Central Govt Jobs
Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండిలా.జీతం రూ.35 వేలు.
భారత అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని Directorate of Atomic Minerals for Exploration and Research (AMD / AMDER) వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 124
మొత్తం 124 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టుల్లో సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, అప్పర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి గానూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక వేతనం విషయానికి వస్తే కనీసం 18000 నుంచి గరిష్టంగా 35 వేల వరకూ లభించే వీలుంది.
పోస్టులు: సైంటిఫిక్ అసిస్టెంట్-బి, టెక్నీషియన్-బి, అప్పర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ తదితరాలు
విభాగాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియోలజీ, ఎలక్ట్రాని క్స్/ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రికల్, సివిల్, ల్యాబొరేటరీ, ప్లంబర్ తదితరాలు
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ/ఎన్‌సీవీటీ, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఎస్సీ, ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి
జీతం వివరాలు: నెలకు రూ.18,000 నుంచి రూ.35,400 - వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్కిల్ టెస్ట్/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు. ఇతరులు పోస్టుల్ని అనుసరించి రూ.100 నుంచి రూ.200 వరకు చెల్లించాలి
దరఖాస్తులకు చివరి తేదీ: 24.11.21
వెబ్ సైట్: https://www.amd.gov.in/
0 Response to "Central Govt Jobs"
Post a Comment