AIR India Recruitment
AIR India Recruitment : ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ .. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక .
AIR India Recruitment 2021: ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఎయిర్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్ లిటిమెట్ (ఏఐఏహెచ్‌ఎల్)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వీటిలో చీఫ్ ప్రాపర్టీస్ అండ్ మానిటైజేషన్ ఆఫీసర్ (01), చీఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (01), డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (01), మేనేజర్ (04), ఆఫీసర్ (03) పోస్టులు ఉన్నాయి.
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో లా డిగ్రీ/ ఎల్‌ఎల్‌ఎం, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, సీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు తమ పూర్తి వివరాలను కంపెనీ సెక్రెటరీ, ఏఐ అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్, రూమ్ నెం 208, సెకండ్ ఫ్లోర్, ఏఐ రిజర్వేషన్ బిల్డింగ్, సఫ్దార్‌జంగ్ ఎయిర్ పోర్ట్, న్యూఢిల్లీ – 110003 అడ్రస్‌కు పంపించాలి.
అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు 07-12-021ని చివరి తేదీగా నిర్ణయించారు.
0 Response to "AIR India Recruitment "
Post a Comment