Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh Jobs

 Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు .

Andhra Pradesh Jobs


Andhra Pradesh Jobs  ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు (Outsourcing Jobs) కోరుకునేవారికి అలర్ట్. పలు ఖాళీల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోగలరు.

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్-విజయవాడ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వాచ్‌మెన్, స్వీపర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 23 ఖాళీలున్నాయి. ఇవి ఔట్‌సోర్సింగ్ పోస్టులు (Outsourcing Jobs) మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 20 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పోస్టులో పంపాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు23విద్యార్హతలువేతనం
జూనియర్ అసిస్టెంట్08గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, ఆఫీస్ ఆటోమేషన్ తెలిసి ఉండాలి.రూ.15,000
రికార్డ్ అసిస్టెంట్01ఇంటర్మీడియట్ పాస్ కావాలి.రూ.12,000
ఆఫీస్ సబ్ ఆర్డినేట్12ఏడో తరగతి పాస్ కావాలి.రూ.12,000
వాచ్‌మెన్01ఐదో తరగతి పాస్ కావాలి.రూ.12,000
స్వీపర్01తెలుగులో రాయడం, చదవటం తెలిసి ఉండాలి.రూ.12,000


దరఖాస్తు ప్రారంభం-  11.11.2021

దరఖాస్తుకు చివరి తేదీ- 20.11.2021  సాయంత్రం 5 గంటలు

దరఖాస్తు నిబంధనలు- ఒక అభ్యర్థి వేర్వేరు పోస్టులకు దరఖాస్తు వేర్వేరు అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేస్తే విద్యార్హతలను పరిగణలోకి తీసుకొని ఒకే దరఖాస్తుగా పరిగణిస్తారు.

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

వయస్సు- అభ్యర్థుల వయస్సు 2021 అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది

Andhra Pradesh Jobs: దరఖాస్తు విధానం

  • Step 1- అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారిక వెబ్‌సైట్ https://www.apindustries.gov.in/ ఓపెన్ చేయాలి.
  • Step 2- హోమ్ పేజీలో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.
  • Step 3- నోటిఫికేషన్ చివర్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.
  • Step 4- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి,
  • నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 నవంబర్ 20 సాయంత్రం 5 గంటల్లోగా పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

The Director of Industries,

1st Floor, Government Printing Press Buildings,

Muthyalamapadu, Vijayawada.

PIN Code- 520011

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Andhra Pradesh Jobs"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0