Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SS-WG Casual Leaves Clarification

 SS-WG Casual Leaves Clarification: కేవలం 15 శలవులు మాత్రమే వాడుకోవాలి.

SS-WG Casual Leaves Clarification


జిల్లా విద్యాశాఖాధికారి మరియు ఎక్స్‌ - అఫిషియో ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌, సమగ్ర శిక్ష , పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరువారి ఉత్తర్వులు

ప్రస్తుతం: శ్రీమతి సి.వి. రేణుక, ఎం.ఎస్‌సి.. బి.ఇడి...

ఆర్‌.సి.వెం.1350 /ఎస్‌.ఎస్‌./సి/2021,             తేదీ: -10-2021

విషయము:సమగ్ర శిక్ష పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు - మండల వనరుల కేంద్రములనందు పనిచేయుచున్న ఆపరేటర్లు / MIS కోఆర్జినేటర్లు / మెస్సెంజర్లు / IERT లు గాని, స్కూల్‌ కాంప్లెక్స్‌ నందు పనిచేస్తున్న CRP లకు, పాఠశాలనందు పనిచేస్తున్న పార్ట్‌ టైమ్‌ ఇన్‌ స్టక్టర్స్‌ ల సాధారణ శెలవులకు సంబంధించి - మండల విద్యా శాఖాధికారులకు సూచనలు ఇచ్చుట - గురించి.

సూచిక: ఈ కార్యాలయపు అకడమిక్‌ మోనిటరింగ్‌ అధికారి వారి లేఖ తేదీ: 11.10.2021.

*****

West Godavari Casual Leaves Clarification Samagra Siksha Employees: జిల్లాలోని మండల వనరుల కేంద్రములనందు పనిచేయుచున్న డాటా ఎంట్రీ ఆపరేటర్లు / MIS కోఆర్జినేటర్లు / మెస్సెంజర్లు / IERT లు గాని, స్కూల్‌ కాంప్లెక్స్‌ నందు పనిచేస్తున్న CRP లకు, పాఠశాలనందు పనిచేస్తున్న పార్ట్‌ టైమ్‌ ఇనస్టక్టర్ల లకు ప్రతి విద్యా సంవత్సరము నకు గాను 15 సాధారణ సెలవులు మాత్రమే ప్రభుత్వ నిబంధనల మేరకు మంజూరుచేయబడును. కావున పైన తెలిపిన సి సిబ్బంది అందరూ వారికి కేటాయించిన 15 సాధారణ శెలవులు మాత్రమే వినియోగించుకోవలసినది గాను, మరియు ఇతర ఎటువంటి సెలవులు మంజూరు చేయవలెనన్నా శ్రీయుత అదనపు పథక సమన్వయకర్త, సమగ్ర శిక్ష, ప.గో.జిల్లా, ఏలూరు వారి ముందస్తు అనుమతి ఉత్తర్వులు తీసుకొని మాత్రమే వారికి సెలవులు మంజూరు చేయవలసినదిగాను, ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సెలవులు వారికి మంజూరు చేయకూడదని జిల్లాలోని అందరు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయడమైనది.

కావున, జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు/పాఠశాల ఉప తనిఖీ అధికారులు పై ఆదేశముల ననుసరించి ఆపరేటర్లు / MIS కోఆర్జినేటర్లు / మెస్సెంజర్లు / IERT లు గాని, స్కూల్‌ కాంప్లెక్స్‌ నందు పనిచేస్తున్న CRP లకు, పాఠశాలనందు పనిచేస్తున్న పార్ట్‌ టైమ్‌ ఇన్‌ స్టక్టర్స్‌ లకు అదనపు పథక సమన్వయకర్త, సమగ్ర శిక్ష, ప.గో.జిల్లా, ఏలూరు వారి ముందస్తు అనుమతి లేకుండా సాధారణ సెలవులు మినహా ఏ ఇతర సెలవులు మంజూరు చేయుఅధికారము లేదని మరియు వారి వర్క్‌ డన్‌ స్టేట్‌ మెంట్స్‌ ప్రతి నెల ప్రధానోపాధ్యాయుల నుండి తీసుకోకుండా 'వారికి జీతము చేయరాదని , అట్లు మంజూరు చేసినచో సదరు మండల విద్యాశాఖాధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకొనబడునని మరియు వారి నుండి సదరు మొత్తాలను రికవరీ చేయబడునని తెలియజేయడమైనది.

 Download Copy

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SS-WG Casual Leaves Clarification"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0