Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PF: Is this process complete? Otherwise the PF will not be credited!

PF: ఈ ప్రక్రియ పూర్తి చేశారా? లేదంటే పీఎఫ్‌ జమ కాదు!


ముంబయి‌: మీరు ఉద్యోగులా? మీకు మీ సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్‌) ప్రయోజనాలు కల్పిస్తోందా? అయితే, మీకు ఓ ముఖ్య గమనిక! ఈ నెలాఖరు కల్లా మీరు మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ‘సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్‌)ను ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. లేదంటే.. ‘ఎల‌క్ట్రానిక్ చ‌లాన్ క‌మ్ రిట‌ర్న్ (ఈసీఆర్‌)’ భర్తీ కాదు. అంటే మీ పీఎఫ్ ఖాతాల్లో వచ్చే నెల నుంచి కంపెనీ వాటా జమ కాదు. వెంటనే ఉద్యోగుల యూఏఎన్‌ను ఆధార్‌తో అనుసంధానించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) యాజమాన్యాలకు సైతం తెలియజేసింది. ఇంత‌కు ముందు యూఏఎన్‌-ఆధార్ అనుసంధానానికి 31 ఆగస్టు 2021 తుది గడువుగా విధించారు. అనంతరం దాన్ని 2021 నవంబరు 30 వ‌ర‌కు పొడిగించారు.

ఆధార్‌ అనుసంధానం జరగకపోతే.. పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వం అందించే ప్రయోజనాలకు కూడా దూరమవుతారు. బీమా ప్రయోజనాలు సైతం అందవు.

ఈపీఎఫ్ - ఆధార్ లింక్ ఆన్‌లైన్ ఎలా చేయాలో వివరణ

  • ఈపీఎఫ్ఓ పోర్టల్‌ను తెరిచి, ఎడ‌మ వైపు ఉన్న ఈకేవైసీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  •  ఇక్కడ యూఏఎన్‌, రిజిస్టర్డ్‌ మొబైల్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి.
  • జ‌న‌రేట్ ‘ఓటీపీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • రిజిస్టర్డ్‌ మొబైల్ నెంబ‌రుకు వ‌చ్చిన ‘ఓటీపీ’ని ఎంట‌ర్ చేసి, జండ‌ర్‌(లింగం)ని సెలక్ట్ చేసుకోవాలి.
  • ఇక్కడ ఆధార్ నంబ‌రును ఎంట‌ర్ చేసి ‘ఆధార్ వెరిఫికేష‌న్’ను ఎంపిక చేసుకోవాలి.
  • ప్రస్తుతం ఉప‌యయోగిస్తున్న ‘మొబైల్ లేదా ఈ-మెయిల్’ ద్వారా వెరిఫికేష‌న్ పూర్తిచేయొచ్చు.
  •  వెరిఫికేష‌న్ కోసం మ‌రోసారి ‘ఓటీపీ’ వ‌స్తుంది.
  • ‘ఓటీపీ’ని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయాలి.
  • దీంతో ఈపీఎఫ్‌, యూఏఎన్ ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PF: Is this process complete? Otherwise the PF will not be credited!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0