Sarpanch Teacharamma
సర్పంచ్ టీచరమ్మ
అదొక గిరిజన గ్రామం. అక్కడి వారంతా పేదలు. అక్షరానికి దూరంగా ఉన్నవారు. కనీసం తమ పిల్లలైనా చదివించుకోవాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు. అయితే అక్కడ ఉన్న ఒక్క పాఠశాలకు ఉపాధ్యాయుడే కరువైన దుస్థితి. కొంతకాలంగా ఉపాధ్యాయుడిని నియమించకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం స్కూలు మూసివేయాలను యోచనలో ఉంది. ఈ పరిస్థితుల్లో పిల్లల బాగు కోసం ఆ ఊరి మహిళా సర్పంచ్ టీచరమ్మగా మారారు. బోధకురాలిగానే కాదు, ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడు వచ్చేవరకు పోరాటం చేస్తానని కంకణం కట్టుకున్నారు. పాఠశాల కోసం ఓ వైపు పోరాటం, మరో వైపు బోధన కొనసాగిస్తున్న ఆమె డుంబ్రిగుండ మండల సర్పంచ్ పాంగి సునీత.
విశాఖ జిల్లా అరకు నియోజకవర్గ డుంబ్రిగుడ మండలం గసభ పంచాయతీ సర్పంచ్‌గా సిపిఎం నుంచి పాంగి సునీత ఈ ఏడాది జరిగిన ఎనిుకల్లో గెలుపొందారు. తన పంచాయతీ పరిధిలోని14 గ్రామాల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తన పంచాయతీ పరిధిలోకి వచ్చే జంగిడివలస పాఠశాల సమస్య ఆమె దృష్టికి వచ్చింది. విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏకంగా పాఠశాల మూతబడటంతో అక్కడి విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన విషయాన్ని గుర్తించారు. కూలి పనులకు వెళ్తున్న చిన్నారులను చూసి చలించిపోయారు.
బోధకురాలిగా సేవలు
'2013లో జంగిడివలసలో ప్రభుత్వం ఓ ఉపాధ్యాయున్ని నియమించి విద్యాబోధనను ప్రారంభించింది. పాఠశాలకు భవనాన్ని కేటాయించకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ఇంటి వరండాలోనే విద్యార్థుల చదువులు కొనసాగుతూ వచ్చాయి. 2020 మార్చిలో కరోనా తొలి దశ విజృంభిస్తున్న తరుణంలో ఇక్కడి ఉపాధ్యాయున్ని నిలిపివేశారు. ఆ తరువాత సాధారణ పరిస్థితులు నెలకొన్నా మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయున్ని స్థానిక పాఠశాలకు కేటాయించలేదు. ఇదెంతో దారుణమైన నిర్ణయం కదా' అని అంటారు సునీత. అదే సమయంలో ఉపాధ్యాయుని నియామకం కోసం గ్రామస్తుల సహకారంతో పోరాటం సాగిస్తున్నారు.
జంగిడివలస పాఠశాలలో ప్రస్తుతం 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పిల్లలు విద్యకుదూరం కాకూడదనే సునీత పాఠాలు చెబుతున్నారు. అందుకోసం ఆమె ప్రతి రోజూ తన స్వగ్రామమైన మొర్రిగుడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి జంగిడివలస వస్తున్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకూ విద్యాబోధన చేస్తున్నారు. అక్షరమాల, గుణింతాలు, లెక్కలు, విజ్ఞానదాయక విషయాలు చెబుతున్నారు. బిఎ, డిఎడ్ చదువుకున్న సునీత ఉపాధ్యాయ శిక్షణ కూడా తీసుకున్నారు. ఆ అనుభవమే ఇప్పుడు విద్యార్థులకు తోడ్పడుతోంది.
'ఎనిమిది నెలల కుమారుడితో సునీతమ్మ మా గ్రామం వచ్చి పాఠాలు చెబుతున్నారు. బాలింతరాలుగా ఉన్న ఆమె మా కోసం ఎంతో కష్టపడుతున్నారు. పాఠశాలను తెరిపించేందుకు ఆమె చేస్తును ప్రయత్నం వృథా కాదు' అంటారు ఆ గ్రామస్తులు. స్కూలు మూతవేసే యోచనలో ను ప్రభుత్వం విద్యార్థులకు అందే ప్రభుత్వ సాయాన్ని నిలిపివేసింది. దీంతో ఆ విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదని యూనిటీ ఫర్ ఛారిటీ ట్రస్టు సాయంతో పలకలు, పుస్తకాలు, పెన్సిళ్లు వంటి 10 రకాల విద్యా సామగ్రిని సునీత అందజేశారు. విద్యార్థులకు ఏం కావాలనాు వాటిని సమకూర్చే పనిలో నిమగుమైన ఆమె పాఠశాల సమస్యపై పోరాటం చేయడం చూసిన ఆ గ్రామస్తులు ఆమెపై అపార గౌరవం కనబరుస్తున్నారు.
భర్త ప్రోత్సాహం
సర్పంచ్‌గా గెలుపొందిన సునీత అతి తక్కువ కాలంలోనే 200 మందికి పోడు పట్టాలు అందేలా కృషి చేశారు. 60 మందికి పింఛన్లు వచ్చేలా చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. సునీత భర్త సురేష్ కూడా సిపిఎం తరపున గతంలో సర్పంచ్‌గా గెలిచి విశేష సేవలందించారు. రూ.5 కోట్లతో అరకు మెయిన్ రోడ్డు నుంచి గసభ గ్రామ పంచాయతీ వరకూ తారు రోడ్డు వేయడం, 14 గ్రామాలకురూ.70 లక్షలతో తాగునీటి సౌకర్యం కల్పించడం, రూ.30 లక్షలతో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం వంటి ప్రజోపయోగ పనులు చేశారు. ఆయన తరువాత సునీత సర్పంచ్‌గా గెలవడంతో తన అనుభవాలను కూడా ఆమెకు చెబుతూ మరింత ఆదర్శవంత పాలన అందించేలా కృషి చేస్తున్నారు. ఈ యువ దంపతుల సేవలను మన్యంలోని పలువురు ప్రశంసిస్తున్నారు. వీళ్లలా మిగిలిన ప్రజాప్రతినిధులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
పాఠశాల తెరుచుకునే వరకూ పోరాటం
జంగిడివలసలో పాఠశాల తెరుచుకునే వరకూ పోరాటం సాగిస్తాం. నెల రోజులుగా ఉద్యమం తీవ్రంగా సాగుతోంది. పాఠశాలకుఉపాధ్యాయునిు నియమిస్తామనిఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణలిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఇంతవరకుఅది నెరవలేదు. పాఠశాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తునాురు. సమస్య పరిష్కారమయ్యే వరకూ మా పోరాటం కొనసాగుతుంది.
- పి.సునీత, గసభ పంచాయతీ సర్పంచ్
0 Response to "Sarpanch Teacharamma"
Post a Comment