This time we will edit the Group-1 answer sheets by hand.
గ్రూప్ -1 జవాబుపత్రాలను ఈసారికి చేతితోనే దిద్దిస్తాం.
సమయం ఆదాకే హైకోర్టు తీర్పుపై 'సుప్రీం'కి వెళ్లడంలేదు
రెండు రోజుల్లో జూనియర్ అసిస్టెంట్ల నోటిఫికేషన్ జారీ
ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడి
ఈనాడు, అమరావతి: హైకోర్టు ఆదేశాలను గౌరవించి గ్రూపు-1 ప్రధాన పరీక్షల జవాబుపత్రాలను సంప్రదాయ విధానంలోనే మూల్యాంకనం చేస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు.
పెరగనున్న గ్రూపు-1, 2 ఉద్యోగ ఖాళీలు
గ్రూపు-1, 2 ఉద్యోగ ఖాళీలు పెంచాలని ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించిందని కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు వెల్లడించారు. ''ప్రభుత్వ ఆదేశాలతో ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 650 జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తాం. ఈ వారంలోనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తాం. గత 18 నెలల్లో 30 నోటిఫికేషన్ల ద్వారా మూడు వేల నియామకాలు పూర్తిచేశాం. న్యాయ వివాదం కారణంగా పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోంది. కొవిడ్ సమయంలోనూ దేశంలోనే అధిక సంఖ్యలో నియామకాలు ఏపీపీఎస్సీ ద్వారానే జరిగాయి. శాఖాపరమైన పరీక్షల ఫలితాలను 24 నుంచి 48 గంటల్లోనే వెల్లడించాం'' అని వివరించారు.
'క్యాలెండర్'ను అనుసరించడంలో ఇబ్బందులు
క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనల జారీలో సమస్యలొస్తున్నట్లు కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. ''కేంద్రాల ఎంపికలో సంక్లిష్టత కారణంగా నోటిఫికేషన్ల జారీ సమయంలోనే పరీక్షల తేదీలు ప్రకటించలేకపోతున్నాం. ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చి, దరఖాస్తులు స్వీకరిస్తాం. ఆ తరువాత పరీక్షల తేదీలు ప్రకటిస్తాం'' అని తెలిపారు.
0 Response to "This time we will edit the Group-1 answer sheets by hand."
Post a Comment