*పట్టలేనంత కోపం ఎందుకంటే..*


*తమకు పరిచయమైన కొత్త ప్రపంచం, పరిచయాలు సెల్‌ఫోన్‌ లేకపోతే దూరమవుతాయనేంత వరకూ చేరటమే బానిసగా మారటమంటూ సైకాలజిస్టు డాక్టర్‌ అనిత ఆరే విశ్లేషించారు.*


 *తీసుకుంటారనే కాదు.. అకస్మాత్తుగా లాక్కున్నా కోప్పడతారు .. ఏడుస్తారు.. బెదిరింపులకు దిగేందుకు కారణమన్నారు. మొబైల్‌ ఫోన్లకు బానిసైన పిల్లలు సామాజిక జీవితానికి దూరమవుతున్నారు. బంధాలు, తెలియకుండా పెరుగుతున్నారు. పిల్లలు ఫోన్లకు దూరంగా ఉండేలా ఇతర పనులు పురమాయించాలి. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, వ్యాయామం అలవరచాలి.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The impact of social media on childhood."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0